లగడపాటి సర్వే‌లో జనసేన మరీ అంత చీప్‌గానా ..నిజమేనా ఇది


లగడపాటి రాజగోపాల్ అంటే పెప్పర్ స్ప్రేయర్‌గానే కాకుండా..తన సర్వేలతో రాజకీయపార్టీల్లో చురుకు పుట్టించిన హీరోగా కూడా ప్రసిధ్దుడు..రీసెంట్‌గా కొన్ని జరగకపోయినా..దాదాపుగా ఆయన ఏదైనా అంశంపై సర్వే చేయించాడంటే చాలామంది నమ్ముతారు. అలానే 2013లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయన చెప్పినట్లే జరిగింది కూడా..అందుకే లగడపాటిని ఆంధ్రాఆక్టోపస్ అని కూడా అంటారు.

తాజాగా 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఎవరికెన్ని సీట్లు వస్తాయనే అంశంపై లగడపాటి ఓ సర్వే చేయించారంటూ లీకులు వచ్చాయ్. దీనిపై ఆయన బైటికి వచ్చి చెప్పిందేమీ లేదు. ఐనా సదరు ప్రచారంలో ఉన్న లీకు ప్రకారం తెలుగుదేశం పార్టీకే అధికారం దక్కుతుందట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తుందని చెప్పిందా సర్వే. ఐతే సీట్లు మాత్రం పెరుగుతాయని వాళ్లు చూపిస్తున్న అంకెలు చెప్తున్నాయ్. టిడిపికి 98సీట్లు..జగన్ పార్టీకి 71సీట్లు వస్తాయట. ఇక బరిలో దిగితే జనసేన పార్టీకి వచ్చే సీట్లెన్నో తెలుసా..ఐదంటే ఐదేనట. దీంతో ఇలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. తమ నేతకు ఉన్న ఫాలోయింగ్ తెలిసి కూడా ఇలాంటి నంబర్లు చెప్పడమేంటని విరుచుకుపడుతున్నారు. రానున్న ఎన్నికలలో తమ ప్రభంజనం సృష్టిస్తుందని  ఎన్టీఆర్ తర్వాత మరో నటుడు సిఎం అఁటూ అయితే అది తమ హీరోనే అంటూ గప్పాలు కొడుతున్నారు.

ఈ సర్వే ప్రకారం జనసేన అంటూ నిలబడితే..ఓట్లు చీలిపోవడం తధ్యమని అది టిడిపి, వైెఎస్సార్ కాంగ్రెస్‌ రెండు పార్టీలకు ఆ దెబ్బ తగులుతుందని ఈ లెక్క చెప్తోంది. కానీ జగన్ పార్టీ నేతలు మాత్రం ఇదో సర్వేనే కాదంటున్నారు..ఖచ్చితంగా 100 సీట్లకి మించి గెలవడం ఖాయమంటున్నారు. 13 జిల్లాలకు ఒక సీటు గెలుచుకున్నా..కనీసం 13 సీట్లు గెలిచే సత్తా ఉన్న తమ పార్టీకి కేవలం ఐదంటే ఐదే సీట్లు వస్తాయని ఎట్లా అంటారని జనసేన కార్యకర్తలు వాపోతున్నారు. ఈ వాదనల సంగతి ఎలా ఉన్నా..ఇదీ తన లెక్క అని లగడపాటి మాత్రం ఇంతవరకూ బైటికి వచ్చి చెప్పలేదు. అందుకని మనం కూడా నమ్మలేం. ఎందుకంటే ఆయన సర్వే కనుక చేస్తే బైటికి వచ్చి ఓపెన్‌గానే చెప్తాడు. ఇదే విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా చెప్తున్నారు

Comments