పవన్ మౌనదీక్ష అంటూ కేకలు..ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ


జరిగింది ఘోరమే..మెడకాయ మీద తలకాయ ఉన్నవాడెవడైనా ఒప్పుకుంటాడు..ఐతే పవన్ కల్యాణ్ స్పందించిన తీరే తమాషాగా అన్పిస్తుంది. కతువాలో పసిపాపపై అత్యాచారం జరిగితే అందుకు పవన్ కల్యాణ్ స్పందించడం తప్పకుండా అభినందించదగ్గ విషయమే..ఐతే నెక్లెస్‌రోడ్‌లో ఇందిరాగాందీ విగ్రహం దగ్గర దీక్ష ఏంటో..ఆ ప్లానింగ్ చేసినవాళ్లకి తెలియాలి. ఎందుకంటే నిన్ననే ఆయన కంటికి శుక్లాల ఆపరేషనో..లేక లేజర్ సర్జరీనో చేయించుకున్నాడు. ఎండ పడకూడదు కాబట్టి కాస్త చల్లనైన..నీడ దొరికే ప్రదేశంలో దీక్ష చేసి ఉండవచ్చు..అందుకోసమే ఆ స్థలాన్ని ఎంపిక చేసుకున్నాడనే విమర్శలు ఉన్నాయ్. ఎందుకంటే..ఇవాళ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి..ఈ సందర్భంగా సిటీలోని విగ్రహాన్ని అందరూ పూలదండలతో ముంచెత్తడం జరిగేదే..తన కళ్లకి ఉన్న ఇబ్బంది దృష్టిలో పెట్టుకునే ఆఫీస్‌లో దండ వేసి..నిరసన కార్యక్రమం మాత్రం నెక్లెస్ రోడ్‌లో చేశారని అనుకోవచ్చు

ఐతే ఈయన పనులు వెనుక ఆవేశమే తప్ప ఆలోచన ఉండదని తెలుసుకోవచ్చు ఎందుకంటే..ఓ పక్క మౌనదీక్ష అని చెప్పి..గొంతు పగిలేలా కేకలు వేయడం కాస్తైనా హాస్యాస్పదంగా అన్పించదా..కావాలంటే వీడియో చూడండి

నిన్నటిదాకా సైలెంట్ గా ఉండి..హాయిగా రంగస్థలం సినిమా చూసి రివ్యూలు ఇస్తూ..అడపా దడపా ఆడియో ఫంక్షన్లూ..సక్సెస్ మీట్లకు హాజరవుతున్న పవన్ కల్యాణ్ హఠాత్తుగా..ఈ విషాదంపై స్పందించడం ఆయనలోని సుగుణాన్నే సూచిస్తుంది..కానీ తీసుకునే ఎత్తుగడలు మాత్రం అట్టర్ ఫెయిల్ అవుతుంటాయ్. దీనికంటే..తన నివాసం దగ్గరే రోడ్డుపైన రోజంతా కూర్చున్నా..దేశం మొత్తానికి ఈ నిరసన తెలిసేది..ఎందుకంటే..పవన్ కి ఉన్న క్రేజ్ దృష్ఠ్యా ఆయన ఎక్కడ నిలబడితే..క్యూ అక్కడే ప్రారంభం అవుతుంది..ఆయన ట్రెండ్ ఫాలో అవడు. సెట్ చేస్తాడు. ఎంత ఆవేశంగా ఉవ్వెత్తున లేస్తాడో..అంతే వేగంగా కిందకూ పడిపోతాడు..ఆడపిల్లల జోలికి వస్తే తాట తీయమంటాడు..మరి శ్రీలేఖారెడ్డి పరిస్థితి పై ఏం చేస్తారంటే..నే మద్దతిస్తా..కానీ పోలీసుని కాదు అంటాడు..

ఇదే ఆయన్ని అభిమానించేవారికి నిరుత్సాహం కలిగించే విషయం..శ్రీలేఖారెడ్డికి అన్యాయం చేసిన వారిని వదలను  అని ఒక్క మాటంటే.." అదీ మా బాస్ అంటే " అని కాలర్ ఎగరేద్దామనుకున్న ఫ్యాన్స్ చప్పబడిపోయారు. నిజంగా ఆ తర్వాత ఎవరినైనా ఏమైనా చేయనీ..చేయకపోనీ..ముందు మాట సాయమైనా చేస్తేనే జనం కాస్తైనా అభిమానం పెంచుకుంటారు..లేదంటే ఉన్న అభిమానం కాస్తా..నిస్సహాయతగా మారుతుంది. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్‌లో కూడా ఇదే చోటు చేసుకుంటుంది..జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ పెట్టగానే ఏదో యాక్టివిటీ చేపట్టాడు బాస్ అనుకున్నారు..కానీ ఆ తర్వాత అది జాయింట్లు ఊడిపోయింది..చివరికి జయప్రకాష్ నారాయణ కూడా ఏంటి పవన్ మరీ చిన్నపిల్లలాటా ఇది అని సీరియస్ అయ్యేదాకా సిచ్యుయేషన్ వచ్చింది. ఆ తర్వాతైనా ఏమైనా చేశాడా అంటే..పాదయాత్ర చేశానంటాడు..తిరిగి నిశ్సబ్దం..ఇది చదువుతున్నవారికి ఏంటి పవన్ కల్యాణ్ అంటే గిట్టని రాతలు కదా ఇవి అంటారు..కానీ మరి ఆయన నిర్వాకం మాత్రం అలాగ లేదా...! మంచినా..చెడైనా కాలానికి వదిలేసి..ఒక అంశంపై ఏదో ఒక లైన్ తీసుకుంటేనే రాజకీయాల్లో చెక్కు చెదరని ఫాలోయింగ్ ఏర్పడేది..లేకపోతే..విమర్శలు ఎదుర్కొంటూనే..సాగాలి..వీటితో వెంటనే నష్టం లేకపోవచ్చు కానీ..ఆ తర్వాత చేయాల్సిన పని వదిలేసి..ఈ విమర్శలను  ఎలా ఎదుర్కోవాలా అనే జంఝాటంతోనే కాలం గడిపేయాల్సి వస్తుంది.


Comments