జగన్ ఇప్పుడు చెప్పు బిజెపితొ నడుస్తావా! కలసి గెలుస్తావా?


ఎన్డీఏ-2కి చివరి బడ్జెట్ పూర్తైంది..అఁటే ఈ కామెంట్‌ని ఆ కూటమి తిరిగి అధికారంలొకి రాదనే ఉద్దేశంతొ వాడుకొవచ్చు లేదంటే ఈ టర్మ్‌లొ ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ అనే అర్ధంలొనూ వాడుకొవచ్చు. దేశం సంగతి కాసేపు పక్కనబెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని..అక్కడి జనాన్ని బిజెపి ఎలా చూస్తుందొ తెలీదు. ఒక రాజధాని అవసరం దానికి వసతులు కల్పించాలి...అక్కడ జనానికి జరుగుబాటు చూడాలి..ఇలాంటివేం పట్టినట్లు లేదు. కనీసం ఏ ఊసూ లేకుండా అంత ధీమాగా హ్యాండిస్తున్నారంటే ఏంటి వాళ్ల ధైర్యం..

చంద్రబాబు ఎటూ అడగలేడు..అడిగినా ఇక ఇప్పుడు చేసేదేం లేదు..మనకు బాబు పొతే జగన్ ఉన్నాడన్న కపటనాటకమా..! ఇలాంటి డ్రామానే గతంలొ కాంగ్రెస్ ఆడి..సర్వనాశనం అయిందనే టాక్ ఉంది..మరి అలాంటి నాటకానికి జగన్ వంతపలుకుతాడా..! ప్రత్యేక  హొదా ఇస్తే బిజెపికి సపొర్ట్ చేస్తా అన్నాడు..అన్న వెంటనే ఎంత యాగీ  అయిందొ చూశాం..మరిప్పుడు కూడా జగన్ ఆ మాట అనగలడా...లేడనే మనం అర్ధం చేసుకొవచ్చు.
ఎందుకంటే బడ్జెట్ ముగిసిన తర్వాత ఇదొ చెత్త బడ్జెట్ అంటూ మొదట నొరు విప్పిందే విజయసాయిరెడ్డి..ఏపీ జనానికి మొడీ ఏమీ ఒరగబెట్టలేదని పార్లమెంట్ బయట గొట్టాల ముందు వాపొయాడు..SO ఇక్కడ క్లియర్‌గా బిజిెపికి జగన్ అంత అవుట్ రేటెడ్ గా సపొర్ట్ చేయడనేది అర్ధం అవుతుంది.

ప్రత్యేక హొదా అసలు దేనికీ పనికిరాదనే వాదన ముందుకు తెచ్చిన టిడిపి పెద్దలకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. బడ్జెట్‌లొ కూడా అన్యాయం జరిగింది కాబట్టి ఇక బైటికి వస్తున్నాం అని చెప్పుకొవచ్చు..అంటే నాలుగున్నరేళ్లు హ్యాపీగా మంత్రిపదవులు..మిత్ర ప్రయొజనాలు పొంది గాలికి పొయే పిండి కృష్ణార్పణం అన్న టైపులొ అన్నమాట. కానీ ఈ దశలొ జగన్ బిజెపికి దగ్గరవ్వాలనే ప్రయత్నం చేశాడంటే మాత్రం ఖచ్చితంగా ఆత్మహత్యసదృశ్యమే అవుతుంది.

దేశమంతా వదిలేయ్..ఏపీలొ మాత్రం బిజెపి అంటే వళ్లు మండుతుంటుంది..ఎందుకంటే తిరుపతిలొ " అరే హమారా వెంకయ్యా జీ...అరే చంద్రబబునాయ్‌డూజీ.." అంటూ నైస్ గా పంగనామాలు పెట్టి పదవి దక్కించుకున్న మొడీ ఆ తర్వాత ఎక్కడా వాటి ప్రస్తావనే తీసుకురాలేదు..

పైగా అమరావతికి చెంబెడు నీళ్లు మట్టీ తెచ్చానంటూ ఆయింట్ మెంట్ పూశాడు..ఇప్పుడదే మట్టీ నీళ్లతొ బిజెపికి దినం పెట్టాలన్నంత కసిగా ఉన్నారు జనం..మరీ దశలొ జగన్ అలయన్స్‌లొ ఎందుకు కలుస్తాడు..అందులొనూ పాదయాత్రలొ జనం మధ్యలొనే ఉన్నాడు కదా..ఆ మాత్రం పీపుల్స్ పల్స్ తెలీదంటారా!

Comments