జగన్ ఓ కస్టోడియన్, అసలు అర్ధం తెలీని మంత్రి కథ


ప్రత్యేక హోదా అంటూ ఇస్తే  బిజెపితో కలిసి పోటీ చేస్తానని వైఎస్ జగన్ చెప్పిన తర్వాత ఇంకా రాజకీయ ప్రకంపనలు
వస్తూనే ఉన్నాయ్. ఒకళ్లు ఢిల్లీకి దాసోహం అంటున్నారని విమర్శిస్తే, మరొకరు సాగిలబడ్డారంటూ తెగిడారు. వైఎస్సార్సీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అయితే జగన్ క్రిస్టియన్ కాదు..క్రిటియన్ కాదంటూ మత ప్రస్తావనతో విమర్శించారు..అయితే ఇదే క్రమంలో మరి బికామ్ ఫిజిక్స్ ఎమ్మెల్యేలాగా..జగన్ ఓ కస్టోడియన్ మాత్రమేనంటూ నోరు జారారు. అసలా పదం వాడటానికి ఈజీగా జగన్‌పై కేసులు ఉన్నాయ్ కాబట్టి కోర్టులు చుట్టూ తిరుగుతుంటారని గుర్తొచ్చేలా వాడటమే కానీ..కస్టోడియన్ అంటే రక్షకుడు అనే అర్ధం వస్తుంది. ఇది తెలీక పాపం ఆదినారాయణరెడ్డి టంగ్ స్లిప్పవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రెచ్చిపోయారు

పంది ఎంత పెరిగినా నంది కాలేదంటూ తీవ్రమైన పదజాలంతో మంత్రి ఆదినారాయణరెడ్డికి చీవాట్లు పెట్టాడాయన. ఎవరు ఔనన్నా కాదన్నాఆదినారాయణరెడ్డి గెలిచింది వైఎస్సార్సీపీ టిక్కెట్‌పై..రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఎంజాయ్ చేస్తుందీ నిజమే. ఎక్కడ ఈ విషయం జాతీయస్థాయికి వెళ్లి బై ఎలక్షన్స్‌కి వెళ్లాల్సి వస్తుందనే ఉక్రోషంతోనే ఇలా రెచ్చిపోతున్నారని ఈ జంపింగ్ జపాంగ్‌లపై కామెంట్స్ వస్తున్నాయ్.

అయితే ఇదే సందర్భంలో  స్టేటస్ ఇచ్చేది లేదు..సచ్చేది లేదంటూ సాక్షాత్తూ మంత్రే మాట్లాడటం దారుణం. ఔచిత్యాలు రాజకీయ అవసరాలు పక్కనబెడితే ఒకప్పుడు అంతా అద్భుతం అని..అవసరం అని మాట్లాడిన నోటితోనే ఇలా మాట మార్చడం ఎవరూ సమర్ధించరు. ఇంకా దానిపై ఎంత సైలెంట్‌గా ఉఁటే అంత మైలైజీ తెలుగుదేశానికే వస్తుంది తప్ప దానిపై నానాయాగీ చేసినంత మాత్రాన టిడిపి-బిజెపి కూటమి హామీ ఇచ్చిన మాట అబద్దం కాకుండా పోదు. అది వదిలేసి ప్రతిపక్షాలపై నెపం వేస్తూ కాలం వెళ్లదీస్తే..కన్నుమూసి తెరిచేలోపల ఎన్నికలు వస్తాయ్. అప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం ఏదో ప్రజలే తీసుకుంటారు

Comments