గల్లా జయదేవ్..ఘనస్వాగతం..మరి ఫుల్ డీటైల్స్ చూడండి


బడ్జెట్ సెషన్స్‌లో తెలుగువాడి వేడి రుచి చూపించిన గల్లా జయదేవ్ ఏపీ ప్రజలు అభినందనలు చెప్తున్నారు. ఐతే ఈ ప్రసంగాలతొ ప్రయొజనం ఉన్నా లేకపొయినా ఈ మాత్రమైనా మాట్లాడగలవారు లేకపొవడమే ఇప్పుడు జయదేవ్ కి భారీగా స్వాగతాలు చేయడం వెనుక ఆంతర్యంగా చూడాలి..ఒక్క స్పీచ్ ఇస్తేనే ఇఁతగా హడావుడి చేస్తే మరి నిజంగా మిగిలిన వాళ్లు కూడా  మూడు నాలుగేళ్లుగా ఇదే స్థాయి పటిమ..సామర్ధ్యం చూపిస్తే..ఎంత బావుండేదొ..ఎన్ని మేళ్లు ఒనగూరేవొ  అన్పించకమానదు. కానీ ఘనస్వాగతాలకు నిజమైన న్యాయం చెప్పిన హామీలు నెరవేర్చినప్పుడే కదా...సరే అది వదిలేసి.ఇక  మన స్టొరీ టైటిల్ జస్టిఫికేషన్ ఇద్దాం..



గల్లా జయదేవ్ చాలామందికి ఆయన ఎంపిగానే ఇన్నాళ్లూ తెలుసు..ఐతే ఆయన బ్యాక్ గ్రవుండ్ చూస్తే మాత్రం వారెవ్వా అనుకోకుండా ఉండరు. ముందుగా ఆయన సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా కొంతమంది తెలుసు..మరి ఆయనకి ఏ రాజకీయ నేపధ్యం లేదా అంటే ఉంది..ఆయన తల్లి గల్లా అరుణకుమారి మాజీ మంత్రి కూడా..కాంగ్రెస్ హయాంలోనే ఆమె మంత్రిగా పని చేశారు..అంటే ఇదేదో పదేళ్లక్రితం అనుకునేరు..1991లోనే నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన కేబినెట్‌లోనే గల్లా అరుణ మంత్రి. . అప్పట్లోనే గల్లా జయదేవ్‌తో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ చుట్టరికంతోనే గుంటూరు జిల్లా నుంచి గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో పోటీకి నిలబడి గెలిచారు. సూపర్ స్టార్ కృష్ణది గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం అని గుర్తుండే ఉంటుంది. గల్లా జయదేవ్ కుటుంబం గురించి ఇంకా వివరాలు చూద్దాం..ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా గల్లా ఫ్యామిలీ చిత్తూరుజిల్లాకి చెందినది..

ఇదేదో ఆషామాషీ ప్రాతినిధ్యం కూడా కాదు..పాతూరి రాజగోపాలనాయుడి కుటుంబం అంటే జిల్లా మొత్తం ప్రసిధ్ది. పెద్ద జమీందార్ల కుటుంబం అన్నమాట. పాతూరి రాజగోపాలనాయుడు అంటే ఒక జమీందారుగా మాత్రమే కాకుండా..ప్రపంచరికార్డు సృష్టించిన ఆచార్య ఎన్‌జి రంగా సహాధ్యాయి కూడా..! 1977-80, 1980-84 మధ్య రెండుసార్లు ఎంపిగా కూడా పని చేశారు..ఆ కాలంలోనే అంటే 1940ల్లోనే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు..ఈయనే నారా చంద్రబాబునాయుడికి రాజకీయ గురువుగా చెప్తారు.  నిజమో కాదో తెలీదు కానీ..చంద్రబాబుతో తన ఏకైక కుమార్తె గల్లా అరుణని ఇచ్చి వివాహం చేసే ఆలోచన ఉండేదంటారు..ఐతే అరుణకుమారి మాత్రం గల్లా రామచంద్రనాయుడిని వివాహం చేసుకోవడంతో గల్లా అరుణకుమారిగా మారారు. 

ఆ తర్వాత ఈ దంపతులు 22ఏళ్లు అమెరికాలో నివసించి వచ్చారు..ఇప్పటి మన స్టోరీలో హీరో అయిన గల్లా జయదేవ్ కూడా అక్కడే తన చదువులు కొనసాగించారు. ఇల్లినోయిస్ యూనివర్సిటీలో పాలిటిక్స్ ఎకనామిక్స్ చదివాడు. జిఎన్‌బి బ్యాటరీస్ అనే అమెరికా సంస్థకి గ్లోబల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పని చేశాడు..ఆ అనుభవంతోనే అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత తల్లిదండ్రులతొ కలసి అమరరాజా  ఇండస్ట్రీస్ స్థాపించారు. తల్లి అరుణకుమారి రాజకీయాల్లోకి బిజీగా ఉండగా..తాను మాత్రం వ్యాపారాలు చూసుకుంటూ ఉండేవారు. ఇక రాష్ట్రవిభజన తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ కి గుడ్‌బై చెప్పేసి టిడిపిలో చేరారు. 2014లో తల్లి అరుణకుమారికి బదులుగా తాను టిక్కెట్ దక్కించుకుని గుంటూరు జిల్లా ఎంపిగా  విజయం సాధించారు. క్రమం తప్పకుండా పార్లమెంట్ సెషన్లకు హాజరవుతూ..రికార్డు సృష్టించారు. మొత్తం ఎంపిల యావరేజ్ హాజరు 80శాతమైతే..ఈయన 84శాతం హాజరు కావడం విశేషం..అలానే ఎంపిలందరి సగటు ప్రశ్నల సంఖ్య 215 అయితే..ఒక్క జయదేవ్ సంధించిన ప్రశ్నలు మాత్రం 380. 98 చర్చల్లో పాల్గొన్న రికార్డు కూడా ఈయన సొంతం..ఈ లెక్కలే తన విధి పట్ల ఈయనకున్న నిబద్దతకు నిదర్శనంగా చెప్పొచ్చు.ఇక ఆస్తుల విషయానికి వస్తే 2014 ఎన్నికల అఫడవిట్ ప్రకారమే రూ.683కోట్లు..ఇంత ఆస్తిపరుడైనా కూడా సింపుల్ గా ఉంటూ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై తన వాదన విన్పించడంలో వెనక్కి తగ్గరు. సాధారణంగా ఓ రేంజ్ హోదాలో ఉన్నవాళ్లు ప్లకార్డులు పట్టుకోవాలన్నా..పెద్దగా నినాదాలు చేయాలన్నా అది తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తారు.. ఇక్కడే గల్లా జయదేవ్ తన స్థాయికి తగ్గట్లు ప్రవర్తించారు..ఓ వైపు తన వాదన విన్పిస్తూనే మరోవైపు తన హుందాతనం ప్రదర్శించారు. సూపర్ స్టార్ మహేష్‌కి బావగా చాలా  దగ్గరగా మెసులుతారనే గల్లా జయదేవ్‌కి ఇద్దరు పిల్లలు సిధ్ధార్ద్..అశోక్..వీరిలో గల్లా అశోక్ మహేష్ బాబు నాని సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించాడు కూడా. పాతికేళ్ల క్రితం సూపర్ స్టార్‌కి అల్లుడిగా తెలిసి..నాలుగేళ్ల క్రితం మరో సూపర్ స్టార్ బావగా రాజకీయాల్లోకి వచ్చిన గల్లా జయదేవ్ ఇప్పుడు ఆ ఇమేజ్‌ నుంచి బైటికి వచ్చి సొంత ప్రతిష్ట పెంచుకోవడం విశేషం

Comments