యంగ్ హీరో తండ్రికి కటకటాలు



పాపం రాజ్ తరుణ్‌కి టైం అస్సలు కలిసిరావడం లేదు. హిట్లు కొట్టిన రోజుల్లో ఇతగాడి జోరుకి అంతే లేకుండా పోయింది. ఓ దశలో డైరక్టర్లకే సలహాలు ఇచ్చేవాడని అంటారు. అలా ప్రతి విషయంలో చేయి పెట్టే..మూడు సినిమాలు పోగొట్టుకున్నాడు. వాటిలో దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా..వంశీ తీసిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్..ఉన్నాయి. అలా అయినా ఏదోరకంగా ఏడాదిలో మూడు సినిమాలు విడుదలయ్యేలా చూసుకున్న రాజ్ తరుణ్‌కి ఇప్పుడు వరసగా ఫ్లాపులు వచ్చిపడుతున్నాయ్..సినిమాల పరంగా ఇలా డల్ గా ఉన్న రాజ్ తరుణ్‌కి పెద్ద షాకింగ్ న్యూస్..అది తన తండ్రికి కోర్టు జైలు శిక్ష విధించడం. అది కూడా చీటింగ్ కేసులో.ఈ విషయంలోని వివరాలు చూస్తే..సింహాచలం లో రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్‌గా పని చేశేవారు. విశాఖపట్నం వేపగుంటనుంచి రోజూ సింహాచలంకి వెళ్లి పని చేసి వచ్చేవారు..ఐతే బ్యాంకులో..బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారాయన. ఇది 2013లో జరిగింది. ఐతే బ్యాంక్ అధికారులు ఎప్పటికప్పుడు చేసే తనిఖీల్లో పాత బకాయి కట్టని ఈ ఖాతాని వెరిఫై చేసారు. బ్యాంకు ఉద్యోగి కూడా అయిన బసవరాజు ఎందుకు లోన్ తిరిగి కట్టడం లేదని లోతుగా విచారించారు. అప్పుడే ఆయన తాకట్టు పెట్టిన బంగారాన్ని కూడా తనిఖీ చేశారు. అప్పుడే అది అసలు బంగారం కాదని..నకిలీదని తేల్చారట. దీంతో బసవరాజుపై అక్కడి బ్యాంక్ మేనేజర్ కంప్లైంట్ చేయడంతో...గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. విచారణ చేసిన తర్వాత తప్పు చేసినట్లు తేలడంతో మూడేళ్లు జైలుశిక్ష పడింది. దీంతో పాటు 20వేల రూపాయిలు ఫైన్ కూడా కట్టాల్సి ఉంది. స్వయంగా ఓ హీరోకి తండ్రి కూడా అయి ఉన్న తమ బ్యాంకు సహ ఉద్యోగే ఇలా చేయడంతో సింహాచలం బ్రాంచ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు.
మరోవైపు కిట్టూగాడు ఉన్నాడు జాగ్రత్త..అంటూ చిన్న చిన్న మోసాల పాత్రలు చేసిన రాజ్ తరుణ్...తండ్రికి ఇలా శిక్ష పడటంపై తలపట్టుకున్నాడు..ఎంత దాద్దామనుకున్నా..ఇలాంటి విషయాలు బైటికి తెలీకుండా ఉండవు..అందులోనూ సెలబ్రెటీలకు సంబంధించిన ఏ విషయం అయినా..గుప్పు మంటుంది. అలా తన కుటుంబపరువు పోయే ఈ విషయంపై ఎవరెలాంటి బ్రేకింగ్స్ వేస్తారో అని రాజ్ తరుణ్ గుంజాటన పడ్డాడు

Comments