మహేష్ బాబు హీరోగా శరత్‌కుమార్ కాంబినేషన్ ఇది రెండోసారి తెలుసా



మహేష్ బాబు చిన్నతనంనుంచే తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసిన సంగతి అతని ఫ్యాన్స్‌కి బాగా గుర్తు
ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు హీరోగా నటిస్తున్న సినిమాల్లో సాటి నటులతో చిన్ననాడే చాలాసార్లు కలసి నటించారు. అందులో శరత్ కుమార్ కూడా ఒకరు. అయితే ఆ సినిమాలో కూడా  మహేష్ బాబు హీరోనే..ఇదే చాలామందికి గుర్తుండకపోవచ్చు.
అప్పుడే మహేష్ బాబు చిన్న పాత్రలనుంచి హీరోగా ఎదిగే వయసులోకి వస్తున్నాడు. బహుశా టీనేజ్‌ పూర్తయ్యే దశలో అనుకుంటా..సూపర్ స్టార్ కృష్ణ డైరక్షన్‌లో బాలచంద్రుడు అనే సినిమా నిర్మించారు. ముగ్గురు కొడుకులు, గూడఛారి 117, కొడుకు దిద్దిన కాపురం వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన మహేష్‌ని హీరోగా పెట్టి  ఓ సినిమా తీయాలని చాలామంది నిర్మాతలు కృష్ణగారిని ఒత్తిడి తెచ్చారట..ఐతే మహేష్ చదువు చెడిపోతుందని కృష్ణ ఒక్క బాలచంద్రుడుని తీసి ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. 

అందులోనివే ఈ స్టిల్స్..ఇందులో మహేష్ అక్కగా దీప నటించారు. దీపని వేధించే ఆకతాయి విలన్‌గా శరత్ కుమార్ నటించగా..అతనిని చితకబాదతాడు మహేష్..అది మనసులో పెట్టుకుని పెళ్లైన తర్వాత  దీప ని అనుమానించేలా ప్రవర్తిస్తాడు శరత్ కుమార్..అతనికి, మిగిలిన విలన్లకి బుద్ది చెప్పి తన అక్క కాపురాన్ని చక్కదిద్దడమే ఈ బాలచంద్రుడి కథ


అలా అప్పట్లోనే మహేష్ బాబు, శరత్ కుమార్ కాంబినేషన్ వర్కౌట్ అయింది. ఇదిగో ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల తర్వాత తిరిగి కలసి నటించడం విశేషం..ఈ ముఫ్పై ఏళ్లలో మహేష్ సూపర్ స్టార్ అవడం..శరత్ కుమార్ సూపర్ హీరో అవడం గమనార్హం.











Comments