చింతమనేనికి మరోసారి జైలుశిక్ష..బెయిల్ ఎలా వచ్చిందో తెలుసా


తెలుగుదేశం విప్పు..చిచ్చరపిడుగులా పేలే దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి భీమడోలు బుర్ర రామకీర్తన పలికించే తీర్పు ఇచ్చింది
రెండేళ్లు జైలుశిక్ష విధించింది. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంత్ కుమార్‌పై ..ఆయన సెక్యూరిటీ గార్డులపై చేయి చేసుకున్నాడనే కారణంతో ఇతగాడికి కారాగార శిక్ష వేసింది. కోర్టు తీర్పు వినగానే మనోడి మొహంలో రంగులు మారిపోయాయట. ఆవేశంతో పెద్దగా రంకెలు వేసుకుంటూ తన లాయర్ దగ్గరకి వెళ్లాడట. అతగాడు చింతమనేనికి సర్ది చెప్పేందుకు నానా తంటాలు పడ్డాడట..శిక్షైతే పడింది కానీ మనకి బెయిల్ తీసుకునే వెసులుబాటు ఉందిగా అంటూ సముదాయించి  బైటికి పంపాడట. ఆ తర్వాత బెయిల్ పేపర్లు సబ్మిట్ చేయడంతో ఈ మూడు కేసుల్లో జడ్జిగారు నిబంధనల మేరకు బెయిల్ మంజూరు చేశారట.

 అసలు చింతమనేని గత చరిత్ర చూస్తే..మొదట్నుంచీ ఇతగాడిది అంతా రౌడీ స్టైలే..పేద్ద మోటర్ బైక్ వేసుకుని తిరుగుతూ మీడియా ముందు పోజులు ఇవ్వడం..కార్యకర్తలను ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ బిహేవ్ చేయడం మామూలే.. ఏపీకి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియాను అడ్డుకుంటున్నామంటూహడావుడి చేసారప్పట్లో..కృష్జాజిల్లాకి చెందిన ఎమ్మార్వో వనజాక్షి ఇలానే ఓ ఇసుక రీచ్ దగ్గరకు వెళ్లి ఇసుక తవ్వకాలను అడ్డుకోబోయింది. వెంటనే ఎక్కడున్నాడో కానీ మనోడు హడావుడిగా రావడం ఆమెపై దాడి చేయడం జరిగిపోయాయ్. అప్పట్లో అదో పెద్ద రచ్చ..దాన్నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు స్వయంగా ఓ కమిటీ వేసినా..ప్రయోజనం లేకపోయింది. వనజాక్షిపై దాడి చేయకపోతే అంత సీన్  అక్కడ జరిగుండేదే కాదు. 


ఇక అక్కడ్నుంచీ చింతమనేని కి పరిచయం అక్కర్లేని వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పుడు 2011నాటి కేసులో జైలుశిక్ష పడటంతో మరోసారి అయ్యగారి నిర్వాకం చర్చకు వస్తోంది. ఇప్పుడంటే ప్రభుత్వవిప్..ఎమ్మెల్యే కావడంతో వెంటనే బెయిల్ వచ్చింది కానీ..నిర్దోషిగా మాత్రం చెప్పలేదు. ఇప్పటికే రాజకీయంగా చిత్రమైన స్థితిని ఎదుర్కొంటున్న టిడిపికి రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ముందు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఖచ్చితంగా ఇబ్బందికరమే. ఎందుకంటే ఈయన ప్రభుత్వ విప్ కూడా..ఒక ప్రభుత్వం తరపున ఎలా ప్రవర్తించాలో తన ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసే వ్యక్తే ఇలా కేసుల్లో శిక్ష పడితే అది రాంగ్ సిగ్నల్సే వెళ్తాయ్. ఇప్పటికైతే వైఎస్సార్సీపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్‌లో పార్టిసిపేట్ చేసేదీ లేనిదీ తెలీదు. ఐతే జగన్ ఉన్న ఊపుని బట్టి ఏప్రిల్ 6 వరకూ ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే దిశగా ఆలోచిస్తున్నట్లు లేదు. ఒక వేళ బడ్జెట్ సెషన్స్‌కి తన స్ట్రాటజీ మార్చుకుంటే మాత్రం చింతమనేనికి షాక్ తప్పదు. జైలుశిక్షని బేస్‌గా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించడం ఖాయంగా కన్పిస్తుంది. ఒక వేళ అసెంబ్లీ బాయ్ కాట్ కార్యక్రమం కనుక నిరాటంకంగా సాగితే మాత్రం చింతమనేని ఎపిసోడ్ పెద్దగా లైమ్‌లైట్లోకి రానట్లే భావించుకోవచ్చు

Comments