రజనీకాంత్‌ కొత్త సినిమాకి సంగీతం ఇచ్చేది ఇతనే.. బ్యాక్ గ్రౌండ్ చూస్తే అవాక్కవకతప్పదు


అనిరుధ్ రవిచందర్ అంటే తొందరగా స్ట్రైక్ అవ్వకపోవచ్చు కానీ..కొలవెరీ పాట మ్యూజిక్ డైరక్టర్ అంటే
మాత్రం వెంటనే తెలిసిపోతుంది..యంగ్ ఏజ్‌లోన్ తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి చూపించిన అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే బాక్సులు బద్దలవ్వాల్సిందే. అనిరుధ్ రవిచందర్ తండ్రి రవి రాఘవేంద్ర కూడా ఒక నటుడే..రాడన్ మీడియా వాళ్ల టీవీ సీరియల్స్ చూసేవాళ్లకి అచ్చం ఒకప్పటి హీరో కార్తీక్ లా ఉఁడే ఓ క్యారెక్టర్ కన్పిస్తుంటుంది..ఆయనే ఈ రవి రాఘవేంద్రమరి రవి రాఘవేంద్ర బ్యాక్ గ్రౌండ్ ఇంకా అయిపోలేదు..ఈయన ప్రవేట్ సెక్టార్ బ్యాంక్ ఎస్ బ్యాంక్‌కి  సౌత్ వింగ్ బిజినెస్ హెడ్..గ్రూప్ ప్రెసిడెంట్ కూడా..అంతేనా...వైజీ మహేంద్రన్ అనే పాత తరం కమెడియన్ కి బావమరిది..ఇంక చాలు ఈ హిస్టరీ అంటారా..అసలు మేటర్ ముందుంది..ఈ రవి రాఘవేంద్ర రజనీకాంత్‌కి బావమరిది కూడా..అంటే రజనీకాంత్ భార్య లతకి స్వయానా సోదరుడుఅంటే అనిరుధ్ రజనీకాంత్‌కి మేనల్లుడు వరసన్నమాట. ఐతే రవి రాఘవేంద్రకి ఇంత సౌండ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా..ఎక్కడా ఆ డాబు దర్పం ప్రదర్శించడు. సింపుల్‌గా తన పనేదో తాను చేసుకుంటూ పోతాడు..ప్రెస్‌మీట్లు పెట్టినప్పుడు కూడా అందరికంటే ముందే వచ్చి
ఎదురు చూస్తుంటాడు..ఎక్కడా చిరాకు కానీ..హోదా ప్రదర్శించడం కానీ చేయడు.

ఐతే ఇంత హిస్టరీ ఉంది కాబట్టేనేమో అనిరుధ్ మాత్రం  ఎక్స్ ట్రాలు చేస్తుంటాడు..కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటుంటాడు. అసలు త్రీ సినిమాతో సంగీత దర్శకత్వం మొదలుపెట్టిన అనిరుధ్ ఆ తర్వాత ఆ రేంజ్ మ్యూజికల్ హిట్స్ మాత్రం ఇవ్వలేదు. ఈ త్రీ సినిమాలో  హీరోగా ధనుష్ నటిస్తే..నిర్మించింది రజనీకాంత్ కుమార్తె..ఐశ్వర్య. రీసెంట్ గా తెలుగులో
వచ్చిన అజ్ఞాతవాసికి సంగీతం కూడా ఈ అనిరుధ్ రవిచందరే ఇచ్చాడు..లేటెస్ట్ ట్రెండీ మ్యూజిక్ ఇవ్వడంలో దిట్ట అయిన అనిరుధ్ కి ఇప్పుడు బంపర్ ఛాన్స్ వచ్చిందనే చెప్పాలి. అదే ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్ట్స్ సినిమాకి ఇతనే మ్యూజిక్ డైరక్టర్‌గా ఎన్నికయ్యాడు. దీంతో మరోసారి అనిరుధ్ న్యూస్ మేకర్ అయ్యాడు

Comments