పార్సిల్ డెలివరీలతోనే కనకవర్షం


సొంతంగా ఐటెమ్స్ తయారు చేస్తుంది  లేదు..తనంతట తాను కస్టమర్లని వెతుక్కుంటున్నది లేదు..ఐనా ఈ కంపెనీకి కోట్లకి కోట్లు డబ్బులు  వచ్చి పడుతున్నాయ్. కనక వర్షం అంటున్నామే అలాంటిదే కురుస్తోంది ఈ కంపెనీపై. ఇంతకీ ఏంటా కంపెనీ అంటారా..! జొమేటా..జనానికి అవసరమైన రుచులలో ఉత్పత్తులు అందించే కంపెనీలనుంచి డెలివరీ ఇవ్వడమే ఈ కంపెనీ చేసేది. ఫుడ్ డెలివరీలో విపరీతమైన లాభాలు సంపాధించడంతో ఈ ఆగ్రిగేటర్
జొమేటా గోల్డ్ సర్వీస్ కూడా ప్రారంభించింది. ఇది ప్రీమియం సర్వీసు కావడం విశేషం. దీనికి కూడా విపరీతమైన ఆదరణ దక్కడంతో కంపెనీ ఒక్క ఏడాదిలో రూ.650కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తోందని అంచనా

గుర్‌గావ్‌కి చెందిన ఈ స్టార్టప్ గత రెండు నెలల కాలంలో 40శాతం వృధ్ది నమోదు చేసింది. దీపిందర్ గోయల్ సీఈఓగా పని చేస్తున్న ఈ స్టార్టప్ 9దేశాల్లో తన వ్యాపారం చేస్తోంది. తమ వ్యాపారంలో యూఏఈ, ఇండియాలో ఆన్‌లైన్ ఆర్డర్ బిజినెస్ ఎక్కువని సంస్థ చెప్తోంది. ప్రస్తుతం నడుస్తోన్న నెలలో ఆదాయాన్ని బట్టి మొత్తం ఏడాదికి లెక్కవేయడం యాన్యువలైజ్డ్ రెవెన్యూగా చెప్తారు. అది 650కోట్ల రూపాయలుగా చెప్తున్నారు. మార్చి నెలలో ఇది 8.2 మిలియన్ డాలర్లుగా సంస్థ చెప్పింది. కొత్తగా ప్రారంభించిన జొమేటా గోల్డ్ 12శాతం గ్రోత్ రేట్ చూపిస్తుండగా..ఇదే జోరు కొనసాగుతుందని అంచనా.2017ఆర్ధిక సంవత్సరంలో రూ.323.33కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన జొమేటా ఈ ఏడాది రూ.650కోట్లు సాధిస్తే..అది అద్భుతంగానే చెప్పాలి. ఇదే రంగంలో ఉన్న స్విగీకి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, నెలకి 30లక్షల ఆర్డర్లు సాధించే స్థాయికి ఎదిగింది. స్విగీకి మాత్రం 45లక్షల ఆర్డర్లు వస్తుండటం విశేషం. ఐతే జొమేటా
కొత్తగా ప్రారంభించిన గోల్డ్ స్కీమ్‌తో కస్టమర్లు ఎకాఎకిన లక్షా యాభైవేల మందిని పెంచుకుంది. దీపిందర్ గోయల్ చెప్తున్నదాని ప్రకారం జొమేటాకి 2300 రెస్టారెంట్స్ తో ఒప్పందాలు ఉన్నాయ్. జొమేటా గోల్డ్ ముందుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌, పోర్చుగల్‌లో పానీయాల సరఫరా కోసమే ప్రారంభించింది. ఆ తర్వాత అక్కడ పొందిన విజయంతో
ఆహార ఉత్పత్తులకు కూడా వర్తింపజేసింది. జొమెటాకి చివరిసారిగా యాంట్ ఫైనాన్షియల్ సంస్థ నుంచి 150మిలియన్ డాలర్ల పెట్టుబడి సాధించింది.

Comments