ఆ 22మంది ఎమ్మెల్యేల చాప్టర్ క్లోజ్ అవుతుందా..డెడ్ లైన్ 15 రోజులే


ఆంధ్రప్రదేశ్‌లో జంప్ జిలానీలకు దడ మొదలైంది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు సంగతి ఎలా ఉన్నా, కోర్టు విచారణ చేయడం కలకలం రేపుతోంది ఒక్క పదిహేనురోజుల్లో కేసు విషయంలో స్పందించాలంటూ మొత్తం 22మంది నోటీసులు ఇచ్చేసింది. వారితో పాటే ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి, న్యాయశాఖ కార్యదర్శికి కూడా
నోటీసులు ఇచ్చింది. దీంతో దర్జాగా టిడిపిలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పందించకతప్పని పరిస్థితి.  పార్టీపరంగా జగన్ ఓ పాలసీ ప్రకారం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు

ఐతే ఈ జంప్ చేసిన ఎమ్మెల్యేలు మాత్రం తమ సీట్లలోనే అంటే వైఎస్సార్సీపీకి కేటాయించిన  సీట్లలోనే కూర్చుంటూ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. కానీ ఈ 22మందిలో అప్పనంగా నలుగురు మంత్రిపదవులు ఎంజాయ్ చేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. ఓ వేళ కోర్టు కనుక ఈ అంశాన్ని పరిగణించిందంటే..తక్షణం మంత్రిపదవులు ఊడటం ఖాయం..పై పెచ్చు..ఐదేళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హత వేటు కనుక వేసిందంటే..లేని పోని కక్కుర్తికిపోయి ఐదేళ్లు జీరోగా మిగిలే ఛాన్స్ కన్పిస్తోంది. మార్చి 25న విచారణ ఉండటంతో ఈ జంప్ జిలానీలు వెంటనే లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఈ పిటీషన్ వేసింది గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నే రాంబాబు..
ఈయన పిటీషన్ ప్రకారం ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడమే కాకుండా..రోజుకి 500 రూపాయలు ఫైన్ వేయాలని కోరారు ఆయన. అంటేఏడాదికి లక్షా 82వేల రూపాయలు జరిమానా కట్టించాలని పిటీషన్ లో రాంబారు పొందు పరిచారు. పైగా ఈ పిల్ లో ..కనీసం విచారణ తేలేవరకైనా..వీరందరిపై అనర్హత వేటు వేయాలని కోరడమే అసలు ట్విస్ట్..అంటే పిటీషనర్ వాదనలలో ఏ ఒక్కదానికి కోర్టు అంగీకరించినా...పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బాక్స్ బద్దలవడం ఖాయంగా కన్పిస్తుంది అందుకే ఎమ్మెల్యేల సంగతి ఎలా ఉన్నా మంత్రులుగా పని చేస్తున్న అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, అమర్నాధరెడ్డి, సుజయకృష్ణరంగారావ్‌లో టెన్షన్ పట్టుకుంది

Comments