ఛానల్స్ విషయంలొ పవన్ వైఖరి కరెక్టా..కాదా..గతం ఏం చెప్తొంది


ఏబిఎన్, టివి9, టివి5ని బాయ్ కాట్ చేయాలంటూ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన అసలు మీడియా సంస్థలతొ ఒక వ్యక్తి వైఖరి వలన లాభం కలుగుతుందా..నష్టం చేకూరుతుందా అనే చర్చకు దారి తీస్తొంది..తర్వాత పవన్ కల్యాణ్ వీళ్లతొ ప్యాచప్ అవనీండి..అవనీకపొండి..కానీ ఈ సందర్భంలొ తప్పకుండా గతంలొ ఇలానే వ్యవహరించిన వ్యక్తులు ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు..దానివలన వారికి లాభం కలిగిందా..నష్టం కలిగిందా  అనే విషయం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రని గమనించినప్పుడు పత్రికల ప్రభావం ప్రజలపై క్రమేపీ పెరుగుతూ వచ్చి 2004 సమయానికి భారీతనాన్ని సంతరించుకుంది..ఇప్పుడు మాత్రం ఏ వార్త ఎందుకు ఎవరు రాస్తున్నారొ వెంటనే తెలిసిపొయే స్థాయికి చదువరులు, ప్రేక్షకులు చేరుకున్నారు. ముందు మన కథనం విషయానికి వస్తే, మీడియాతొ శత్రుత్వం కానీ విరొధ భావం కానీ ఆయా వ్యక్తులకు మంచి చేస్తుందా..చెడు చేస్తుందా అని చూస్తే..ఆ వ్యక్తుల హొదాని బట్టి కూడా అని ఇప్పుడు చెప్పుకొవాలి..గతంలొ పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా స్పష్టమైన తేడా వచ్చింది. గతంలొ అధికారంలొ ఉన్న పార్టీలీడర్లపైనా వ్యంగ్యాస్త్రాలు, ప్రతికూల వార్తలు యధేఛ్చగా వచ్చేవి..కానీ ఇప్పుడు మాత్రం అలా రాసే స్వేఛ్చ, చూపించే స్వేఛ్చ సగానికి సగం తగ్గిపొయింది.

ఇది నాటి ఎన్టీఆర్ నుంచి నేటి పవన్ కల్యాణ్ వరకూ తరచి చూస్తే అర్ధం అవుతొంది. ఎందుకంటే..ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నిక అవడానికి, అప్పటి దినపత్రికల్లొ వచ్చిన కవరేజీ బాగా ఉపయొగపడింది. ఎక్కడబడితే అక్కడ స్నానాలు చేయడం..జనంలొ కలిసితిరిగే ఫొటొలు..ఈనాడు పత్రికలొ రావడంతొ అది ఎన్టీఆర్‌కి తద్వారా ఆ పత్రిక సర్క్యులేషన్  పెరగడానికి బాగా ఉపయొగపడింది. ఆయనపై నాదెండ్ల భాస్కరరావు చేసిన ప్రయొగం వికటించడానికి కూడా ఈనాడు వంటి పత్రికలు కూడా కారణమయ్యాయ్.

 తనకి మద్దతు ఉన్న ఎమ్మెల్యేలతొ నాదెండ్ల గవర్నర్ కి లేఖ ఇస్తే..ఆయన ముఖ్యమంత్రిగా నాదెండ్లకి అవకాశం ఇచ్చారు..ఇది ఇలానే రాసేస్తే..ఎక్కడా ఏదీ అన్యాయం అని జనాలకి అన్పించకపొదు..ప్రజాస్వామ్యం ఖూనీ..రగిలిన తెలుగొడు..మిత్రపక్షాల బాసట, ఢిల్లీ పెద్దల అన్యాయం అంటూ వార్తలు రాయడంతొ జనంలొ కూడా ఇది తమకే జరిగిన అన్యాయంగా భావించారు..ఎన్టీఆర్ చర్యలకు మద్దతు పలికారు..మరి అలాంటి సిత్రాలే ఇప్పుడు అనేక రాష్ట్రాల్లొ జరగడం చూశాం..ఎక్కడైనా జనం వచ్చారా..ఏ పత్రికైనా ఇలా ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని రాశారా..ఇదే మీడియా మేనే‌జ్‌మెంట్..ఇదే చేయలేక..1996లొ ఎన్టీఆర్ పదవి పొగొట్టుకున్నారు. వైస్రాయ్ హొటల్‌లొ చంద్రబాబు ఎమ్మెల్యేలను ఉంచినప్పుడు..ఈనాడు, జ్యొతిలొ చంద్రబాబు శిబిరంలొ మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా కలరింగ్ ఇచ్చేవి..ఉన్నవారికంటే ఎక్కువే ఉన్నట్లు చెప్పుకొచ్చేవి . దీనికి కారణం కూడా..ఎన్టీఆర్ ఈనాడు అధిపతితొ విభేధించడమే అని అంటారు.

1994కి ముందు తాను లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకొవడం ఇష్టం లేనట్లుగా వ్యవహరించినవారందరినీ ఎన్టీఆర్ ఆ తర్వాత దూరం పెట్టారు. వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కూడా తగ్గించారు. ఉదయం పత్రికను మూతబడేలా చేయడం కూడా ఆయనకి ిఇష్టం లేదంటారు..అలా మీడియాలొ ఒక పెద్ద పత్రిక మద్దతు కొల్పొయారాయన.


 అదే తర్వాతికాలంలొ ఆయన పదవి పొయినప్పుడు కూడా ఈ పత్రికలు సపోర్ట్ చేయకపోగా..అధికార మార్పిడి అనేది సక్రమంగానే జరిగినట్లు కలరింగ్ ఇచ్చాయ్. కనీిసం సభలో స్పీకర్ ఎన్టీఆర్‌ని మాట్లాడనివ్వని అంశానికి కూడా ప్రాధాన్యత లేకుండా చేశాయ్..ఇది ఎన్టీఆర్ కి వాటిల్లిన నష్టం. ఆ తర్వాత వైఎస్సార్ విషయం చెప్పుకోవాలి. 1999 సమయంలో ఆయనపై వ్యతిరేక కథనాలు వచ్చేవి. వాటికి సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా వైఎస్ తన ధోరణిలో తాను ఉండేవాడు. ఐతే 2004 సమయానికి ప్రజాసంకల్పం పాదయాత్రకి అన్ని పత్రికలూ ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది లేదంటే ఇతర పత్రికల సర్క్యులేషన్ పెరిగేది. అందుకే వైఎస్ తనకి ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా..రామోజీరావ్ ని వదల్లేదు. మీ పత్రికల్లో చంద్రబాబు ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుకోేండి..బిల్ గేట్స్‌కి కంప్యూటర్, సచిన్‌కి క్రికెట్ చంద్రబాబే నేర్పారని మీ రాసుకుంటే రాసుకోండని ఘాటుగా ఓ లెఖ కూడా రాసారప్పట్లో..ఇదే ధోరణి ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా కొనసాగించారు. ఇక్కడే ఎన్టీఆర్, వైఎస్‌లకు రామోజీ లేదంటే పత్రికలంటే ఎందుకు పడదనే అంశంపై ఆసక్తికర చర్చ సాగింది. అంతకు ముందున్న ముఖ్యమంత్రులు పత్రికలవారి గుడ్ లుక్స్ లో ఉండేవారు. మంచి సంబంధాలు మెయిన్ టైన్ చేశేవారని అంటారు. కానీ వీరిద్దరి విషయం మాత్రం వేరు. మాతో సఖ్యతగా ఉండాలనే సంకేతాలు పంపినప్పుడు వై షుడ్ వియ్..అనే ధోరణ ిప్రదర్శించారు..దీనికి కారణం..వీరిద్దరూ జనంలోంచి వచ్చిన నాయకలు..రియల్ లీడర్స్..అందుకే ఒకరిని పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు..ఏదైనా ఉంటే జనంలోనే తేల్చుకుంటామనే లైన్ తీసుకున్నారు..ఇది అప్పట్నుంచి..ఇప్పటిదాకా లీడర్లను పరిశీలించిన కొంతమంది పెద్దల అభిప్రాయం. 2004లో వైఎస్ కార్యక్రమాలపై వ్యతిరేక వార్తలు వచ్చిన కొన్ని రోజుల వరకూ వాటిని పట్టించుకోకపోయినా..తమపై బ్యానర్ లైన్లు రాసినప్పుడు మాత్రం వైఎస్ ఇక సహించకుండా..కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు. రామోజీరావ్ అయితే ఏంటి..ఇంకొకరైతే ఏంటి..చట్టాన్ని వాడదాం..ఎవరి బొక్కలైనా తీద్దాం అనే స్థాయిలో యుధ్దం ప్రారంభించారు.


ఈ దెబ్బకి రామోజీ ఆర్ధిక పునాది అయిన మార్గదర్శి కదిలిపోయింది. దీంతో రామోజీరావ్ తన సర్వశక్తులూ క్రోడీకరించి మరీ ఈ ఎపిసోడ్ నుంచి బైటపడ్డారంటారు. అప్పట్లోదానిని మీడియాపై దాడిగా ఆయన వర్ణించారు. ఐతే వైెఎస్  మాత్రం కోర్టుల్లో కూడా ఈ పత్రికలు ఆది నుంచీ కాంగ్రెస్ వ్యతిరేక ధోరణి ప్రదర్శించారని కౌంటర్లు కూడా దాఖలు చేశారు. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు..ఇంకే ముఖ్యమంత్రీ పత్రికలపై చేయలేదు. ఐతే వైఎస్ ఆంధ్రజ్యోతి, ఈనాడుపై ప్రదర్శించిన ధోరణి సాక్షి అనే పత్రికకు ఆవిర్భావంగా నిలిచింది. దీంతో కౌంటర్ జర్నలిజం కూడా తెలుగునాట తీవ్రస్థాయికి చేరింది. వైెఎస్ కి దీనివలన లాభమే జరిగింది కానీ నష్టం మాత్రం వాటిల్లలేదు. ఐతే ఈ వ్యతిరేకత వైెఎస్ జగన్‌కి వారసత్వంగా సంక్రమించింది. తానుగా ఈ రెండు పత్రికలపై ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయబోయినా..అవి తమ పాత బాణీకే కట్టుబడ్డాయ్. దీంతో కీలకంగా మారిన 2014 ఎన్నికలలో వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా వెలువడ్డాయ్. ఇది జగన్ పై జనంలో అంతర్గతంగా వ్యతిరేకత రావడానికి కారణమైంది. ఇది గుర్తించే, తర్వాత రామోజీరావ్‌తో జగన్ ప్యాచప్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఐనా కూడా ఈనాటికీ జగన్‌ వార్తలకు ఈ రెండు పత్రికల్లో ప్రాధాన్యత ఉండదు. ఇది గతంలో వరకూ చెల్లింది కానీ..ఇప్పుడు మాత్రం డిజిటల్ మీడియా రావడంతో..జనం ఏ వార్త ఎవరు ఎందుకు రాస్తున్నారో వెంటనే చెప్పేస్తున్నారు. జగన్‌ ఇప్పటికీ బ్యాన్ ఆన్ జ్యోతి వైఖరే అవలంబిస్తున్నారు. 2019 ఎన్నికల ఫలితాలే జగన్ లైన్‌ లాభమా నష్టమా అనేది తేల్చుతాయ్.  ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి కూడా మీడియా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ప్రజారాజ్యం గెలవకపోవడంతో జెండా పీకేస్తున్నారంటూ జ్యోతిలో కథనం రావడం..దానిపై ఆయన తీవ్రంగా మండిపడటం తెలిసిందే..కొన్ని పత్రికలు వార్తలు  రాయడం మానేసి..గూడుపుఠానీలు చేయడం..తీర్పులు ఇవ్వడం మొదలైన తర్వాత జనం చీదరించుకుంటున్నా అవి తమ ధోరణిలోనే వెళ్తున్నాయ్. ఇదే గజ్జి ఛానళ్లకీ అంటుకుంది.


 అందుకే ఇప్పుడు మీడియాకి వ్యతిరేకంగానీ..ప్రత్యేకించి రెండు మూడు ఛానళ్లకి వ్యతిరేకంగా  మాట్టాడటం కానీ..ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అభిప్రాయాలే వార్తలైన చోట వ్యతిరేకత అత్యంత సహజం. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ విషయానికి వస్తే..ఆయన ప్రసార మాధ్యమాలపై మండిపడటం కొత్తేం కాదు. గతంలో అన్న కుమార్తె నిశ్చితార్దం రోజున ఫోటో కోసం ట్రై చేసిన జర్నలిస్టుపై దాడి చేయడం..పరిటాల తనకి గుండు కొట్టించారనే ప్రచారంపై మండిపడటం చూశాం..డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశాడు కూడా..ఈ చర్యల వలన ఆయనకి వాటిల్లిన నష్టం ఏం లేదు. స్టార్ డమ్ తగ్గిందీ లేదు..ఐతే ఇప్పుడు పవన్ కల్యాణ్ వేరు రాజకీయ పార్టీ ప్రెసిడెంట్ గా ఓ మూడు ఛానళ్లని బాయ్ కాట్ చేస్తే..నష్టమా లాభమా..నష్టం ఉండదు..ఎందుకంటే..ఇప్పటికే ఆయనపై ప్రతికూల వార్తలు ప్రసారం చేసుకునే ఛానళ్లు కొన్ని ఇంకాస్త ఎక్కువ చేస్తాయ్. ఈయనకంటూ కొన్ని ఛానళ్లు ఉన్నప్పుడు తన వాణి విన్పించేందుకు ఢోకా లేదు. కానీ పెద్ద పెద్ద విషయాలపై ఆయన అనుకున్నట్లుగా జనానికి తన కార్యక్రమాలు చేరకపోవచ్చు. ఐతే ిఇది అధికారంలో ఉన్నప్పుడు వేరు..ఇలా ఏ అధికారంలో లేకుండా వేరు. ఎందుకంట ే2014 తర్వాత తెలుగు ఛానళ్లలో ఒక విపరీత ధోరణి పెరిగింది.




తమకి అనుకూలంగా రాయని..తమపై వ్యంగ్యంగా రాసే..చూపించే ఛానళ్లని ప్రసారం కానివ్వకపోవడమనే పద్దతి చోటు చేసుకుంది. దీంతో ఆయా ఛానళ్లు మనుగడ కోసం లొంగకతప్పని పరిస్థితి. ఇలాంటి స్థితిలో పవన్ కల్యాణ్ 3 ఛానళ్లని చూడొద్దని పిలుపు ఇవ్వడంతో ఆయనకి వ్యక్తిగతంగా నష్టం లేదు. కానీ ఆ మూడు ఛానళ్లకీ మెగా కాంపౌండ్ నుంచి ఆడియో ఫంక్షన్ల ప్రసార హక్కులు దక్కవు. ఇది రెవెన్యూ పరంగా వాటికి వాటిల్లే నష్టం..ఐతే రాజకీయంగా వీలైనన్ని ఛానళ్లు అనుకూలంగా ఉంటే..సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్నది నేతల మాట. ఎందుకంటే రాజకీయాల్లో 2శాతం ఓట్లే కీలకం..49శాతం ఓట్లు వచ్చినా ప్రయోజనం లేదు..అంటే 51శాతం ఓట్లు వస్తేనే గెలుపు..అందుకే తమకి సాధ్యమైనంతవరకూ మైలైజీ కోసమే చూసుకునే లీడర్లు మీడియాకి వ్యతిరేకంగా వెళ్లరంటారు..ఐతే ఏది పడితే అది ప్రసారం చేస్తూ..బురద జల్లుతూ పోతున్నప్పుడు సత్తా ఉన్న లీడర్లు వాటిని ఖాతరు చేయరనేది కూడా చరిత్ర చెప్తోన్న సత్యమే

Comments

  1. This issue was always about to happen if not with this incident, electronic media has crossed its limits long back, it completely moved away from its core duty of acting as a medium of mass communication, all the channels are so deeply involved in propaganda based news spreading and broadcasting. Keeping aside its effect on Pawan Kalyan's political future, he did right thing in keeping this issue in public for discussion.

    ReplyDelete

Post a Comment