నన్ను నేనే అసహ్యించుకున్నానంటోన్న గ(లీ)జల్ శ్రీనివాస్


తన దగ్గర పని చేసేవాళ్లని బిడ్డల్లా చూసుకోకపోయినా, కనీసం గౌరవం కాపాడాలి అంటారు. కానీ లైంగికంగా వేధించబోయి బుక్కైన చరిత్ర గజల్ శ్రీనివాస్‌ది. గలీజు పనులను చేయమని ప్రోత్సహించినట్లు వీడియోల్లో దొరకడంతో జైలుపాలైన ఇతగాడు ఇప్పుడు మళ్లీ పాడుతున్నాడట. కండిషన్డ్ బెయిల్ పై బైటతిరుగుతున్న ఈ కేసిరాజు శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. గజల్స్ ఎవరు పాడినా ఎక్కడో ఒక్క చోటే కనెక్ట్ అవుతారని..తాను పాడుతుంటే మాత్రం వెంటనే పాట అంతా కనెక్ట్ అవుతారంటూ చెప్పుకొచ్చాడు. అంతటితో ఊరుకోకుండా జీవహింసపై కూడా తన అమూల్యమైన అభిప్రాయం వెల్లిబుచ్చాడు. కోడిపందాలంటే తనకి అసహ్యమని ఫన్ కోసం కూడా అటువైపు వెళ్లనని చెప్పాడు. కానీ మరి పొట్టకూటికోసం ఉద్యోగంలో చేరిన ఓ యువతిని వేధించడం హింస కాదా అని ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసినవాళ్లు ఎద్దేవా చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో తన దగ్గర పనిచేసే యువకుడిని బండబూతులు తిట్టానని చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత వెంటనే తాను ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక పోయానని అంటూ క్షమాపణ చెప్పాడట. సదరు కుర్రాడి తల్లికి మంచి చీర పంపించి..ఇదీ మీ బిడ్డగా భావిస్తూ స్వీకరించమని శ్రీనివాస్ చెప్పాడట. తన కింద పని చేసే కుర్రాడిని అలా తిట్టిన రోజు, తనని తానే ఎంతో అసహ్యించుకున్న రోజుగా వర్ణించాడు శ్రీనివాస్. ఇంకా గిల్టీ ఫీలింగ్ తగ్గక ఓ గుడి దగ్గర చెప్పులు తుడిచాను అంటూ చెప్పాడు..ఇంకా  సిగరెట్ తాగను, మందు ముట్టను అంటూ రకరకాల విషయాలు చెప్పుకొచ్చిన శ్రీనివాస్ తనపై కేసు గురించి మాత్రం గప్ చిప్ అన్నాడు. సమాజంలోని అనేక అంశాలపై స్పందించిన గజల్ శ్రీనివాస్..తన బిడ్డలు తలదించుకునే పని మాత్రం ఎప్పుడూ చేయను ఓ రకంగా దేవుడిని అవ్వడమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చాడు..కానీ ఇలాంటి ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నట్లు చెప్పుకుంటోన్న శ్రీనివాస్..ఆయన జీవితంపై పడ్డ మచ్చ మాత్రం అంత తొందరగా తొలగిపోయేది కాదు

Comments