జగన్ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయితే బాబుకి టెన్షన్ తప్పదు మరి


ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వైఎస్సార్సీపీ అధినేత జగన్ అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం
మా పార్టీ ఎంపిలు రాజీనామా చేస్తారు..మీరూ మీ ఎంపిల చేత రాజీనామా చేయించండి అంటూ పిలుపు ఇచ్చారు. మనమంతా కలిసి రాజీనామాలు చేస్తే ప్రత్యేకహోదా వస్తుందంటూ ఆహ్వానించారు..దీంతో మరోసారి జగన్ తన ఊపు కొనసాగిస్తున్నట్లు క్లియర్ గా అర్ధమైపోతుంది. ఇప్పుడు తాను మాత్రమే హోదా కోసం పోరాడుతుంటే టిడిపి కలిసి రాలేదని ప్రచారం చేసుకోవచ్చు..లేక కలిసివచ్చినా..తాను పిలుపు ఇచ్చిన తర్వాతే టిడిపి కూడా కదిలిందనే సంకేతాలు పంపవచ్చు..ఇలాంటి మాస్టర్ స్ట్రోక్ గతంలో జగన్ చంద్రబాబుకి ఇచ్చిన దాఖలా లేదు..పర్ఫెక్ట్ టైమింగ్‌తొ కొడుతోన్న ఈ దెబ్బకి టిడిపి అబ్బా అనాల్సిందేనంటూ కామెంట్లు వస్తున్నాయ్.
దీంతో సిఎం చంద్రబాబులో టెన్షన్ మొదలైనట్లేనంటున్నారు అందుకే ఈ మధ్యకాలంలో లేని విధంగా
సమన్వయకమిటీ సమావేశాల్లో జగన్ వాదనని సరిగా తిప్పి కొట్టడం లేదని క్లాసు పీకారట. మనకంటే ముందే ఢిల్లీలో పరిణామాలు వైఎస్సార్ కాంగ్రెస్ కి తెలిసిపోతున్నాయని కూడా అసహనం వ్యక్తం ఛేసారట. నిజానికి ఏపీ నుంచి 25 ఎఁపిలు కాదు కదా..తెలంగాణలో ఉన్న ఎంపిలు కూడా కలిపి 42మంది రాజీనామాలు చేసినా కేంద్రం చలించదు. ఎందుకంటే వాళ్లలో టిడిపి ఎంపిలు తప్పితే ఇంకెవరూ ఎన్డీఏకి మద్దతిస్తున్నవారు లేరు.ఈ మధ్యకాలంలో బిహార్ సిఎం తన మద్దతు ఎన్డీఏకే ప్రకటించారు. కాబట్టి ఎన్డీఏ ఇలాంటి రాజీనామాలను ఈకలాగైనా పట్టించుకోదు. మరి మన ఆంధ్రప్రదేశ్ ఎంపిల రాజీనామాలకు విలువ లేదా అంటే..ఉంది..జనంలో ఎవరైతే నిజాయితీగా ప్రవర్తిస్తున్నట్లు కన్పిస్తారో..వారికే 2019లో ఓటేస్తారు దీనికి పార్టీలతో సంబంధం లేదు. అందుకే విభజన చేసిన తర్వాత కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వెళ్లిన మంత్రులు..ఎమ్మెల్యేలను తిరిగి గెలిపించారు. అలానే
కేవలం పదవుల కోసమే పార్టీ మారినవారిని తిరస్కరించారు. అందుకే ఈసారి కాస్త త్వరగా తమ గేమ్ ప్లాన్ మొదలెట్టాయ్ పార్టీలు..ఈ ఆటలో టిడిపి వాదన తనకి అనుకూలంగా ఉన్న  ఛానళ్ల ద్వారా బాగానే విన్పించుకుంటోంది..జగన్‌కి మాత్రం సాక్షి తప్పితే ఇంకే ఛానల్ అండగా లేదు కాబట్టి సహజంగానే జగన్‌ వాదన జనంలోకి వెళ్లడం తక్కువే. కానీ ఇలా రాజీనామాల ప్రస్తావన తెచ్చిన తర్వాత ప్రతి చోటా దీనిపై స్పందించాల్సిన
పరిస్థితి వచ్చింది టిడిపి నేతలకు.....ఇప్పటిదాకా పాదయాత్రలపైనే స్పందిస్తోన్న టిడిపిలీడర్లు రాజీనామా విషయంపై రోజూ విమర్శలు గుప్పిస్తున్నారు..ఇలా వాళ్లకే తెలియకుండా ప్రతి రోజూ జగన్ ఏప్రిల్ 6న తన ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తున్నారనే విషయం హైలైట్ చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు వైఎస్ జగన్ టిడిపి నేతలనూ ముగ్గులోకి లాగడంతో హీట్ ఇంకాస్త పెరిగినట్లైంది. అందులోనూ వైవి సుబ్బారెడ్డి రాజీనామాలను ఎన్నికలకు ఏడాది ముందు చేస్తున్నారనే వాదనని తిప్పికొట్టారు. 15నెలల ముందే చేస్తున్నాం..అదీ స్పీకర్ గారికి ఎలా ఇస్తే ఆమోదిస్తారో అలాంటి ఫార్మాట్‌లోనే ఇస్తున్నాం అని చెప్పడం ద్వారా టిడిపినేతల కామెంట్లకు కౌంటర్ ఇచ్చినట్లే భావిస్తున్నారు. ఐతే ముందే చెప్పినట్లు..ఇక్కడ ఎవరి చిత్తశుద్ది సంగతి ఎలా ఉన్నా..జనం ఎవరిని నమ్ముతారన్నదే ముఖ్యం

Comments