కలిసి ఉద్యమించాలా..? ఆపండి ఆమేసా గారూ..


చలసాని శ్రీనివాస్ గారు మళ్లీ హడావుడి చేస్తున్నారు. ఈ సారి విద్యార్ధులు..బస్సుయాత్రలు, చైతన్యసదస్సులు అంటూ హడావుడి చేస్తారట. బాబూ ఇప్పటిదాకా మీరు చేసింది చాలు..అటు టిడిపి..ఇటు వైఎస్సార్సీపీ రెండూ చేస్తొన్న పొరాటంలొ ఉద్యొగసంఘాలు..విద్యార్ధులను మినహాయించండి..వీళ్లకి తొడు పవన్ కల్యాణ్ ఎటూ ఉండనే ఉన్నాడు..నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికి కాదు..నేనెందుకు చెప్తున్నానంటే..అంటూ అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతూ..అవసరమైతే రొడ్లమీద పొరాటాలకు సిధ్దం కండి..అంటాడు..ఎవరు పొరాడాలి..ఎవరితొ పొరాడాలి.?


మీకు మీరు ఆంధ్రా మేధావులు అని ఒక ఫొరం..దానికొ బిళ్ల పెట్టుకుంటే సరిపొయిందా..రాష్ట్రంలొ సమ్మెలు చేస్తే కేంద్రానికి తెలుస్తుందా...ఏమైనా అర్ధంఉందా..చేతనైతే జిఎస్టీ కట్టించడం ఆపేయండి..జిఎస్టీ కట్టొద్దని వ్యాపారులకు పిలుపు ఇవ్వండి..అలానే రైళ్లు నడవవనీయమని చెప్పండి..అప్పుడు కేంద్రప్రభుత్వానికి సెగ తగులుతుంది కానీ..ఇలా రాష్ట్రంలొ ఊకదంపుడు ఉపన్యాసాలు..కాళ్లకి బలపాలు కట్టుకుని తిరిగితే ఏం వస్తుంది..దయచేసి ఈ రాజకీయాలు మానండి..మీకు నిజంగా ప్రత్యేకహొదానే కావాలని అనిపిస్తే..చంద్రబాబుని జగన్‌ని ఇద్దరినీ మీ టెంట్‌లొకి లాక్కురండి..ఒక్కసారే కేంద్రం దగ్గరకి వెళ్లే ధైర్యం చేయండి..అంతేకానీ..పొలిటికల్ పువ్వుల్లాగా పచ్చపువ్వులు పెట్టకండి మాకు. తెలుగుదేశానికి ఏం కావాలొ మాకంటే మీకే తెలుసు..అందుకని మీ పని మీరు చేసుకొండి..ఎవడికి కావాలి చైతన్యం..జనానికి మీరేం ఇవాళ కొత్తగా హొదా అంటే ఏమిటొ చెప్పక్కర్లేదు..మీ నేతలకు మీకు తెలియజెప్పుకుని ఢిల్లీకి వెళ్లండి..మా మామూలు జనాన్ని అడ్డంపెట్టుకుని మీ పేరు తెచ్చుకునే ప్రయత్నాలు మానండి..

Comments