టిడిపి ప్రచారమే దెబ్బతీసిందా..? ప్రెస్‌మీట్ క్యాన్సిల్


ఇదీ ఇప్పుడు విన్పిస్తోన్న మాట..!
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు కదా..కనీసం 80సీట్లు తెచ్చుకున్నా..ఆ గొప్ప మాదే అని చెప్పుకోవడానికి టిడిపి సిధ్దంగా కాచుకుని కూర్చున్నవేళ..వెలువడిన ఫలితాలు ఆ పార్టీ నేతలనోటికి మాట రాకుండా చేసింది. మధ్యాహ్నం ఒంటిగంటకల్లా..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిధ్దమయ్యారని కూడా సెక్రటరియేట్ వర్గాల టాక్..కానీ ఎప్పుడైతే బిజెపి ఫుల్ మెజార్టీ సాధించడం ఖాయమైందో..ఇక ఎంత వీలైతే అంత తక్కువ మాట్లాడాలంటూ డిసైడయ్యారట..ఈ మేరకు వందిమాగధుల ఛానళ్లలో చర్చలకు కూర్చున్న నేతలు కూడా తమ అసహనం ప్రదర్శిచడం కన్పించింది

గాలికిపోయే పిండి కృష్ణార్పణంలా కాంగ్రెస్ గెలవబోతుందని..తెలుగువారికి అన్యాయం చేసినందుకు అక్కడివారు బిజెపికి బుద్ది చెప్పబోతున్నారంటూ రకరకాల మార్ఫింగుల ఫోటోలతో హడావుడి చేసిన బ్యాచ్ ఇప్పుడు ఇంకో వాదన ఎత్తుకునేందుకు సిధ్దమైంది. విజయసాయిరెడ్డి యడ్యూరప్ప పక్కనే ఉన్నాడు..ఇలా

ప్రచారం చేశాడు బిజెపి గెలవాలని అంటూ ఫొటొలతో హోరెత్తించిన బ్యాచ్ ఇప్పుడు నాలిక కరుచుకుంటుంది. అదే నిజమైతే..ఇప్పుడు బిజెపి గెలవడానికి వైెస్సార్సీపీ సాయపడటం నిజమవ్వాలి. కొన్ని ఛానల్లు ఏకంగా డిస్కషన్లు..గట్రా పెట్టి టిడిపి నేతలను దించేసి మైలైజీ కోసం గలీజు ప్రయత్నాలు కూడా చేసింది. ఐనా ప్రయోజనం లేకుండా పోయింది..మరోవైపు కర్నాటకలోని తెలుగువారిపై ఓ ముద్ర వేయడం ద్వారా  వారి ఉనికిని ప్రమాదంలో నెట్టేసే పరిస్థితి కూడా దాపురించింది.వాసిరెడ్డి పద్మ మాటల్లో ..ఏపికి హోదా అనే అంశమే ఓటమి పాలైనట్లు టిడిపి వైఖరి ఉందని ఆరోపించింది. ఆమె మాటలే నిజమైతే..టిడిపి చేసింది మామూలు ద్రోహం కాదు. కానీ ఆ పార్టీ అలా చేసి ఉండదనే అందరి నమ్మకం..వ్యాసకర్త కూడా కాంగ్రెస్సే గెలుస్తుందనే అభిప్రాయంతో ఉన్నా..ఇప్పుడు ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినప్పుడు అంగీకరించాలి. అంతేకానీ దానికి తెలుగువారి సెంటిమెంట్‌కి ఏంటి సంబంధం..అసలు ఏపికి ప్రత్యేకహోదాకి కర్నాటకలో బిజెపి గెలుపోటములకు ఏంటి సంబంధం..? ఇదే అంశం మొదట్నుంచీ మొత్తుకుంటున్నా...ఒక వర్గం ప్రచారం ముందు దాన్ని పట్టించుకున్నవాళ్లు లేరు. ఇప్పుడైనా ఆ ప్రచారపటాటోపం నుంచి బైటపడాలని ఆశిద్దాం

Comments