బైటికి గెంటేస్తా..! ఏమనుకున్నావో.. చింతమనేనికి చంద్రబాబు వార్నింగ్..


పార్టీలో డిసిప్లిన్ తప్పుతున్న నేతలపై సిఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. వరసగా దూకుడుగా వెళ్తోన్న చంద్రబాబు రెండురోజుల్లో ఒకమంత్రి, ఇద్దరు ఎంపిలు..నలుగురు ఎమ్మెల్యేలను దులిపిపారేసారని చెప్తున్నారు..వీరిలో మొదటగా ప్రభుత్వ విప్ కూడా అయిన చింతమనేని అంటే చంద్రబాబుకి మరీ మండుకొస్తోందట పద్దతి కనుక మార్చుకోకపోతే..మర్యాదగా ఉండదని..తేల్చేశారట చంద్రబాబు. వచ్చేదంతా ఇక ఎన్నికల సీజనే కావడంతో ఎవడన్నా హద్దు దాటాడంటే బైటికి పంపిస్తా..మహా అయితే ఒక ఎమ్మెల్యే సీటే పోతుంది అంతే కానీ పార్టీ పరువు బజారుకి ఈడ్చేలా బిహేవ్ చేస్తేమాత్రం సహించనని చంద్రబాబు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారట
చంద్రబాబు గతంలో చాలామందికి తమ తీరు మార్చుకోవాలని సాఫ్ట్‌గా చెప్పారు. ఐనా  వినకుండా మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోనే చంద్రబాబు వైఖరిలో సడన్ గా మార్పు వచ్చిందని అంటున్నారు.వీరిలో  
ముఖ్యంగా, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ వ్యవహారం చంద్రబాబుకు అస్సలు జీర్ణం కావడం లేదట మూడేళ్ల క్రితం ఎమ్మార్వో వనజాక్షిపై  ఆయన చేయి చేసుకున్న విషయం కూడా తెల్సిందే కదా.. రీసెంట్ గా బస్సుపై అంటించిన పోస్టర్లో చంద్రబాబు బొమ్మ చిరిగిందన్న కారణంతో ఆర్టీసీ సిబ్బందితో.. అడ్డువచ్చిన వారితో తగాదా పెట్టుకున్నాడు చింతమనేని.. అందులో ఒకరిని కొట్టారన్న కారణం కూడా  చింతమనేనిపై బాబు గుర్రుగా ఉండటానికి దారి తీసింది. రెండ్రోజుల క్రితం తన దగ్గరకి వచ్చిన ప్రభాకర్ ని పట్టుకుని చంద్రబాబు చెడా మడా వాయించేశారట. ఎలాంటి పదవిలో ఉన్నారు..ఎలా బిహేవ్ చేస్తున్నారు..రోడ్లపై గొడవలేంటి..ఈ తగాదాలేంటి వీధి రౌడీల్లా 
చేస్తున్నారే...ఇలా అయితే ఇక ఊరుకోను.. నీ విషయంలో ఇప్పటికి రెండు మూడుసార్లు ఓపిక పట్టాను. అయినా మార్పు లేదు. ఇంకోసారి ఇలాంటి గొడవల్లో తలదూర్చితే ఎంత కఠిన నిర్ణయానికైనా వెనుకాడను. ఒక నియోజకవర్గం పోయినా ఫర్వాలేదు. పార్టీ ప్రతిష్ట నాకు ముఖ్యం' అంటూ చంద్రబాబు హెచ్చరించడంతో చింతమనేని మైండ్ బ్లాకైనంత పనై..నోటి మాట పడిపోయినట్లై..కామ్ గా వచ్చేశారట..దీంతో మారిన బాబు వైఖరిని పార్టీలో కొంతమంది అభినందిస్తున్నారు..

Comments