ప్రమాదంలో కేఈ రాజకీయ భవిష్యత్తు?

సుప్రీంకోర్టు నేరచరిత్ర ఉన్న అభ్యర్ధుల విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని తీర్పు ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఏపీలో అనుహ్య పరిణామం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా పత్తికొండలో పోయిన సంవత్సరం మే నెలలో వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డిని కొంతమంది హత్య చేశారు..అది డిప్యూటి  సిఎం కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యామ్ బాబు అండతోనే జరిగిందని హతుడి భార్య శ్రీదేవి ఆరోపించారు. పైగా ఛార్జ్‌షీట్లో ముందు శ్యామ్ బాబు పేరు ఉఁడగా..ఆ తర్వాత తొలగించారని కూడా ఆమె తీవ్రంగా ఆరోపించింది అప్పట్లో. వైఎస్ జగన్ కూడా తమ  పార్టీ నేతని చంపించడం వెనుక కేఈ కుటుంబసభ్యులే ఉన్నారని అన్నారు కూడా..ఐతే దాన్ని ప్రతిపక్షాల రొటీన్ డైలాగ్‌గా టిడిపినేతలు కొట్టిపారేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేదని..శ్రీదేవినే పత్తికొండలో పార్టీ కాండిడేట్ అని జగన్ అప్పట్లో పాదయాత్ర ఆరంభంలోనే ప్రకటించాడు.
డోన్ కోర్టులో శ్రీదేవి ప్రవేట్ పిటీషన్ దాఖలు చేసింది.  ఇప్పుడు ఆ ఆరోపణలు నిజమనేలా స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది.   శ్యామ్ బాబుని అరెస్ట్ చేయాలంటూ వారంట్ జారీ చేసింది.  ఇక్కడ ఆరోపణలు నిజమనేలా అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఈ హత్య కేసుని విచారించిన కోర్టు శ్యామ్ బాబుతో పాటు వెల్దుర్ది ఎస్ఐ నాగప్రసాద్‌ని కూడా అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడమే. సదరు నాగప్రసాదే ఆ హత్యకేసుని దర్యాప్తు చేసి చార్జ్ షీట్ దాఖలు చేసింది. అందుకే ఈ కేసు దర్యాప్తు తీరుని కోర్టు తప్పుబట్టినట్లే భావించాలి.
ఇక టైటిల్ జస్టిఫికేషన్ విషయానికి వస్తే, హత్యకేసులో అరెస్ట్ కావడం జైలుశిక్ష అంటూ పడటం  జరిగితే ఇక రాజకీయంగా సమాధి అయినట్లే..పరోక్ష ఎన్నికలలో సీటు తెచ్చుకునేంత సీన్ అయితే ప్రస్తుతానికి కేఈ కుటుంబానికి లేదు. టిడిపిలో పేరుకే డిప్యూటీ సిఎం, రెవెన్యూ మంత్రే తప్ప ఏరోజూ వాటిని వాడుకున్నది లేదు..వాడుకోనిచ్చినదీ లేదు..అందుకే ఈ హత్య కేసు కేఈ కుటుంబానికి ఫ్యూచర్ లేకుండా చేస్తుందేమో అన్న అంచనాలను కలిగిస్తున్నాయ్. 

Comments