ఈ అమ్మడి చిలిపితనానికి జనం ఫిదా..ప్రియా ప్రకాష్ వారియర్ డీటైల్స్


టీనేజ్ లవ్ స్టోరీస్ అనే థీమ్ ఎప్పటికీ ఎవర్‌గ్రీనే..తెలుగులో ప్రతి దశాబ్దానికీ ఓ సినిమా అలాంటిది వస్తుంటుంది.
నాలుగు స్తంభాలాట, ప్రేమఖైదీ, చిత్రం..నువ్వేకావాలి..అలాంటివే..అలానే మలయాళంలో ఇప్పుడో సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఐతే సినిమా ఇంకా విడుదల కాలేదు. జస్ట్ ట్రైలర్ మాత్రమే వచ్చింది. అదే ఒరు అడర్ లవ్..స్కూలింగ్ అయిపోయి..ఇంటర్ స్టేజ్‌లో ఉండే ఏజ్ గ్రూప్‌ ఉన్న కుర్రాడు కుర్రది ఈ టీజర్‌లో కన్పిస్తారు..ఇందులో మన సంప్రదాయనృత్యంలో అభినయించేలా కనుబొమ్మలు కదిలిస్తూ హీరోయిన్ ఇంకో కుర్రాడిని ఆటపట్టించడం కన్పిస్తుంది..ఈ సీన్‌లో సదరు టీనేజ్ గాళ్ కన్నుకొట్టడం చూసినవాళ్లంతా ఫిదా అయిపోతున్నారట..దీంతో
ఇప్పుడీ టీజర్ మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటోంది..మరి ఈ టీనేజ్ సెన్సేషన్ గురించిన కాస్త డీటైల్స్ చూడండి..

ఈ అమ్మడి పేరు ప్రియాప్రకాష్ వారియర్..ఇంతవరకూ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు..ఇదే ఆమె మొదటి సినిమా..ఐతే మరి ప్రియా ప్రకాష్ ఎవరికీ తెలీదా అంటే లోకల్ పీపుల్‌కి బాగా తెలుసు..ఎలాగంటే..ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ క్యూట్ పై మోహినీ అట్టం అనే స్థానిక నృత్యంలో దిట్ట. సంప్రదాయనృత్యంతో పాటు మోడర్న్ ర్యాంప్ వాక్‌లు కూడా చేసిందీ అమ్మడు. ఐశ్వర్యరాణి అనే పేరుతోప్రతి ఏటా కొచ్చిలో అందగత్తెల పోటీ జరుగుతుంటుంది. అలాంటి షోలలో కూడా మంచి పేరే తెచ్చుకుంది ప్రియా ప్రకాష్. ఐశ్వర్యరాణి
2017లో పాల్గొన్న సమయంలోనే ఈ భామకి యూత్ ఫాలోయింగ్ ఏర్పడిందట. ప్రస్తుతం ఒరు అడర్ లవ్ రిలీజ్ కాబోతుండగా...రెండో సినిమాకీ సైన్ చేసింది. ఈమెకి ఉన్న క్రేజ్ చూసే కొంతమంది కాపీ క్యాట్స్ తయారైపోయి ఫేస్‌బుక్‌లో ఫేక్ అక్కౌంట్లు ఓపెన్ చేశారట వాటి నుంచి ఫ్యాన్స్ ని తప్పించడానికే అఫిషియల్‌గా తానే ఓ ఫేస్ బుక్ అక్కౌంట్ రీసెంట్ గా ఓపెన్ చేసింది ప్రియా ప్రకాష్ వారియర్.


 హ్యాపీ వెడ్డింగ్ సినిమాతో రెండేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చిన ఒమర్ లులు ఈ సినిమాకి డైరక్టర్. మొత్తం కొత్తవాళ్లతోనే తీసిన ఈ సినిమా దాదాపు 13కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది మలయాళంలో..అలానే రెండో సినిమా ఛంక్స్ కూడా సూపర్ హిట్టే ..మూడో సినిమాగా వస్తున్నదే ఈ ఒరు అడర్ లవ్..మరి ఇంత క్యూట్ గా ఉన్న హీరోయిన్
మంచి ట్రాక్ రికార్డు ఉన్న డైరక్టర్ తీసే సినిమాపై అంచనాలు ఉండవా..దానికి తోడు టీజర్ కూడా చూశారుగా..అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ అంతా సినిమా కోసం వెయిటింగ్

Comments