నా బిడ్డ గుర్తొస్తోంది..ఇంకా నా కళ్లు నా పాప కోసం వెతుకుతున్నాయి..!


"నా బిడ్డ గుర్తొస్తోంది..ఇంకా నా కూతురు కోసం నా కళ్లు వెతుకుతూనే ఉన్నాయి..ఎక్కడో అక్కడ దాక్కుని ఉందేమో ఆటలు ఆడుకుంటుందేమో..బైటికి వస్తుందేమో..కన్పిస్తుందేమో అని వెతుకుతున్నా.."
 పై మాటలు వింటుంటే గుండెలో ముల్లు దిగుతున్నట్లు లేదూ..తెలీకుండానే కళ్లు కారడం లేదా..! ఐతే మీరు మనుషులు కాదన్నమాట మీలో మనిషి ఎప్పుడో చచ్చిపోయాడన్నమాట. నిజం ఇది..
కశ్మీర్ లోయలో నాలుగునెలల క్రితం జరిగిన దారుణం ఇది. చదివిన వెంటనే అసలు ఆడపిల్లగా పుట్టడమే శాపమా అన్పిస్తుంది ఎనిమిదేళ్ల చిన్నారిని ఎత్తుకుపోయి..ఓ చోట దాచిపెట్టి..ఒకరి తర్వాత ఒకరు రేప్ చేసి చంపేశారు దుండగులు..గుండెలు అవిసిపోయేలారోదించే వార్త ఇది. తెలుసుకున్నవాళ్లకే ఇలా ఉంటే..ఇక తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి..
రోజూ చిన్నారిని చూసుకుంటూ..వేళకింత భోజనం పెడుతూ..రాత్రయ్యేసరికి జో కొడుతూ..ప్రతీ క్షణం పాపతోనే జీవించే తల్లిదండ్రులు తమ కూతురు ఇంక లేదని..తిరిగిరాదని..అది కూడా మానవమృగాలదాడిలో చనిపోయి..చచ్చిపోయిందని తెలిస్తే ఎలా తట్టుకుంటారు..
దుఃఖాన్ని దిగమింగిన తండ్రి దోషులను ఉరితీయమని కాళ్లరిగేలా తిరుగుతుంటే..ఎవరికైనా ఎలా ఉంటుంది. ఇది న్యాయమేనా అన్పిస్తుందా..ఇలాంటి లోకంలో బతుకుతున్నందుకు సిగ్గుపడరా..ఇంకా బతికి ఉన్నందుకు సంతోషపడతారా..ఆడపిల్లలను కన్నందుకు ఇదో శాపం అని బాధగా భరిస్తూనే ఉఁడాలా...ఎందుకురా ఇలాంటి అంగాలని ఇచ్చావని మగాళ్లు బాధపడరా..ఇలాంటి బుద్దినిచ్చిన దేవుడిని తిట్టుకోరా..ఇది నా ఆక్రోశం..గుడిలో జరగనీ..మసీదులో జరగనీ...అసలు ఇలాంటి అకృత్యాలు చేసి తప్పించుకోవాలనే ఆలోచన వచ్చిందంటే...
అది సమాజం ఇచ్చిన భరోసానే కదా..కాస్త తెగింపు ఉండాలే కానీ..ఎవడేం చేసినా చెల్లిపోతుందనే కదా...! చేతకాని చేవచచ్చిన జనం వీలైతే ఇలా రాసుకుంటారు..ఇంకా వీలైతే లైకులు కొట్టుకుంటారు..లేకపోతే..ఇంకా నైచ్యంగా జరిగిన దారుణానికి ఇంకో రంగు పులుముకుని తమ అసహ్యాన్ని కక్కుతారు అంతేనా

Comments