రాజమౌళీ ఇకనైనా శ్రీదేవికి క్షమాపణ చెప్తావా?


శ్రీదేవి చనిపోవడంతో ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ కూడా దిగాలు వాతావరణంలో ఉన్నారు. ఈ సందర్భంలోనే
శ్రీదేవి జీవితంలోని కొన్ని పరిణామాలు, సంఘటనలు గుర్తు చేసుకోవడం సహజాతి సహజం..వాటిలో పాతవాటికన్నా కూడా అందరికీ గుర్తున్నది రాజమౌళి పైత్యం..బాహుబలి సినేమా హిట్ అయిన తర్వాత రాజమౌళి స్వయంగా ఆయనంతట ఆయనే ముందుకు వచ్చి శివగామి క్యారెక్టర్‌కి శ్రీదేవిని అనుకున్నాం అని కాకపోతే ఆమె గొంతెమ్మ కోర్కెలు అడగడంతో వెనక్కి తగ్గామని చెప్పుకొచ్చాడు. అలా ఆమె సినిమా చేయకపోవడమే మాకు మంచిదైంది అంటూ ఎటకారంగా మాట్లాడాడు. ఇది ఓ రకంగా శ్రేదేవి క్రే జ్‌ని అవమానపరచడమే.

ఆ తర్వాత శ్రీదేవి స్వయంగా దానికి ఇచ్చిన వివరణ కూడా గుర్తుండే ఉంటుంది. నాకేం ఇండస్ట్రీ కొత్తకాదు..40, 50 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నామంటే దానికి కారణం మా సిన్సియారిటీనే..మొత్తం హోటల్ బుక్ చేయమనడానికి..అదైమైనా నా కూతురి పెళ్లా..రాజమౌళి ఇలా మాట్లాడటం తప్పు..ఆయన అలా ఎందుకు చెప్పారో మాకు తెలీదు. నేను మాత్రం రాజమౌళి మిగిలిన సినిమాలు కూడా బాగా  ఆడాలని కోరుకుంటున్నా..అని హుందాతనం ప్రదర్శించింది. ఐతే అంతకు ముందు దాకా తన సినిమా హిట్టైన ఆనందంలో ఏదిమాట్లాడినా...భజన చేస్తారనుకున్న రాజమౌళి..తర్వాత మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఓ రకంగా అదే మంచిది కూడా..కనీసం ఇప్పుడైనా శ్రీదేవిగారి పట్ల అప్పట్లో తప్పుగా మాట్లాడాను..అని క్షమాపణ చెప్పుకుని ఉంటే ఎంతో గొప్పగా ఉండేది. ఏ దారిన పోయిన దానయ్యో అడిగితే నేనెందుకు స్పందించాలి అంటే ఆ ప్రశ్నకి సమాధానం ఉండదు..కానీ భవిష్యత్తులో ఒక మంచి సంప్రదాయం ఏర్పాటు చేసినట్లుగా ఉండేది. సినేమా ఇఁడస్ట్రీలో ఇలాంటివన్నీ సహజం అనుకోవడానికి లేదు.ఎందుకంటే మన సినిమాల విడుదలకు ముందు పబ్లిసిటీ బూస్టప్ కోసం నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ట్రాఫిక్ అవేర్ నెస్ ప్లే కార్డులు పట్టుకోవడం చేస్తుంటారు..డ్రంక్ అండ్ డ్రైవ్‌కి బ్రాండ్ అంబాసిడర్లలా వ్యవహరిస్తుంటారు. మరి అవన్నీ చేసినట్లే..ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటే ఫ్రీగా బోల్డెంత పబ్లిసిటీ వస్తుంది కదా...! అందుకే ఇప్పుడు చాలామంది శ్రీదేవి మరణానికి ట్వీట్లు..రిప్స్ పెడుతుంటే..రాజమౌళి ఎలా స్పందిస్తాడా అని ఎదురుచూశారు..ఇతగాడు మాత్రం రొటీన్‌గా తన సంతాపం తెలియజేశాడు..అంతేకానీ ఎక్కడా తన హుందాతనం చాటుకునే ప్రయత్నం చేయలేదు

Comments