మంజులతో మహేష్ సినిమానా..కృష్ణ రియాక్షన్ చూడండి...మనసుకు నచ్చలా...!


సూపర్ స్టార్ మహేష్, ఆయన సిస్టర్ మంజుల మధ్య ఉన్న అనుబంధం కొత్తగా చెప్పక్కర్లేదు..తమ్ముడి ప్రేమవివాహానికి తానే పెద్ద అయి ఇరుపక్షాలనీ మంజుల ఒప్పించిందని చెప్తారు. అలానే అక్క లవ్ మ్యారేజ్‌కి కూడా మహేష్ బాగా సపోర్ట్ చేశాడని ఆమే స్వయంగా చాలాసార్లు చెప్పింది కూడా..ఈ ఇద్దరి కుటుంబాలు  కలిసి చేసే సందడి కూడా బాగానే సోషల్ మీడియాలో ఎంటర్ టైన్ చేస్తుంటుంది. మహేష్ బాబుతో నాని సినిమా తీసి ఫట్టైన తర్వాత ఈసారి నేషనల్ అవార్డ్ విన్నయ్యే సినిమా తీస్తానని చెప్పి మరీ పోకిరితో హిట్ కొట్టింది మంజుల.
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీలో ఈ ఇద్దరే ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు కూడా..తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకున్న తమ్ముడితో మంజుల సినిమా చేస్తానని ఎప్పట్నుంచో చెప్తోంది.  ఐతే ఈ మధ్యలోనే మనసుకు నచ్చింది అనే సినిమా మొదలుపెట్టి ఆశ్చర్యపరిచింది మంజుల..ఆ సినిమా ప్రమోషన్‌లో కూడా మహేష్ తన అక్కకి బాగానే సపోర్ట్ చేస్తున్నాడు. సినిమాలో నేచర్‌కి వాయిస్ ఓవర్ ఇవ్వడం కమర్షియల్‌గా బాగా ప్లస్ పాయింట్ కింద చెప్పాలి. సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ కానీ..ట్రైలర్లు కానీ చూస్తే చాలు ఫోటోగ్రఫీ ఎంత అందంగా ఉందో తెలుస్తోంది. సినిమా చూసిన సూపర్ స్టార్ కృష్ణ మంజుల మొదటి సినిమా ఇదంటే నమ్మరని చాలా చక్కగా చేసిందని కితాబు ఇచ్చారు. తన మనవరాలు జాహ్నవి బ్రహ్మాండంగా చేసిందని..చక్కని భవిష్యత్తు ఉందని ఆశీర్వదించడం విశేషం. సినిమా విజయంపై మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు..
ఇక సినిమా విషయానికి వస్తే..రెగ్యులర్ సినిమాలకు ఇది ఖచ్చితంగా భిన్నంగా ఉంటుందని ముందునుంచీ ఊహించినవాళ్లకుఎలాంటి ఫీలింగ్ కలగదు..మిగిలినవాళ్లు మాత్రం ఏంట్రా బాబూ ఈ సినిమా అనుకోకుండా ఉండరు. ఎందుకంటే మంజుల మొదటి నుంచీ తన భావాలకు అనుగుణంగానే సినిమాలు తీస్తూ వచ్చింది ఆమె అభిరుచి ఏంటో తెలియడానికి షో ఒక్క సినిమా చాలు..అందుకే ఇప్పుడు మనసుకు నచ్చింది అనే సినిమాకి అవార్డులు వస్తాయేమో కానీ డబ్బులు రావనే విషయం ఘంటాపథంగా చెప్పొచ్చు..పైగా ఇద్దరు స్నేహితులకు పెళ్లి కుదరడం
 ఆ తర్వాత వాళ్లు ఇంకెక్కడకో వెళ్లడం చివరిలో కథ సుఖాంతం వంటివి చాలానే చూసాం. ఐతే మంజుల తొలి దర్శకత్వపు సినిమాగానే చూసినప్పుడు ఖచ్చితంగా మంచి మార్కులే వేయొచ్చు కానీ..ప్రేక్షకుడి దృష్టి కోణంలో చూసినప్పుడు మాత్రం నిరాశపరుచుతుంది. అందుకే ఇప్పుడు మంజుల మహేష్‌తో సినిమా తీయడం అంటే అది నిర్మాతగా అంటే ఓకే కానీ..దర్శకత్వంలో మాత్రం అస్సలు సాధ్యపడదు అని ఈ సినిమా ఫలితంతో అర్ధం చేసుకోవచ్చు ఎఁదుకంటే మహేష్ బాబు సినిమాలపై జరిగే వ్యాపారంపై చాలామంది ఆధారపడి ఉంటారు. అందుకే అలాంటి ప్రయోగాల జోలికి పోవద్దని ఫ్యాన్స్ చెప్తున్నారు

Comments