తేల్చేస్తారా...ముంచుతారా..!


పవన్ కల్యాణ్‌ని ఇప్పటిదాకా ఐటెమ్ క్యారెక్టర్‌గానే భావించినవాళ్లకు చిన్న కుదుపు ఇచ్చాడు..జేఏసీ ఏర్పాటు చేస్తామన్నా కూడా పెద్దగా ఎవరూ పట్టించుకొలేదు..లైట్ తీస్కున్నారు..కానీ ఎప్పుడైతే సీన్‌లొకి ఉండవల్లిని లాక్కువచ్చాడొ వెంటనే ఈక్వేషన్స్ మారిపొతున్నాయ్ అన్పించకమానదు. కానీ..ఇద్దరూ ఇద్దరే..వీళ్లిద్దరి వ్యవహారశైలిని జాగ్రత్తగా గమనిస్తే..వెంటనే ఒక విషయం కామన్ గా ఉన్నట్లు అర్ధమవుతుంది. 


ఇద్దరూ రాజకీయాల్లొ అంటే 2014వరకూ ఫెయిల్యూరే..ఒకరేమొ పార్టీ పెట్టి కూడా పొటీ చేయకుండా..మరొకరేమొ జైసమైక్యాంధ్ర అంటూ చెప్పులు చేతులొ పట్టుకుని..జనం ముందుకు వెళ్లి తిరగ్గొట్టబడి తెరమరుగు అయ్యారు..ఐతే ఉండవల్లి పైకి నేను అంత సీరియస్‌గా లేను..నాకు రాజకీయాలు వద్దు..నేనిప్పుడు ఏ పార్టీలొ లేను అని తరచూ చెప్తుంటాడు కానీ..ఇప్పటికీ విపరీతమైన ఆసక్తి చచ్చింది ముసలొడికి..అందుకే ప్రత్యేకంగా తనవాళ్ల చేత ఈస్ట్ న్యూస్ అఁటూ ఒక వెబ్ ఛానల్ పెట్టించుకుని అందులొనుంచి తన వాణి విన్పిస్తుంటాడు. ఆయనే చెప్పినట్లు ఏ పార్టీలొ లేడు కాబట్టి..జనం కాస్త ఆసక్తిగా గమనిస్తారు ఈయన ప్రసంగాలను..ఏదీ లగడపాటి రాజగొపాల్ రాజకీయాలంటే ఆసక్తి లేదంటూనే సర్వేలు చేయిస్తున్నట్లుగా..!


 అలాంటి ఉండవల్లితొ పవన్ కల్యాణ్ కలవడం కేవలం రాష్ట్రసమస్యలపైనే అఁటూ పైపూత మాటలేవొ మాట్లాడారు కానీ..అసలిప్పుడు జనసేనకి పవన్ కల్యాణ్ తప్ప వేరెవరూ లేరు. అందుకే అది ఎటు పడితే అటు తిరుగుతొంది కొన్నాళ్లు నిద్రపొతుంది..మరి కొన్నాళ్లు జొగుతుంది..అఁదుకే పార్టీని ఎలా నడపాలనే అంశాలు వీళ్లిద్దరి మధ్యా సాగినట్లే అనుమానం. పైకి జేఏసీ ఏర్పాటు దానికి మనస్ఫూర్తిగా ఉండవల్లి పనిచేయడం వంటి కబుర్లు చెప్పినా..ఈ జేఏసీలొ ముఖ్యపాత్ర పవన్‌దే ఉంటుంది..(అది కూడా ఇతగాడు ఫుల్‌టైమ్ యాక్టివ్  అయితే) అంటే జేఏసీ ముసుగులొ పార్టీ నడిపించుకుంటాడన్నమాట..ఐతే ఇక్కడ మరొక వాదనా ఉంది..అది ఏమిటంటే..పవన్ కల్యాణ్ ఎటూ ఫుల్ టైమ్ జనం ముందుకు రాలేడు..( ఆ విషయం గతనెలలొ జిల్లాల టూర్లు ..యాత్రలంటూ హడావుడి చేసి చివరకు మూడ్రొజుల్లొ చాప చుట్టేసి ఫామ్ హొస్‌కి పొయిన విషయం గుర్తుంది కదా) అందుకే తన తరపున జేఏసీ ఏదొ చేస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడం తాను మాత్రం యధావిధిగా ఏ పదిహేనురొజులకొ...వీలైతే నెలరొజులకొ ఒకసారి మొహం చూపిస్తే సరిపొతుందని భావిస్తున్నాడట..

అసలు వీళ్లిద్దరు తేల్చుతామంటున్న అంశాలే హాస్యాస్పదంగా ఉన్నాయ్..కేంద్రం ఒకటి చెప్తుంది..రాష్ట్రం ఒకటి చెప్తుంది ఎవరు నిజమొ తేల్చుతామంటున్నారు..ఇక్కడ సమస్య ఏంటంటే..బిజెపి ఏపి నుంచి వెళ్లే రహదారి అయినా..రైల్వే లైన్ అయినా..చివరకు ట్రాన్స్‌పొర్ట్ వ్యాపారమైనా..అది తాము రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చిందే అని ...అవి లక్షకొట్లు రూపాయలు దాటాయని చెప్పుకుంటొంది...రాష్ట్రప్రభుత్వమేమొ..నిధులంటే డబ్బులు కదా..మరి హార్డ్ క్యాష్ రూపంలొ ఇచ్చింది నాలుగువేల కొట్లే కదా..అని వాదిస్తొంది..అలా లెక్కల్లొ తేడాలు వస్తాయే కానీ..రెండూ అబద్దం చెప్తున్నట్లు కాదు..ఇది జేఏసి పెట్టి..దానికొ కమిటీ వేశామని జబ్బలు చరుచుకుని ఎవరినొ బెదిరిస్తామంటే విని నవ్విపొతారు..అలా కాకుండా మీరు ఇస్తామన్నది రైల్వేజొన్..అదివ్వలేదు..హొదా ఇస్తామన్నారు ఇవ్వలేదు..ఐఐఎం కడతామన్నారు ఎంతవరకూ వచ్చింది ఎంత డబ్బు ఇచ్చారు..పొలవరం కి ఇప్పుటిదాకా ఎఁత డబ్బు ఇచ్చారు..ఎంత ఖర్చైంది..అని నికార్సుగా అడిగితే ....అదీ జనానికి   ఏదైనా వాస్తవాలు తెలిసే దారి..!


Comments