34 ఏళ్ల క్రితం అలా చేసింది నిజమే..! సోనియా గాంధీ కంట కన్నీరు


సోనియా గాంధీ అంటే యుపిఏ కేంద్రప్రభుత్వంలో అధికారంలో ఉన్నంతవరకూ ఓ స్ట్రాంగ్ లేడీగా చెప్పుకునేవారు. అనారోగ్యం, వృధ్దాప్యం కారణంగా ఇప్పుడు రాజకీయాల్లో చురుకుదనం తగ్గినా, కాంగ్రెస్ పార్టికి పెద్ద దిక్కు సోనియానే. ఆమె అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా..ఆ పార్టీ గెలుపోటములకు ఆమే బాధ్యత వహించేది.ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా 2007-2014 మధ్యలో పేరుతెచ్చుకున్న సోనియాగాంధీ కంట కన్నీరు పెట్టడం ఎవరూ చూసి ఉఁడరు. ఐతే ఇండియా టుడే ముంబై కాన్ క్లేవ్ సదస్సులో ఇలా అందరు సభికుల ముందూ ఆమె కన్నీరు కార్చారు. ఇంతకీ కారణం ఏంటో తెలుసా..తన భర్త జ్ఞాపకాలే.. తన అత్త ఇందిరాగాంధీని హత్య చేసినప్పుడు తానెంతో భయానికి గురయ్యానని చెప్పారు. అంతే కాదు..తన భర్త రాజీవ్ గాందీని కూడా పాలిటిక్స్‌లోకి రావద్దని గట్టిగా చెప్పారట.  కానీ ఎంత చెప్పినా 
ఆ పరిణామం జరగకుండా ఆగలేదు. ఆ సమయంలో విపరీతమైన భయానికి లోనైనట్లు సోనియా చెప్పుకొచ్చారు. తన అత్తని చంపినట్లు..రాజీవ్ ని చంపేస్తారనే తన భయంగా సోనియా చెప్పారు. అది నా స్వార్ధమే కావచ్చు కానీ..అప్పుడు తానొక భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా ఆలోచించానని చెప్పారు. అసలు అప్పట్లోనే రాజీవ్ ని చంపేస్తారని కూడా చుట్టుపక్కల చెప్పుకునేవారట. ఇలాంటి మాటలన్నీ చెవినపడిన తర్వాత తన భయం ఇంకా ఎక్కువైందని సోనియా అన్నారు. 

సోనియా భయానికి తగ్గట్లే రాజీవ్ గాంధీ కూడా 1991లో ఎన్నికల ప్రచారంలో ఉండగా హ్యూమన్ బాంబ్ దాడితో చనిపోయారు. అసలు భారతదేశంలోనే కాకుండా..ప్రపంచంలోనే ఎల్ టిటిఈ అలా మనిషిని పేల్చేసుకుని దాడులకు దిగడం అదే తొలిసారి. దీంతో దేని గురించి భయపడ్డామో అదే జరిగేసరికి షాక్ తిన్నామంటూ సోనియా ఇండియాటుడే కాన్ క్లేవ్ లో చెప్పారు. ఈ మాటలు చెప్తూ  ఆ జ్ఞాపకాలు గుర్తుచేసుకోగానే ఒక్కసారిగా ఆమె కంట్లోంచి నీళ్లు ఆగకుండా వచ్చేశాయ్. ఐతే అంత భయపడిన సోనియాగాంధీ  ఆ తర్వాత కొన్నేళ్లపాటు పాలిటిక్స్ కి దూరంగా ఉండిపోయారు..పార్టీ దయనీయస్థితిలో ఉండగా...1996లో డైరక్ట్ పాలిటిక్స్‌లోకి రావడం..98లో ప్రెసిడెంట్ పదవి దక్కించుకోవడం జరిగాయ్. అక్కడ్నుంచీ ఆరేళ్లలో కాంగ్రెస్ ను రెండుసార్లు కేంద్రప్రభుత్వంలో నిలిపేవరకూ ఆమె రాజకీయప్రస్థానం సాగింది. 2014లో పార్టీ ఓటమి తర్వాత, 2017లో రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించారామె. ఐతే ఇప్పుడు ఎన్‌డిఏకి ధీటుగా కాంగ్రెస్ ను నిలిపేందుకు తిరిగి యాక్టివ్ అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఏ రాజకీయాలైతే వద్దనుకున్నారో..అదే రాజకీయాల్లో 70ఏళ్ల  వయసులోనూ చురుకుగా ఉండాల్సి రావడం విధి రాత  అనుకోవాలేమో

Comments