ఈ లేడీ డ్యాన్స్ డైరక్టర్ ఒకప్పుుడు తెలుగు హీరోయిన్ కూడా గుర్తుందా మీకు?


ఇప్పుడు మనం చెప్పుకోబోయే లేడీ ఒకప్పుడు తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్..రెండంటే రెండే సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఐనా అచ్చ తెలుగు అమ్మాయిలా అన్పిస్తూ అప్పటి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఆమే గాయత్రి రఘురాం ఉరఫ్ దీక్షా రఘురాం. మా బాపు బొమ్మకి పెళ్లంటలో గాయత్రి రఘురాంగా, రేపల్లెలో రాధలో దీక్షా రఘరాంగా పరిచయమైన ఈమె ఒకప్పటి డ్యాన్స్ డైరక్టర్ రఘురాం పెద్ద కూతురు..చక్కని మోము, అంతకంటే చక్కని శరీరంతో మంచి పేరు తెచ్చుకునే సమయానికి ఉన్నట్లుండి కనుమరుగైపోయింది.


2001లో తెలుగు తెరకి పరిచయం అయిన గాయత్రి రఘురాం..తమిళ కుటుంబానికి చెందిన అమ్మాయి. తమిళ్‌లో చార్లీ చాప్లిన్ , కన్నడంలో మనసల్లా నీనేతో రెండు భాషల్లో మంచి పేరు తెచ్చుకుంది కూడా..మలయాళంలోనూ మంచి సినిమాలే చేసినా..2006లో సినిమాలు తగ్గించేసుకుంది. దీపక్ చంద్రశేఖర్ అనే కంప్యూటర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్లిపోయింది. అప్పట్లో తమిళనాడులో జరిగిన గ్రాండ్ మ్యారేజెస్‌లో అది కూడా ఒకటి అని చెప్తారు..అంటే ఐదంటే ఐదేళ్లే నటించి కెరీర్‌కి శుభం కార్డు వేసుకుంది. ఐతే ఆ తర్వాతే ఆమె జీవితం మలుపు తిరిగింది. 2008లో ఇండియాకి వచ్చిన ఆమెకి భర్త విడాకులు నోటీసులు ఇచ్చాడు. షాక్ తిన్న ఆమె..తిరిగి అతన్ని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా అవన్నీ నిష్ఫలం అయ్యాయ్.



 దీంతో సినిమాలలోకి తిరిగి రాకతప్పని పరిస్థితి ఏర్పడింది. మధ్యలో తన తండ్రి రఘురాం చనిపోవడంతో..గాయత్రి, సుజారఘరాంకి పెద్ద షాక్ తగిలింది. ఇక అప్పట్నుంచీ గాయత్రి తన తండ్రి బాటలోనే పయనించి మంచి డ్యాన్స్ డైరక్టర్‌గా పేరు తెచ్చుకుంది..ఈ పదేళ్లలో వంద సినిమాలకు కొరియాగ్రఫీ చేసింది. డ్యాన్స్ డైరక్టర్‌గా ఎంత బిజీ అయిందంటే..మూడేళ్లలో 35 పాటలకి నృత్యదర్శకత్వం వహించింది. మల్లన్న సినిమాలో ఎక్స్ క్యూజ్ మి మిస్టర్ మల్లన్నకి ఆమే డ్యాన్స్ డైరక్షన్ చేసింది..ఇంకా ఆమె ఖాతాలో ఇలాంటి పాటలు చాలానే ఉన్నాయ్...తెలుగులో లవ్ ఫెయిల్యూర్ వంటి సినిమాలూ చేసింది..ఐతే ఇక్కడ పెద్దగా ఆదరించలేదు. కమల్ హసన్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా కూడా గాయత్రి రఘురాం పాల్గొనడం విశేషం. ఇందులో ఆమెకి వారానికి రెండు లక్షల రూపాయల పారితోషికం అందినట్లు టాక్. ఇప్పటివరకూ సినిమాల్లో నటించి కానీ..కొరియాగ్రఫీ ద్వారా కానీ సొంతంగా రూ.30కోట్ల వరకూ సంపాదించినట్లు అంచనా. ఇంతా చేసి గాయత్రి రఘురాం వయస్సు ముప్పైనాలుగేళ్లు..పుట్టింది ఏప్రిల్ 23, 1983














Comments