రోజా మాత్రం మహిళ కాదా..తీరు మారని బుద్దా


రజనీకాంత్ సినిమాల్లో ఒక డైలాగ్ ఉంది..శిష్యా కొంతమందికి చెప్తే వింటారు..కొంతమందిని తంతేనే వింటారు అని..అలానే ఉంది టిడిపిలో ఓ సెక్షన్ ఆఫ్ లీడర్ల తీరు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే  ఆడబిడ్డకు రక్షణ ఇద్దాం పేరుతో ఓ ర్యాలీ ..పే..ద్ద కార్యక్రమం చేస్తుంటే..ఆయన సహచరులు మాత్రం స్త్రీలైతే ఎవడికేంటనే రీతిలో ఇష్టారాజ్యంగా నోరు పారేసుకోవడం విచిత్రమే..ఇదే చిత్తశుధ్దిలేమి అంటే అన్పించకమానదు
గత మన వ్యాసాల్లోనే రోజాపై నోరు పారేసుకున్న ప్రబుద్దుడి గురించి మాట్లాడుకున్నాం..దమ్ముంటే నాకు గుండు కొట్టించు అంటూ రోజా కూడా అదే స్థాయిలో రిటార్టు ఇవ్వడం కూడా చూశాం..కానీ మళ్లీ బుద్దా వెంకన్న బుద్ది గడ్డి కరిచిందో ఏమో కానీ..రోజా బురదలో పొర్లాడే పంది అంటూ కా్మెంట్ చేశాడు..ఇది చాలు రోజా అంటే ఈ నేతలకు ఎంత అక్కసో తెలియజేయడానికి. ఎందుకంటే రోజా ప్రతిపక్షనేత అయితే అయి ఉండొచ్చు అంతమాత్రాన పంది..బ్లూ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసింది అంటే ఎవరూ ఊరుకోరు..నిజంగా అంత ఆధారాలుంటే ఇప్పుడే కోర్టులూ అవసరం లేదు..డైరక్ట్‌గా ఏదోక ఛానల్‌లో ప్లే చేయవచ్చు( యూట్యూబ్ ఛానల్స్)..కానీ అవి మార్ఫింగ్ చేసినవి అని కనుక తేలితే..రోజా కేసు పెడితే..ఆజన్మాంతం జైల్లోనే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది..అందుకే ఈ భయంతోనే క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసే పనిలో పడ్డారు ఈ నేతలు..ఇందులో సందేహమే లేదు..ఓ వేళ బ్లూఫిల్మ్స్‌లో యాక్ట్ చేసిందనేది బుద్దా అభ్యంతరం అయితే టిడిపిలో ఎందుకు తిరగనిచ్చారనే అంశం కూడా చెప్పాలి..బహుశా అప్పట్లో అవి చూసి ఎంజాయ్ చేశాడా..పైగా మద్యం సేవించి మరీ ప్రెస్ మీట్లు పెడుతుందని మరో ఆరోపణ చేశాడు..ఇద్దరినీ పక్కపక్కనబెట్టి చూస్తే..ఎవరు మందుకొట్టి మాట్లాడుతుందీ క్లియర్‌గా అర్ధం అవుతుంది. పైగా మందు కొట్టడం తనకే హక్కుందని బుద్దా ఏమైనా భావిస్తున్నాడేమో..మందుకొట్టడమే బుద్దా అభ్యంతరం అయితే..అలాంటి లిక్కర్ షాపులు నిర్వహిస్తోన్న టిడిపి లీడర్లకు ఫస్ట్ అలాంటివి చేయొద్దని చెప్పాలి. వీలైనంత ఛండాలంగా మాట్లాడి రోజా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయడమే టిడిపి సెకండ్ గ్రేడ్ లీడర్ల లక్ష్యంగా జనానికి ఈజీగా అర్ధం అయిపోతుంది.
రోజాపై కేసులు పెట్టొచ్చు..కోర్టులకీడ్చవచ్చు..కానీ ఇలా ఆరోపణలు చేస్తూ..చీప్ గా బిహేవ్ చేయడమనేది ఎవరూ హర్షించరు..సరికదా బెయిల్ రాని కేసుల్లో ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంది 

Comments

  1. రోజాను సమర్ధిస్తూ వ్రాయడానికి ముందు మీకు సిగ్గు లేదు. ఆమెదేమైనా నోరేనా? అసలు ఆమె శాసన సభ్యురాలుగా అర్హత ఉందా? నన్నడిగితే ఇంకా TDP వాళ్ళది సహనమనే చెప్పాలి. ప్రతిరోజూ మీడియా ముందు TDP వాళ్ల గూర్చి ఆమె వాగుడు చూస్తుంటే చిరాక్ కలుగుతుంది. ఆమెకు నేనొక MLAను అని, తనను ఎన్నుకున్న నియోజకపు ప్రజలున్నారని గుర్తుందా? లేక ఎప్పుడూ TDP వాళ్ళను దుర్భాశాలాడడమేనా? జగన్ ఆమెను పీకేస్తేనే ఆ పార్టీకి లాభం ఉంటుంది. నా కామెంట్ చదివి నన్ను TDP అనుకుంటే మీ ఖర్మ.

    ReplyDelete

Post a Comment