హార్దిక పటేల్..నో డౌట్ పాలిటిక్స్‌లో ఆరితేరాడు


గుజరాత్‌లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి అందరికంటే హార్దిక్ పటేల్‌నే బాధించిందంటారు. ఇక ఇప్పుట్లో అతగాడు పైకి లేవడని..అదంతా ముగిసిన అధ్యాయమని కూడా అనుకున్నవాళ్లు ఉన్నారు. ఐతే బిజెపిలోని అసంతృప్తిని క్యాష్ చేసుకోవడానికి ఏమాత్రం వెరపు లేకుండా, కమాన్ ఓ 10మందిని తీసుకురా ప్రభుత్వం ఏర్పాటు చేద్దామంటూ నితీష్ పటేల్‌కి పిలుపు ఇవ్వడంతోనే ఇతగాడి తెంపరితనం ఏంటో అర్ధమైపోయింది. ఇప్పుడు ప్రవీణ్ తొగాడియా అలా కన్నీళ్లు పెట్టుకున్నాడో లేదో వెంటనే గేలం వేసేశాడు. 

నన్ను చంపడానికి కుట్ర జరుగుతోంది..దాని వెనుక కేంద్రం ఉంది అంటూ ప్రవీణ్ తొగాడియా శోకండాలు పెట్టడం పూర్తైన గంటల్లోనే హార్దిక్ పటేల్ రంగంలోకి దిగిపోయాడు.అమిత్‌షా, మోడీ ఎలాంటి వాళ్లో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ అతనికి సపోర్ట్‌గా నిలిచాడు. ఇలా చేయడం ద్వారా ఓ వర్గానికి తాను దూరం అనే కామెంట్‌ని దూరం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పట్లో ఎన్నికలు లేవ్..పైగా ఇలాంటి ట్వీట్లతో వచ్చేదేం  ఉంటుంది అన్నవాళ్లకి హార్దిక్ పటేల్ తన విజన్‌ని బాగానే ప్రదర్శించాడు..అవసరం వస్తే ఎలాంటి నేతలనైనా అక్కున చేర్చుకునేందుకు చేరేందుకు సిధ్దమంటూ  పాతికేళ్లు కూడా రాకముందే తన తెలివితేటలు ప్రదర్శించినట్లేనంటూ విషయాలను గమనిస్తున్నవాళ్లకి అర్ధమైపోతోంది.

అసలు రాష్ట్రీయ సేవక్ సంఘ్‌ ఎప్పుడూ ఇతగాడికి మద్దతుగా నిలిచింది  లేదు. రకరకాల సందర్భాల్లో హిందూ అభిమాన పార్టీలతో వైరమే తప్ప స్నేహం లేదు..అయినా ప్రవీణ్ తొగాడియాకి సపోర్ట్ తక్షణమే ప్రకటించడంలో కాక పుట్టించాడనే చెప్పాలి. యువనేతలుగా చెప్పుకునే రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, జిగ్నేష్ మేవానీ, సచిన్ పైలట్, జగన్, పవన్ కల్యాణ్, నారా లోకేష్ వంటి నేతలకు కూడా ఇలాంటి టాక్టిక్స్ తెలియవు. ఇతర పార్టీలనేతలకు మద్దతుగా ఇంత ఓపెన్‌గా సైదోడుగా నిలవడం రానున్న రోజుల్లో హార్దిక పటేల్ ఫ్యూచర్‌ని చూపిస్తోంది. ఖచ్చితంగా ప్రతి అంశాన్ని పట్టించుకోవడం దానికి తగ్గట్లుగా ఏదోక స్టాండ్ తీసుకోవడం జనంలో నానడానికి మంచి అవకాశాలు అదే పని చేస్తున్నాడు ఇప్పుడితగాడు.

Comments