స్టార్‌ హీరొలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు..చివరికి ఆ హీరొనే ముంచేస్తే ఆ నిర్మాత కథ ఎలా ముగిసిందొ చూడండి


నిర్మాతలంటే సినిమాలొకంలొ తండ్రిలాంటి వాడంటారు. కుటుంబంలొని పెద్దగా ఆ ఫ్యామిలీ మొత్తానికి అయ్యే ఖర్చుని తానే భరిస్తూ..సంసారాన్ని భరించేవాడనే ఉద్దేశంతొ అలా అంటారు. ఇప్పుడు నిర్మాతలంటే కేవలం డబ్బులు పెట్టుబడి పెట్టి తమాషా చూసేవాడనే స్థాయికి దర్శకులు, హీరొలు తీసుకొచ్చారు..మరి పాత రొజుల్లొ నిర్మాతలంటే పెద్ద పెద్ద హీరొలూ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్లు..ఒకింత భయం కూడా ఉండేది..అలాంటి నిర్మాతలలొ దేవీ వరప్రసాద్‌ కూడా ఒకరు..ఆయన తండ్రి కనకమేడల తిరపతయ్య..పెద్దాయన ఎన్‌టిఆర్‌కి చిన్ననాటి స్నేహితుడంటారు.
అలా ఆ స్నేహంతొనే ఎన్టీఆర్‌తొ శ్రీకృష్ణావతారం అనే సినిమాని అట్లూరి పుండరీకాక్షయ్యతొ కలిసి తీశారు..వారిద్దరి బ్యానరే..తారకరామా పిక్చర్స్..ఈ పతాకంపైనే అనేక సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్లు కూడా..అయితే తిరపతయ్య చనిపొయిన తర్వాత ఆయన కొడుకు దేవీ వరప్రసాద్ రంగప్రవేశం చేశారు. డి.యొగానంద్ డైరక్షన్‌లొ కథానాయకుని కథ పేరుతొ సినిమా నిర్మించారు..ఆ హిట్ తర్వాత ఇక దేవీవరప్రసాద్ తీస్తే ఎన్టీఆర్‌తొనే సినిమాలు తీశారు. వరసగా..కేడీనంబర్ వన్, ఎదురులేని మనిషి..తిరుగులేని మనిషి..నా దేశం సినిమాలు నిర్మించారు.ఇఁదుల ొ తిరుగులేని మనిషిలొ చిరంజీవి కూడా ఎన్టీఆర్‌తొ కలిసి నటించారు.





ఐతే నాదేశం తర్వాత ఎన్టీఆర్ పాలిటిక్స్‌లొకి వెళ్లిపొవడంతొ నెక్ట్స్ ఊపు మీదున్న  చిరంజీవి హీరొగా సినిమాలు నిర్మించారు. అవి చట్టంతొ పొరాటం,  చట్టంతొ పొరాటం, కొండవీటి రాజా, మంచి దొంగ, ఘరానామొగుడు, అల్లుడా మజాకా, మృగరాజు, సినిమాలు..ఐతే ఈ మధ్యలొ ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా ఒత్తిడి తీసుకురావడంతొ వేరే బ్యానర్‌పై బాలకృష్ణతొ భలే దొంగ అనే సినిమా తీశారు.. అది యావరేజ్ గా ఆడింది..అలానే అల్లు అరవింద్ తొ భాగస్వామ్యంత డబ్బు భలే జబ్బు..అమ్మరాజీనామా వంటి సినిమాలు కూడా తీశారు. ఐతే ఆయన నిర్మాతగా తీసిన చివరి సినిమా మృగరాజు..ఇది అట్టర్ ఫ్లాప్ అయింది..ఈ సినిమాతొ వచ్చిన నష్టాలకు ఆయన ఆస్తంతా ఊడ్చుకుపొయిందంటారు. ఎందుకంటే ఇది రిలీజ్ అయ్యే సమయానికి ఒక హాలీవుడ్ సినిమా అడవిరాజు పేరుతొ డబ్బింగ్ చేసి విడుదలకు రెడీ చేశారు..దానిని ఆపేందుకు దాదాపు కొటి రూపాయలు ఖర్చైందంటారు..చూడాలని ఉంది హిట్ తర్వాత చిరంజీవి గుణశేఖర్ తొ కలిసి చేసిన సినిమా కావడంతొ భారీగా ఖర్చు పెట్టారు. అలానే ఇందులొ నటించేందుకు  ఆఫ్రికా నుంచి ప్రత్యేకంగా రప్పించిన సింహానికి కొటి రూపాయలవరకూ ఖర్చైందని టాక్..


ఇలా అన్ని రకాలుగా ఈ సినిమా దేవీవరప్రసాద్‌ని ముంచేసింది.ఐతే ఆ తర్వాతా ఆయన సినిమాలు తీసేందుకు సిధ్దపడ్డారు..కానీ ఆయనకు డేట్స్ ఇవ్వడానికి చిరంజీవి రెడీ అవలేదు..దీనికి దేవీవరప్రసాద్ ఆస్తులు పొవడమే కారణమంటారు..ఐతే ఇండస్ట్రీలొ పెద్ద హీరొలతొ తీస్తే..ఎన్టీఆర్ లేదంటే చిరంజీవితొ మాత్రమే తీస్తా వేరెవ్వరితొ తీయనంటూ అప్పట్లొ ప్రకటించి సంచలనం కలిగించారాయన.






అలాంటిది వేరేవాళ్లతొ సినిమా తీస్తా అని వారిని ఎలా అప్రొచ్ అవ్వాలి.. అంత భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాత  ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు వేరే హీరొ దగ్గరకు వెళ్లగలను అని సన్నిహితుల దగ్గర తీవ్రంగా బాధపడ్డారట. తాను చిరంజీవికి కెరీర్ బిగినింగ్‌లొ మాస్ హీరొ ఇమేజ్ పెంచిన కొండవీటి రాజా, మంచిదొంగ, ఘరానా మొగుడు తీశాను..ఫ్లాపుల వరదలొ ఉండి ఏ నిర్మాత సాహసించకపొతే..అల్లుడా మజాకా తీసి హిట్ ట్రాక్‌లొ పెట్టాను..అలాంటి చిరంజీవి నాకు డేట్స్ ఇవ్వడా అని వాపొయారట. ఆ పైన డేట్స్ ఇవ్వకపొవడం అటుంచి కలవడానికి కూడా చిరంజీవి ఇష్టపడలేదట..ఒకప్పుడు కొండవీటి రాజా టైమ్‌లొ వేరే సినిమా షూటింగ్ సమయంలొ గాయపడిన చిరంజీవి కొసం సినిమా విడుదలనే..20 రొజులు వాయిదా వేసుకున్న నిర్మాతకి చిరంజీవి ఇచ్చిన మర్యాద అది..అదిగొ,   అలా ఆ బాధతొనే దేవీవరప్రసాద్ బెంగ పెట్టుకున్నారని అంటారు..పైగా ఇదే సమయంలొ "తిరుగులేని మనిషి ఫ్లాపైతే..అన్నగారు మరొ సినిమాకి డేట్లు ఇచ్చి ఆదుకున్నారు..కానీ చిరంజీవి ఇలా చేస్తారనుకొలేదని " కూడా బాధపడ్డారట..అలా చాన్నాళ్లు బాధపడి చివరికి 2010లొ కన్నుమూశారాయన. ఆ తర్వాత భజంత్రీలు అనే ఎంఎస్ నారాయణ కొడుకు హీరొగా నటించిన సినిమాని ప్రొడ్యూస్ చేసినా..అదీ వర్కొట్ అవలేదు..





Comments