తెలంగాణలొ టిడిపికి లీడర్లు కావలెను..వంటేరు బై బైతొ దీనస్థితి ,


ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట. లేస్తే మనిషిని కాదన్నాడట..ఇలాంటివెన్నొ సామెతలు ఎన్నొ చెప్పొచ్చు టిడిపికి అన్వయించి. ఒక్కొళ్లొక్కళ్లుగా తెలంగాణలొ పార్టీని వదిలించుకుని పొతుంటే..కామ్ గా చూస్తుండిపొయిన చంద్రబాబు ఏకంగా ఢిల్లీని గజగజలాడిస్తాననడం..ప్రధానమంత్రిని డిసైడ్ చేస్తా అనడం ఎలా ఉందొ చూడండి

గజ్వేల్ నియొజకవర్గంలొ కేసీఆర్‌కి చెమటలు పట్టించిన వంటేరు ప్రతాపరెడ్డి..పార్టీని వదిలేశాడు..అది కూడా చాలా హీనంగా..తాను పార్టీ తరపున పొరాడుతూ జైల్లొ పడితే కనీసం తనకి ధైర్యం కూడా చెప్పలేని నాయకత్వం తనకి వద్దంటూ..చంద్రబాబుకి లెటర్ రాసి మరీ బై చెప్పాడు..తన కానిస్ట్యుయెన్సీలొ కేడర్‌తొ మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఇక పార్టీలొ ఉండీ ప్రయొజనం లేదని..తన ఉనికి కాపాడుకొవాలంటే బైటికి రావడమే తప్పదని తేల్చేశాడు వంటేరు. అంటే ఇక్కడ పవర్ లొ ఉన్న పార్టీ ఎలా వేధిస్తుందొ చెప్పకనే చెప్పాడు.. మరి అనునిత్యం కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పే నారా చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లీడర్లకు ఎలాంటి అండనిస్తారొ గతంలొ రేవంత్ రెడ్డి విషయంలొనే చూశారు..ఇప్పుడు ఆ పరిస్థితి వంటేరుకి ఎదురై ఒంటరిగా మిగిలాడు..ఇలాంటి పార్టీని ఎలా కాపాడుకొవాలొ తెలీని చంద్రబాబు ఏకంగా ఢిల్లీకే వార్నింగ్ ఇచ్చే సత్తా ఉందంటే ఎవరైనా నమ్ముతారా..కనీసం ఆ సందేహమైనా రాదా..? పక్క రాష్ట్రంలొ లీడర్లు కేసులు ఎదుర్కొలేక గుడ్ బై చెప్తుంటే..ప్రధానమంత్రినే డిసైడ్ చేస్తామని ఎలా చెప్తారని పార్టీ కేడర్ ఆలొచించదా..
వంటేరు గుడ్‌బై‌ చెప్తూ..చివరి మాట అన్నదేంటంటే..తన నియొజకవర్గంలొ దళితులకు మూడెకరాలు భూమి, నిరుద్యొగులకు ఉద్యొగాలు ఇస్తే తానే కేసీఆర్‌కి ఒటేస్తాడట..అర్ధమైందా..సిగ్నల్స్ ఏమిచ్చాడొ..అతగాడి రూటేంటొ కూడా  తెలిసిపొయింది కదా...! పదండి ఇక నెక్స్ట్ ఎవరు తలుపు తొయబొతున్నారొ చూద్దాం..

Comments