రామ్‌గోపాల్ వర్మ‌లోని ఈ కోణానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే


రామ్ గోపాలవర్మ అంటే ఓ పర్వెర్టెడ్ అనో..ఓ పిచ్చివాడనో..దారి తప్పిన మేధావి అనో రకరకాలుగా కామెంట్లు చేసుకుంటూ ఆనందిస్తుంటారు కొందరు.ఐతే అతని ఆలోచనావిధానం కానీ జీవితంలో ప్రతి అంశంపట్ల ఆయనకి ఉన్న అవగాహన..నిశ్చితఅభిప్రాయాలు కానీ తెలిసినవాళ్లెవరూ అలా అనుకోరు. ఓ రకంగా జీవితంలో ఎలా బతకాలనేది ఆయన్ని చూసి నేర్చుకోవచ్చంటే అతిశయోక్తి కాదు. కళ్లముందు కన్పించే జిఎస్టీలు, గన్స్ అండ్ థైస్ మాత్రమే కాదు తరచి చూస్తే, వ్యక్తిత్వమనేది ఎలా ఉండాలి దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు.. మనిషికి జంతువుకి తేడా ఏమిటి ఆత్మవిశ్వాసం అంటే ఏంటి..డబ్బు పై ఆయన థృక్పథం ఏమిటనేది రామ్‌గొపాల్ వర్మ అభిప్రాయాలు ఆచరించేది విని తీరాల్సిందే. ఓ మనిషి నిజంగా తాను చెప్పేది పాటిస్తున్నాడా లేదా అనేది పక్కనబెడితే తాను నమ్మిందే తాను చేసుకుంటూ పోవడం మాత్రం ఎవరికైనా ఆదర్శంగా తీసుకోవాల్సిందే

రామ్ గోపాల్ వర్మ చెప్పిన దానిప్రకారం ఆయన ఇంతవరకూ డబ్బుని తాకలేదు. దాంతో ఆయనకి అవసరమే లేదు. మరి ఎలా బతుకుతాడు అంటే చెప్పే సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అలా డబ్బులు లేకుండా బెంగళూరు ఎయిర్‌పోర్ట్ దగ్గర దిగిన సందర్భంలో ఓ యూత్ వచ్చి సెల్ఫీ తీసుకుంటా అన్నాడట. నాకు లంచ్ పెట్టిస్తే సెల్ఫీ ఓకే అన్నాడట..ఆ టైమ్‌లో నాకు ఆకలి తీరడం ముఖ్యంకానీ..నన్ను బిచ్చగాడనుకున్నా పర్వాలేదు అని చెప్పడం వర్మకే చెల్లు. అలానే తనని ఐడియాలే నడిపిస్తున్నాయని గత 20ఏళ్లుగా ప్రతి సారీ రామ్ గోపాల్ వర్మ పనైపోయిందనేవాళ్లే కానీ..ఇంతవరకూ తన ఫిలాసఫీ అర్ధం చేసుకోలేదంటాడు వర్మ. ఆ ప్రకారం చూస్తే..వర్మ సూపర్ సక్సెస్ డైరక్టర్ అనే చెప్పాలి.


  అలానే ఓ పని అనుకుంటే అది అయితే ఎలా తీసుకోవాలి..అవకపోతే ఎలా తీసుకోవాలని కూడా వర్మ చెప్పాడు

సక్సెస్ అయితే చాలామంది తోడొస్తారు లేదంటే దారి మార్చుకోవడమే అంటాడు వర్మ. ఇప్పుడు లగ్జరీలు తీర్చుకోవడానికి డబ్బు సంపాదించాలి కానీ..తెగ కష్టపడి సంపాదించి దాచుకోవడానికి కాదు అనేది వర్మ సిధ్దాంతం. డబ్బు లేనంత మాత్రాన బతకలేరనుకోవడం అవివేకం అని..ప్రతిభ, దమ్ము లేకపోతేనే భయపడాలని చెప్పాడు.ఇలాంటి భయమే ఇళయరాజాకి కలిగిన సందర్భంలో వాళ్ల గురువు కుక్కలు బతకగా లేనిది నువ్ బతకలేవా అని మందలించారట. ఇదే తనకి ఇన్స్పిరేషన్ అంటాడు వర్మ. ముందు మనల్ని ప్రేమించుకుంటేనే ఏదైనా చేయగలం కానీ..ప్రతి కష్టానికీ అక్కడే ఆగిపోవడం కరెక్ట్ కాదంటాడు. ఇంత విన్న తర్వాత కూడా మీకు వర్మని ఇకపై విమర్శించాలని అనిపించదు. ఎందుకంటే టివి తెరలపై కన్పించే వర్మ వేరు..తాను అనుకున్న ఎఫెక్ట్ కోసం ఏ కామంట్ చేస్తే ఏ టివి బ్రేకింగ్ వేస్తుందో..జనం నోళ్లలో నానతాడో తెలిసే అలాంటి సబ్జెక్టులు ఎన్నుకుంటాడు వర్మ. ఇందులో కొన్ని కావాలని అంటాడు..కొన్ని నిజంగానే తన అభిప్రాయాలను వెల్లిబుచ్చుతాడు ఏది ఎప్పుడు ఎందుకు మాట్లాడతాడో తెలుసుకుంటే వర్మని అభిమానిస్తారే తప్ప ప్రతి విషయంలోనూ ఎవరూ ద్వేషించలేరు.

Comments