ఇటు ఈడీ వేడి.అటు రిలీఫ్‌ల ర్యాలీ


ఓ వైపు వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పంలో దూసుకుపోతోంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ కూడా అదే స్థాయిలో వెళ్తూ కొన్ని ఆస్తులు అటాచ్ చేసింది. ఐతే ఇవన్నీ జగన్ మోహన్ రెడ్డి ఆస్తులని ప్రచారం జరగడం విశేషం. ఇందూటెక్, శ్యాంప్రసాద్ రెడ్డి ఆస్తులు జగన్ ఆస్తులు ఎలా అవుతాయ్. ( నాది అజ్ఞానమే) . ఈ గందరగోళం ఇలా సాగుతుంటే ఇంకోవైపు ఎమార్ ప్రాపర్టీస్ కేసులో కోనేరు మధు, ఐఎఎస్ ఎల్ వి సుబ్రహ్మణ్యానికి సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం అంతకంటే విశేషం.

ముందు నుంచీ జగన్ మోహన్ రెడ్డిపై కేసులు నిలబడవనేది ఓ వర్గం వాదిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వాల నిర్ణయాలను ఇంకో వ్యక్తికి లబ్ది చేసాయని నిరూపించడం కష్టం . ఎందుకంటే ముందు లంచం తీసుకుని పాలసీలు తయారు చేస్తే సాక్ష్యాలు దొరుకుతాయి. కానీ ముందే పాలసీలు తయారు చేసి కేటాయింపులు జరిగిన తర్వాత ఆ కేటాయింపుల లబ్దిదారులు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారంటే దానికి రుజువులు ఉండకపోవచ్చు. ఉంటే ఈ పాటికి జగన్ కేసు ఓ కొలిక్కి  రావాలి కదా..!

పైగా అప్పటికి జగన్ ఏ పబ్లిక్ పోస్టు (పబ్లిక్ సర్వెంట్ కాదు) లో లేడు. ఆయనపై దాఖలు చేసిన కేసులు ఈ ప్రాతిపదికనే దాఖలు అయ్యాయ్. పబ్లిక్ సర్వెంట్లు అంటే ప్రజాప్రతినిధులు, అధికారులు. మరి ఈ కేసుల కాలం 2009కి ముందు జరిగిన కేటాయింపుల పై..ఆ రకంగానూ ఆయనపై కేసులు నిలబడవనే వాదన పైన పేర్కొన్న సుబ్రహ్మణ్యం, కోనేరు మధు, అంతకు ముందు శ్రీదేవి విడుదలతో నిర్ధారించబడినవి అఁటారు. ఇక ఆస్తుల కేసుల్లో తీర్పులు ఎప్పటికప్పుడు నూతనత్వాన్నే సిధ్దిస్తాయ్. అందుకే ఈ మలుపులు రానున్న జడ్జిమెంట్ కి సంకేతంగా చూసేవాళ్లుంటారు.ఐతే జగన్ కి శిక్షపడాలని కోరుకునే వాళ్లు మాత్రం మధుకోడా, జయలలిత కేసులను ఉదహరిస్తుంటారు. 

Comments