తెరమరుగైన ఈ నందమూరి హీరో మళ్లీ ఎంట్రీ ఇస్తాడా


నందమూరి వంశం అంటే తెలుగు సినిమా అభిమానులలో తెలియని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఐతే ఆ ఫ్యామిలీ నుంచే వచ్చి మంచి హిట్లు కూడా కొట్టి..ద్వితీయశ్రేణి కథనాయకుడిగా పేరు తెచ్చుకున్న హీరో ఒకరున్నారు. ఐతే ఎంత పేరున్నా..ఆయన మాత్రం అనూహ్యం తెరమరుగు అయ్యారు. ఆయన అలవాట్ల వల్ల కాదు.. అలానే వయసు మీద పడి వచ్చిన అనారోగ్యంతోనూ కాదు..ఐనా సడన్‌గా తెరమరుగు అయిపోయారు..ఇప్పటికీ ఆ హీరో అంటే చాలామందికి మంచి అభిప్రాయమే ఉంది 

ఇంతకీ ఎవరంటారా..ఆయనే కల్యాణచక్రవర్తి..పైగా కల్యాణచక్రవర్తి బ్రదర్ కూడా నటుడే కావడం విశేషం. నందమూరి వంశంనుంచి వచ్చిన ఈ సోదరులు ఎన్టీఆర్ తమ్ముడైన త్రివిక్రమరావు కొడుకులు..ఈ ఇద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో కన్పించారు కూడా. పెళ్లికొడుకులొస్తున్నారు, మామాకోడళ్ల సవాల్, బావమరదుల సవాల్ ఇలా మూడు సినిమాల్లో ఒకే వంశం హీరోలు కన్పించడం అదే మొదటి, చివరిసారి కూడా. ఐతే కల్యాణచక్రవర్తికి అత్యంత దెబ్బ తగిలిన విషయం ఆయన సోదరుడు హరీన్ చక్రవర్తి చనిపోవడం ఓ సినిమా షూటింగ్‌లో భాగంగానే ఇది జరగడం గమనార్హం. బైక్ యాక్సిడెంట‌లో హరీన్ చక్రవర్తి చనిపోయిన తర్వాత కల్యాణ్ చక్రవర్తిలో మార్పు వచ్చిందంటారు. నందమూరి కల్యాణచక్రవర్తికి కుటుంబకథాచిత్రాల కథానాయకుడిగా మంచి ఇమేజ్ ఉంది. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఆయన సినిమాలు బోలెడన్ని
చాలామందిని అలరించాయ్. తల్లిదండ్రులను పట్టించుకోని సంతానం..వారికి బుద్ది చెప్పే అల్లుడు, కొడుకు, ఇలాంటి కథాంశాలతో వచ్చిన కల్యాణ చక్రవర్తికి లేడీస్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఐనా అకస్మాత్తుగా ఎందుకు తెరమరుగు అయ్యాడంటే దానికి వాళ్ల నాన్నగారి ఆరోగ్యం చెడిపోవడమే కారణమంటారు. అటు తమ్ముడు చనిపోవడం ఇటు తండ్రి అనారోగ్యం పాలవడంతో కుటుంబబాధ్యతలు తనపై పడటంతో సినిమాలను వదిలేసుకోవాలనే నిర్ణయానికి కల్యాణచక్రవర్తి వచ్చాడంటారు.అలా కెరీర్ మంచి ఊపులో ఉండగానే సినిమాలకు దూరమైన కల్యాణచక్రవర్తికి మేనమామ అనే సినిమా చివరిది. ఇందులో హీరోయిన రజని. ఐతే ఇదే సినిమాకి దగ్గరగా మేనబావ పేరుతో మరో సినిమా కూడా చేశారు. అందులో హీరోయిన్ ఇంద్రజ..ఐతే అప్పటికే కల్యాణచక్రవర్తి మొహం బాగా ఉబ్బిపోయి ఫేడౌటైపోయేసరికి సినిమా పూర్తైన కూడా కొనడానికి బయ్యర్లు రాకపోవడంతో విడుదల కాలేదు. ఇప్పటి తారకరత్నని అధాటుగా  చూస్తే  కల్యాణచక్రవర్తి గుర్తుకురాకమానడు.  అతని కళాకాంతులు మాత్రం తారకరత్నలో కన్పించవ్. ఐతే ఇప్పటికీ కల్యాణ చక్రవర్తి నటిస్తే చూడాలని చాలామంది కోరుకుంటారు. ఏదెలా ఉన్నా కల్యాణ్ చక్రవర్తి మాత్రం తెరమరుగు కావడం బాధాకరమే. ఎంతోమంది పరాయి భాషా నటులను తెలుగులోకి తెస్తోన్న తరుణంలో బోయపాటిలాంటి వాళ్లు పాత తర నటులను తిరిగి లైమ్ లైట్‌లోకి తెస్తున్నారు.ఇప్పుడలానే కల్యాణ చక్రవర్తిని కూడా ఏ తండ్రి పాత్రలొ తెస్తారేమో చూడాలి..ఎందుకంటే అతని వయసు ఇప్పుడు 55 ఏళ్లు మరి


Comments