హరిబాబు గుడ్ బై.. వెనుక అసలు కారణం ఇదేనా?


ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షపదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఈ మధ్యనే పార్టీ ప్రెసిడెంట్‌గా ఈయన పదవిని అమిత్ షా పొడిగించారు. ఈ నేపధ్యంలో ఇక వచ్చే రెండేళ్లపాటు ఈయన ఆధ్వర్యంలోనే పార్టీ నడవనుందని..ఎన్నికల్లో కూడా సీట్ల పంపిణీలో కీ రోల్ పోషిస్తారని భావించారు. ఐతే ఉన్నట్లుండి ఇలా పార్టీ పదవికి గుడ్ బై చెప్పడం వెనుక వేరే కారణం ఉందంటారు. ముందైతే..ఎన్టీఏ నుంచి టిడిపి బైటికి వచ్చిన తర్వాత వీర్రాజు, విష్ణువర్ధన్ ఆ పార్టీపై తీవ్రస్థాయిలో రెచ్చిపోతుండగా..ఈయన మాత్రం ఎక్కడా హద్దు మీరలేదు. ఇదే బిజెపిలోని కొంతమంది నేతలకు నచ్చలేదు. కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురంధీశ్వరి, కావూరి సాంబశివరావ్ వంటి నేతలు ఇదే విషయంపై మొదట్నుంచీ ఢిల్లీస్థాయిలో ప్రచారం చేశారు. ఇంక ఎన్నికలకు సంవత్సరమే గడువు ఉండటంతో ఈయన ఆధ్వర్యంలో ఇలానే ముందుకు వెళ్తే..అది టిడిపికే మేలు చేస్తుందని వీళ్లంతా ఫిర్యాదులు చేశారని టాక్..అందుకే అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి హరిబాబుకి సంకేతాలు పంపించడంతో..ఈ అకస్మాత్తు నిర్ణయం వెలువడింది. నిజానికి గత వారంలోనే కంభంపాటి హరిబాబు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రానికి బిజెపి విడుదల చేసిన ఆర్ధిక సాయం గురించి వివరించారు. ఇంతలోనే స్టాండ్ మారిపోవాల్సిన అవసరం లేదు..ఎన్నికల ఏడాది కాబట్టే..దూకుడుగా వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించి బిజెపి ఈ నిర్ణయం తీసుకుందని టాక్. కంభంపాటి హరిబాబు వైఎస్ జగన్ తల్లి విజయమ్మపై గెలిచిన తర్వాత బిజెపికి రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి కట్టబెట్టడంతో సముచిత స్థానమే ఇచ్చినట్లైంది. ఐతే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇప్పుడదే వైఎస్సార్ కాంగ్రెస్‌తో అంటకాగే సూచనలు కన్పిస్తున్నాయ్. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు హరిబాబుకి ఇష్టం లేకపోయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు..ఐతే పార్టీనే స్వయంగా ఆయనకి సిగ్నల్స్ పంపడంతో తన దారి చూసుకున్నట్లు అర్ధమవుతోంది. హరిబాబు రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర కమిటీని బిజెపి కొత్తగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయడమే ఇఁదుకు నిదర్శనం

Comments