ఏంట్రా...అంటే..జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మహేష్


పాపం తానో సెలబ్రెటీ అనుకుంటూ పిలిచిన ప్రతి ఛానల్‌కీ వెళ్తోన్న కత్తి మహేష్‌ని చూస్తుంటే జాలి వేస్తోంది. ఆ జాలితోనే అతగాడిపై ఒక వ్యాసం రాయాలనిపించింది. ప్రతి ఒక్కడ్నీ ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది అనే నినాదంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఇతగాడు ఈ మధ్యకాలంలో పవన్ కల్యాణ్‌ పై ఎక్కడా కామెంట్లు చేయడం లేదు..బహుశా రాజీ కుదిరి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు( మాంఛి ప్యాకేజీ గిట్టుబాటు అయి ఉంటుందని వైఎస్సార్సీపీ ఫ్యాన్స్ చాలామంది అంటున్నారు) ఇప్పుడిక జిఎస్‌టి..దాని ఉప ఉత్పన్నాలపై జరిగే చర్చల్లో పాల్గొంటున్న కత్తి పరమ చెత్త వ్యాఖ్యలే చేస్తున్నాడు..అదేమంటే అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష  అన్నట్లుగా
ఏది మాట్లాడినా తానే మాట్లాడాలనే తపన కన్పిస్తుంది.

తన సంస్థలో జీతాలు ఇవ్వడమే మహాభాగ్యం అనుకునే ఒక ఛానల్‌లో అడ్డంగా రామ్ గోపాల్ వర్మకి సపోర్ట్ చేస్తూ రెచ్చిపోయిన ఇతగాడు..జిఎస్‌టిని ఒక ఆధ్యాత్మిక విప్లవగ్రంధం రేంజ్‌కి ఎత్తేశాడు..నిజానికి ఈయన కళ్లతో చూసినప్పుడు ఏ బూతు సినిమా అయినా సృష్టిరహస్యంతో కన్పించవచ్చు. అంతవరకూ ఇంకా ఈయన మాటలు సాగలేదు కానీ..ఇవాళ ఓ ఛానల్ చర్చలో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ ఏం అంత గొప్ప ఫిలాసఫర్ కాదుగా..ఏంట్రా అంటే..ఇక్కడ మనం చూడాల్సింది..ఏంట్రా అంటే నేనేం అంటున్నానంటే అంటూ తన గత వాదనకి భిన్నమైన వాదన చేశాడు..ఒకరకంగా ఛానళ్లకి ఏం అంశం దొరకకపోతే ఇతగాడిని పిలుస్తారేమో అనే స్థాయికి పడిపోయాడు ఇప్పుడు..ఇతగాడిపై ఏదైనా కథలు..కథానికలు రాసుకున్నా ఇక రాను రాను తక్కువ వ్యూసే వస్తాయ్. ఐనా మహేష్ పిచ్చకానీ..బికామ్ ఫిజిక్స్ బ్యాచ్ ‌క్రేజ్ ఎన్నాళ్లు ఉంది..పోలా తక్కువైపోలా..మెట్రో మోజు ఎన్నాళ్లుంది..పోలా..తగ్గిపోలా..ఏంట్రా..అంటే(ఇది మనోడి ఊతపదంలెండి) ఇది దృష్టిలోపెట్టుకుని ఇకనైనా తన మొహాన్ని చూపించడం తగ్గించేసి..వీలైతే అసలు మానేసి..తన రాతలేవో రాస్తేనో(ట్విట్టర్) వాయిస్‌లు విన్పించుకుంటేనో బెటర్..లేదంటే మొహం మొత్తేస్తాడు..అసలు ఇప్పుడు మొత్తేసింది కూడా...!

Comments