వాహ్ జగన్..ఇదీ దూకుడు అంటే! ఇంతే ముందుకు వెళ్తే ప్రత్యర్ధులకు చుక్కలే


వైఎస్ జగన్‌మొహన్ రెడ్డి ఇప్పుడు మాంఛి ఊపు మీదున్నట్లు కన్పిస్తొంది. నాకు అడ్డొస్తే ఎవడినైనా వదలను అన్నట్లుగా చెలరేగుతున్నాడీయన ఈ మధ్యకాలంలొ. ఏప్రిల్ 6న ఎంపిలు రాజీనామా చేస్తారంటూ ప్రకటించిన రొజు నుంచి ఒక్కసారిగా హీట్ పెంచేశాడు..ఇప్పుడు చేసినా ప్రయొజనమేంటి..ఏడాదిలొపు ఎన్నికలు రావనేగా అనే విమర్శకు ఏడాదికాదు..15నెలల ముందే రాజీనామా చేస్తున్నామని రివర్స్ కొట్టారు..ఆ తర్వాత ఏదీ ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ఎక్కడా మాట్లాడకుండా లీకులు మాత్రమే ఇస్తున్నారు..నిజంగా బడ్జెట్‌పై ఆయన ఎందుకు మాట్లాడరు అంటూ మొన్న పాదయాత్రలొ అడిగారు..వెంటనే చంద్రబాబు నిన్న గుంటూరు జిల్లాలొ బడ్జెట్‌పై విమర్శలు చేశారు. అంతకు ముందు టిడిపి ఎంపిలు కూడా మార్చి 6నే రాజీనామా చేస్తారంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు..అంతలొనే ఆ మాట సొదిలొకి లేకుండా పొయేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా ఒకదానిపై ఒకటి షాకులిస్తూ తాను అనుకున్న ఎఫెక్ట్ తెచ్చేసుకుంటున్న జగన్..ఇవాళ పవన్ కల్యాణ్‌కి కూడా అదే స్థాయిలొ రివర్స్ కవుంటర్ ఇచ్చేశాడు.
కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలి టిడిపి, వైఎస్సార్‌సిపి అంటూ భారీగా బిల్డప్ ఇచ్చిన పవన్ కల్యాణ్‌కి ఇవాళ జగన్ ఇచ్చిన తిరుగు సమాధానంతొ ఇక మాట పడిపొతుందంటే అతిశయొక్తి కాదు. " ఎస్...మేం సిధ్దం మీరు చెప్పినట్లుగానే కేంద్రంపై అవిశ్వాసం పెడతాం..అది కూడా మార్చి నెలలొనే..! మరి మీ మిత్రపక్షం టిడిపిని కూడా కలిసి వచ్చేలా ఒప్పించండి..అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టించాలంటే 54మంది మద్దతు కావాలి..మీరు రెడీనా  " అని డైరక్ట్ ఎటాక్ ఇచ్చేశాడు జగన్..ఈ దెబ్బతొ ఇక పవన్ కల్యాణ్ తప్పకుండా స్పందించాల్సిన పరిస్థితి..మరొవైపు టిడిపి కూడా ఈ తిరుగులేని అస్త్రానికి ఎలా జవాబు చెప్పాలొ అర్ధం కాక..తమ పాత విమర్శలకే కట్టుబడుతున్నారు. పాదయాత్రకి స్పందన లేకనే జగన్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఒకరు..జగన్ అసమర్ధుడని..పనికిరాడని..రకరకాలుగా తమ అక్కసు వెళ్లగక్కుకుంటున్నారు. ఐతే ఇవన్నీ ఆడలేక మద్దెల ఒడు సామెతనే గుర్తుకుతీసుకురాక మానవ్..ఎందుకంటే ప్రత్యర్ది పార్టీలు ఏం అడిగితే..అవన్నీ చేసేందుకు సిధ్దమని ప్రకటిస్తొన్న జగన్ అవన్నీ చేస్తాడా చేయడొ పక్కనబెడితే..ఆయన స్పందించిన తర్వాత సైలెంట్ అయిపొవడం మాత్రం ఆయా పార్టీల తెలివిడికి నిదర్శనంగానే చూస్తున్నారు జనం. మరొవైపు బిజెపి మంత్రులు కూడా ఏపీలొ కేబినెట్‌కి గుడ్ బై చెప్పేస్తామంటూ లీకులు ఇస్తున్నారు..మరి దీనికి టిడిపి నేతలు ఎలా జవాబు చెప్పుకుంటారొ చూడాలి

Comments