చంద్రబాబు హైదరాబాద్‌ని వదిలేసి అమరావతిలో ఎందుకుంటున్నాడో తెలుసా




ఏపీ సిఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృధ్ది చెందాలని..దానికి అన్ని రకాల కేటాయింపులు చేయాలని విపరీతంగా పోరాడాతున్నారు..కష్టపడుతున్నారు..ఇంకా చెప్పాలంటే ఉన్న ఇరవైనాలుగు గంటలూ అందుకే కేటాయిస్తున్నారు అతిశయోక్తి అన్పించినా ఇదే నిజం అని ఆయన ఆయన పుత్రరత్నం..ఇంకా వందిమాగధులు చాలామంది మనల్ని కూడా నమ్మమని
ప్రకటనలు గుప్పిస్తారు.

ఇలా ఎందుకు వ్యంగ్యంగా అంటున్నామంటే కాస్త వెనక్కి వెళ్దాం... 2015 జూన్ 1 ...జనం అంతా టివిల ముందు అతుక్కుపోయారు చూస్తే...రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్ ఇంట్లో డబ్బు కట్టలు ఆఫర్ చేస్తూ దొరికిపోయిన విజువల్స్ ప్లే చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సంచలనం..ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇలా లంచం ఆఫర్ చేస్తూ..తెలుగు ప్రజాప్రతినిధులు ఇలా దొరకడం ఇదే మొదటిసారి. ఇందులో చంద్రబాబు వాయిస్ కూడా  ఉండటంతో ఇక మాటల యుధ్దం తారాస్థాయికి చేరింది. ఏయ్ కేసీఆర్ నీ అంతు తేలుస్తా అంటూ బీరాలు పలికారు చంద్రబాబు..అయితే అదే నెలలో ఢిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత మాత్రం ఇక చంద్రబాబు ష్ గప్ చిప్..అంతేకాదు..హుటాహుటిన మన రాజధాని మనం కట్టుకోవాలంటూ బైల్దేరారు.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది హైదరాబాద్ కామన్ కేపిటల్ గా అంటే ఉమ్మడి రాజధానిగా 2024 వరకూ ఉండొచ్చు. ఐనా ఇలా రాత్రికి రాత్రే టెంట్ ఎత్తేశారు. విపక్షాలు విమర్శించినా పట్టించుకోలేదు..ఐతే ఇది నిజంగా ఏపీ ప్రజలపై ప్రేమేనేమో అని జనం కూడా ప్రతిపక్షాల విమర్శలపై మండిపడ్డారు కూడా..నిజం ఏంటంటే...అసలు  ఆడియోటేపుల్లో ఉన్నది చంద్రబాబే గొంతే అని తేలితే నోటీసులు అందుకోవడం అరెస్టులు జరగడం వంటివి జరిగేవి. సిటీలోనే ఉంటే వెంటనే తెలంగాణా పోలీసులు యాక్టివ్ అవుతారు. అదే అమరావతి అయితే ముందుగా ఏపీ పోలీసుల అనుమతి అవసరం..అదీ కాక విషయం అక్కడిదాకా రాదు కదా..అందుకే అన్ని రకాల జాగ్రత్తలతో చెంద్రబాబుగారు అమరావతి నిర్మాణానికి పూనుకున్నారు. ఇప్పుడీ అంశం ఎందుకు ప్రస్తావన చేయాలి  అంటే నాలుగేళ్లు పూర్తయ్యాయ్. రేపో మాపో అప్పటి ఓటుకు నోటు కేసుకి సంబంధించిన ఆడియోసిడీలపై ఫోరెన్సిక్ నివేదిక రాబోతోందట.. అందుకే ఇప్పుడు పార్లమెంట్ లో ఈ హడావుడి జరుగుతుందనే విమర్శలు ఉన్నాయ్. మరి అమరావతి నిర్మాణం కోసమే రాజధానిని తరలించుకువచ్చినట్లైతే..ఎంతో కొంత పురోగతి ఉండాలి కదా..అందుకే ఈ టాపిక్ ఇప్పుడు బైటికి వస్తోంది

Comments