దాడి భ్రమ..ఇటుకరాయి భ్రమ..భలే పొలీస్


"అమిత్‌షా పై దాడి జరగలేదు"
ఇది టిడిపి నేతల మాట..
"మా అధ్యక్షుడిపై దాడి చేస్తారా..ఇది ఘొరం..దీనికి ఫలితం అనుభవిస్తారు.."
 బిజెపి నేతల సన్నాయిరాగం
"అమిత్‌షాపై రాళ్లదాడి జరగలేదు..ఎలాంటి కెమెరా దృశ్యాలు లేవు.."
ఇది ఏపీ పొలీస్ మాట..
"మొడీకి కూడా అమిత్‌షాకి పట్టిన గతే పడుతుంది.."
జూపూడి ప్రభాకర్ ప్రకటన..
ఇవన్నీ చూస్తుంటే..టిడిపి నేతల తెంపరితనం బైటపడటం లేదా...ఆ రొజు తిరుమల చెక్‌పొస్ట్ దగ్గర అమిత్‌షా వస్తున్నాడని తెలిసి భారీగా టిడిపి కార్యకర్తలు గుమిగూడటం నిజం..పెద్దగా అరుచుకుంటూ నినాదాలు చేస్తూ..రాళ్లు కర్రలతొ దాడి చేసిందీ నిజమే..కానీ కెమెరాల్లొ లేవని చెప్పడం  ఏపీ పొలీసులకే చెల్లింది..ఐతే కాన్వాయ్‌లొని ఏడొ వాహనం పై మాత్రం ఒక వ్యక్తి కర్రతొ దాడి చేశాడట..ఏమైనా అర్ధం ఉందా..అంటే రాళ్లతొ కొట్టాడంటేనే కేసా..లేకపొతే లేదా..సరే అదీ వదిలేద్దాం..మరి అమిత్‌షాకి పట్టిన గతే మొడీకీ పడుతుందని చెప్పడం వెనుక ఆంతర్యమేంటి జూపూడీ..

వాస్తవానికి అమిత్‌షాకి ఎదురుగా నిరసన, దాడి ఏది జరిగినా జనాలకు వచ్చే ప్రయొజనం లేదు..నష్టం లేదు..దానికేదొ భూమి బద్దలైనట్లుగా బిల్డప్ ఇవ్వడం బిజెపినేతలకే చెల్లు..ఒకవైపు జనంలొ ఇమేజ్ కొసం తాపత్రయపడుతూనే కేసులు పెట్టకూడదన్నట్లుగా ఉఁది టిడిపినేతల వైఖరి..నిజంగా అక్కడ ఎలాంటి పైటింగ్ సీన్ లేకపొతే.." బాబూ మాకంత సీన్ లేదు..మిమ్మల్నీ మీ దొస్త్‌ని చూస్తేనే మాకు ప్యాంట్ తడిసిపొద్ది ..మేం మీపై దాడి చేసేంతటి వాళ్లమా.." అని చెప్పుకొవాలి. అది వదిలేసి కాసేపు మాకు చాలా మర్యాద ఉందని చంద్రబాబు చెప్పడం ఏంటి..పైగా ఆ రొజే టిడిపి కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ లీకులు ఎందుకిచ్చినట్లు..అంటే చిన్నపాటి నిరసన కూడా అమిత్‌షా ముందు చేయకూడదనా...లేక ఆయన కాన్వాయ్‌పై ఎటాక్ జరిగిందని పక్కాగా చంద్రబాబుకి తెలిసిపొయిందా..?
ఈ రెండు పార్టీలంటే మైండ్ గేమొ లేక..ఇమేజీ గేమొ ఏదొ ఆడుతున్నాయి..పొలీసులకు ఏమైంది కెమెరా దృశ్యాలు లేవని చెప్పడమేంటి..16 చానళ్ల దగ్గరా అవే దృశ్యాలు పదే పదే ప్రసారం చేశాయ్ కదా..అంటే మీరనే దృశ్యాలు మీ కెమెరాల్ల ొ మాత్రమే రికార్డ్ కావాల్సినవా..భలేవాళ్లు సామీ..!

Comments