మీకు పాతికేళ్లా..! ఐతే లక్షాధికారి అయినట్లే!


మీకు పాతికేళ్ల వయస్సు వచ్చిందా...?
 ఐతే మీకు దాదాపు రూ.8లక్షలు అప్పనంగా వచ్చి పడ్డట్లే..నిజంగానా..అవును..అయితే అది ఇక్కడ కాదు..లండన్‌లో
ఎలా..ఏంటీ ఆఫర్?
రిజల్యూషన్ ఫౌండేషన్ ఇంటర్‌జెనరేషనల్ కమిషన్ అని ఒక సంస్థ ఉంది యుకేలో.! ఈ ప్రభుత్వ సంస్థ అభిప్రాయం ప్రకారం ప్రతి బ్రిటన్ పౌరుడు, పాతికేళ్ల వయసు రాగానే పదివేల యూరోలు ప్రభుత్వమే చెల్లించాలి. ఇది అక్కడి మిలీయనిల్స్, బేబీ బూమర్ల మధ్య అంతరం తగ్గడానికి ఉపయోగపడుతుంది. (1946-65 మధ్య పుట్టినవారు బేబీ బూమర్లు)

ఎందుకిలా ఇవ్వాలి..ఎందుకీ ప్రతిపాదన
ఎందుకంటే సమాజంలో (యుకె) పెరిగిపోతోన్న ఆర్ధిక అసమానతలను చూస్తుంటే..యువతలో తెలీకుండానే ఒక రకమైన నేర ప్రవృత్తి పెరుగుతుందని..దానికి విరుగుడుగానే ఈ ప్రతిపాదన తెచ్చారు. యునైటెడ్ కింగ్‌డమ్ విషయంలో ఇది స్పష్టంగా కన్పిస్తోంది. కుటుంబపెద్దల ఆదాయానికి వారి సంతానం ఆదాయానికి బాగా తేడా కన్పిస్తుంది..ఇది పోవాలంటే ప్రభుత్వం ఇచ్చే సాయంతో సమస్య తీరుతుందనేది ఇంటర్‌జెనరేషనల్ కమిషన్ అభిప్రాయం
ఆస్తులు వారసత్వంగా పంచితే చాలదా..?
కుటుంబం ఆదాయం వారసత్వంగా పంచడానికి అందరికీ ఆస్తులు లేవు. మన కరెన్సీలో రూ.9కోట్లు కనుక వారసత్వంగా సంక్రమిస్తే..దానిపై 40శాతం పన్ను కట్టాలి. అంటే రూ..3.60కోట్లు పన్ను రూపంలో వదులుతుంది.
మరి అప్పనంగా వచ్చిన ఈ సొమ్ము ఏం చేస్తుంది
ఈ డబ్బుతో యూత్ ఇల్లు కొనుగోలు చేయడం కానీ..అద్దెకి తీసుకోవడం కాన ీచేయాలి. ఇంకా వీలైతే సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. ఇలా ధనం తిరిిగి డిస్ట్రిబ్యూట్ అవ్వడం ద్వారా ఆదాయ అంతరాలు తగ్గవచ్చు( బేబీ బూమర్ల పెన్షన్ , మిలీనియల్స్ పెన్షన్ కంటే చాలా ఎక్కువ)
మరి ఇంత ధనం అప్పనంగా ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గరనున్న మార్గాలేంటి
యుకేలో ఉన్న ఇన్ హెరిటెన్స్ ట్యాక్స్..వారసత్వపు పన్ను ఇందుకు మార్గం చూపుతుంది. ఇలా వసూలు చేసిన మొత్తంలో కొంత ఈ స్కీమ్‌కి వాడితే సమస్య పరిష్కారం అవుతుందని ఇంటర్‌జెనరేషనల్ కమిషన్ చెప్తోంది.
అసలు ఈ స్టోరీ మాకెందుకు చెప్తున్నారు..?
ఇదీ రావాల్సిన డౌట్, ఈ పథకం మన ఇండియాకి ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే మన దేశంలోని వారసత్వపు ఆదాయంపై వేసే పన్ను విధానం సరిగా లేదు. 1986లో ఇలా వారసత్వంగా సంక్రమించే ఆస్తులపై పన్ను తీసేసారు. అప్పటి విధానం ఇప్పుడు ప్రవేశపెట్టడం అసాధ్యం..ఆ ప్రతిపాదన వచ్చినా చాలు వెంటనే ప్రభుత్వాల కూసాలు కదిలిపోతాయ్..ఐనా అలాంటి చట్టం ఒకట ివస్తే..సరిగా అమలు చేస్తే..ఆర్ధిక అసమానతలు తొలగిపోతాయనడంలో సందేహం లేదు

ఇప్పుడెందుకీ ప్రస్తావన?
ఎందుకంటే ఆసియన్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్ టేక్ హికో నాకోవా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోన్న ఆర్ఘిక అసమానతలు ఆందోళనకరంగా మారాయని వ్యాఖ్యానించారు. కానీ ధనవంతులపై పన్ను వేయడమనేది బూమరాంగ్ అవుతుందని ఈ దిశగా ఏవైనా మంచి ఆలోచనలు ఉంటే ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవచ్చని కూడా చెప్పాడాయన. సామాజిక ఆర్ధిక పథకాలపై అందరు లీడర్ల థృక్పథం ఇప్పుడు మారుతోందని..సామాజిక భద్రత అంటే కనీస జీవనానికి భరోసా ఇచ్చే స్కీములు ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. వాటిలో యువత, మహిళలు, ఇంకా అవసరం ఉన్న వర్గాలకు అప్పులు సులభంగా ఇచ్చే ప్రక్రియవైపు చూస్తున్నారు. ముద్ర లోన్లు వీటిలో భాగమే. ఐతే ఈ రంగంలో ఇంకా ఆలోచనలు ముందుకు సాగాల్సి ఉంది. ఉత్తినే డబ్బు ఇచ్చి సోమరులను తయారు చేస్తున్నారనే అపప్రధ రాకుండా పర్యవేక్షణ అవసరం . ఇదే ివిషయం యూకెలోని సంస్థ కూడా నొక్కి చెప్పింది. మరి మన దేశంలో కూడా ఇలాంటి ప్రతిపాదనలు వస్తాయేమో చూడాలి


Comments