ఎన్నాళ్లిలా పరనిందలు పవన్..కొద్దిగానైనా సొంత అభిప్రాయాలు లేవా..!


వేదికలు మారవచ్చు..సందర్భాలు మారవచ్చు..కానీ పవన్ కల్యాణ్ తీరు మాత్రం మారదు. మాట మీదే నిలబడతాడనే సంగతి ఎలా ఉన్నా, ఒక్క మాట మాత్రం క్లియర్..అతని లక్ష్యం జగన్ మోహన్ రెడ్డిని సిఎం కాకుండా చేయడమే..ఇందులొ ఎలాంటి డౌట్లూ లేవ్. చివరికి ఇవాళ ఆయన సొంత ఇల్లో..లేక పార్టీ కార్యాలయమో తెలీని ఒక నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. ఈ సందర్భంగా  తన పార్టీ ఆవిర్భావ సభలో యువతరానికి బలమైన దిశానిర్దేశం చేస్తానని చెప్పడం గమనార్హం
అసలు ముందు పవన్ కి దిశా నిర్దేశం ఉందా..మీ వెనుక చంద్రబాబు ఉన్నారంటున్నారు కదా అంటే..నా వెనుక బిజెపి కూడా ఉందనుకోవచ్చుకదా అని డైలాగు వేసి అపహాస్యం పాలవడం తప్ప..అందులో హాస్యం ఏముంది. అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం ఇవ్వలేక జగన్ వెనుక మోడీ ఉన్నాడనుకోవచ్చుకదా అనే ఎదురు ప్రశ్నతోనే పవన్ కల్యాణ్ రాజకీయ అడుగులు భవిష్యత్తులో ఎటు పడతాయో అర్ధం చేసుకోవచ్చు..ఎక్కడైనా పార్టీ పెట్టడం కానీ..పోటీ కానీ చేసేవాళ్లు అధికారపక్షంపైనే సహజంగా పోరాటాలు ఉంటాయి. కానీ విచిత్రంగా జగన్ మోహన్ రెడ్డినే టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తే..చివరికి పలచన అయ్యేది ఆ పార్టీనే తప్ప, ఆయన్ని నమ్ముకుని పార్టీలో చేరేవాళ్లు..బ్యానర్లు కట్టేవాళ్లు ఈ సత్యం త్వరగానే గ్రహిస్తున్నారు. ఇదేదో వైఎస్సార్ కాంగ్రెస్ కి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడకూడదని కాదు. తమిళనాడులో పార్టీ పెట్టిన కమల్ , రజనీకాంత్ లు కాంగ్రెస్ ను, విజయ్ కాంత్ పార్టీలను విమర్శిస్తే ఎలా ఉంటుంది..ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేసి బిజెపి, కాంగ్రెస్ ను విమర్శిస్తే ఎలా ఉంటుంది. కర్నాటకలో కొత్త పార్టీ పెట్టిన ఉపేంద్ర బిజెపిని టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది..అంటే నా లక్ష్యం పదవులు కాదు..ఎన్నికలు కాదు..గెలవడం కాదు..అని చెప్పొచ్చు. అది నీకు నీ పార్టికి సుఖమేమో కానీ..జనానికి మాత్రం కాదు. ఎందుకంటే టిడిపి, వైఎస్సార్సీపీలలో ఏది ఎంచుకోవాలో అనేది ప్రజలకు సంబంధించిన అంశం. పవన్ మద్దతు టిడిపికే అయితే దానికోసం పార్టీ పెట్టక్కర్లేదు. లేదూ వైఎస్సార్సీపీకే మద్దతు ఇస్తానన్నా అదే పరిస్థితి..పార్టీ పెట్టావంటే ఖచ్చితంగా నీకో గమ్యం కావాలి. అదేం లేకుండా దిక్కూ దివాణం లేనివాడిలాగా ఫ్యాన్స్ ని పిచ్చివాళ్లని చేయవద్దు. ఎందుకంటే  పిఆర్‌పి పెట్టినప్పుడు కూడా పాపం చాలామంది నీ అన్నయ్య అభిమానులు..నీ కులం జనం చిరంజీవి ఇరగదీస్తాడని సిఎం అవుతాడంటూ ఆశలు పెట్టుకున్నారు.  రొమ్ము విరుచుకుని రంకెలు పెట్టినవాళ్లూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లో జాయినవడంతో ఇంతోటి దానికి మేం పీఆర్పీకి ఎందుకు వేయాలి..కాంగ్రెస్ కే వేస్తే సరిపోయేది గా అనుకున్నారు..2014కి ముందూ అంతే , అబ్బో తమ్ముడు వేరు..ఆయనిజం వేరు పవనిజం అంటే మామూలుగా ఉండదు అనుకున్నారు..కానీ నువ్ వేరేవాళ్లకి మద్దతివ్వగానే సగంమంది నీరుగారిపోయారు. ఇప్పుడు 2019లో కూడా ఇలానే నీ చేష్టలు ఉంటే..వారింక జన్మలో నీ మొహం చూడకపోవచ్చు. కనీసం ఎన్నికలవరకైనా నీ మద్దతు ఎవరికో ప్రకటించకు..నీకంటూ కొన్ని సొంత సీట్లు..(వస్తే) సంపాదించుకుని..ఆ తర్వాత నీ అమూల్యమైన మద్దతు ప్రకటించు..అప్పుడే నీ మాటకి వేల్యూ ఉంటుంది. లేదంటే ఇలానే ఆటలో అరటిపండు..కూరలో కరివేపాకులా మిగిలిపోవాల్సిందే. కాదూ నా చంద్రబాబుకి రాష్ట్రానికీ ప్యాకేజీ కావాలి..నేనూ అందులో భాగం అవుతా అనుకుంటే నిన్ను పిచ్చగా అభిమానించేవాళ్లకి షాక్ కలిగించకమానదు. అంతేకానీ ఇదమిద్దంలేని ప్రశ్నలు..ఎదురుగా నాలుగు ప్రశ్నలు అడిగే ధైర్యం లేకుండా ప్రతి ప్రెస్ మీట్లో పరిగెత్తుకుపోవడం నీకు, నీ అభిమానులకు స్టైల్‌గా అన్పించవచ్చేమో కానీ...జనం దృష్టిలో అది పారిపోవడమే..అందుకే ఇవాళ నీ అంతట నువ్ నేనెక్కడికీ పారిపోలేదు..పారిపోను అని చెప్పుకోవాల్సి వచ్చింది. మా నాన్న సిఎం కాదనే డైలాగ్ పవన్ నోటి వెంట వచ్చిందీ అంటే..అతనికి జగన్ మోహన్ రెడ్డి అంటే ఎంత ఈర్ష్య,  ఓర్వలేనితనం ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంత చేసినా...వైఎస్ జగన్ పెట్టబొయే నో కాన్ఫిడెన్స్ మోషన్‌కి మద్దతు సంగతి మాత్రం తేల్చలేదు. ఇప్పుడంటే ఇలా తనకే సాధ్యమైన మేధావితనం ప్రదర్శిస్తున్నాడు కానీ.. అక్కడికి పవన్ కల్యాణ్ ఏం సొంతంగా ఇండస్ట్రీకి రాలేదు..అన్న అండతోనే ఇండస్ట్రీకి వచ్చాడు రాజకీయాల్లోకీ ఆయనే అండగా ఉన్నాడు..ఇలాంటివన్నీ మర్చిపోయి ఇప్పుడు పరనింద చేసుకుంటూ ఎందుకు పరువు తీసుకుంటావని పాపం ఫ్యాన్స్ మదనపడుతున్నారు.

Comments