ఆర్నెల్లు తిరిగేలోపు కర్నాటక పీఠంపై బిజెపినేనట..ఎలాగంటే


కర్నాటకలో కేవలం 37 సీట్లు మాత్రమే దక్కించుకుని ముఖ్యమంత్రిగా మారిన కుమారస్వామికి పీఠం తొందర్లోనే
పీఠం చేజారిపోతుందట. బిజెపి లీడర్ యడ్యూరప్ప ఇలా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే అటు కాంగ్రెస్, ఇటు జెడిఎస్ రెండు పార్టీలకు మంత్రిపదవుల పందేరంలో ఇప్పటికే నానాసిగపట్లూ పట్టుకోగా..కేటాయించిన శాఖలపై జనంలోకూడా అసంతృప్తి బైల్దేరిందట. ఎందుకంటే 8వ తరగతి మాత్రమే చదివిన జిటి దేవెగౌడకి విద్యాశాఖ..పవర్ మినిస్ట్రీ కావాలన్న కాంగ్రెస్ నేత శివకుమార్ కి ఇరిగేషన్ కట్టబెట్టారు. కరెక్ట్ గా ఈ పాయింట్ పైనే యెడ్డి ఆశలు పెట్టుకున్నారు.

పవర్ ఉన్న పోర్ట్ ఫోలియోలు జెడిఎస్ కి అప్పగించి కాంగ్రెస్ తప్పు చేసిందని ఆయన లాజిక్. అందుకే ఆ పార్టీలోని చాలామంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్తున్నారాయన. టైమ్ రాగానే వీళ్లంతా బిజెపిలోకి జంప్ అవుతారట. వందకిపైగా సీట్లున్న బిజెపికి అధికారం చేజిక్కినట్లే చిక్కి వెంటనే జారిపోవడం గుర్తుండే ఉంటుంది. అందుకే కాస్త ఓపిక పట్టాలే కానీ..కాంగ్రెస్‌లోని మంత్రి పదవులు దక్కనివారిని కాస్త సైడ్ చేస్తే చాలు
ఇక రాజ్యం తమదే అని యెడ్యూరప్ప ఊహలపల్లకిలో ఊరేగుతున్నారు. అటు జెడిఎస్‌లోని వారు కూడా కొంతమంది బిజెపిలో సీట్లు దక్కక ఆ పార్టీనుంచిగెలిచిన వారు ఉన్నారు..అలాంటి రెబల్స్ ని కూడా ఈలోపు బుజ్జగిస్తే..కర్నాటకలో మళ్లీ పీఠం దక్కించుకోవచ్చని యెడ్యూరప్ప ఆశ పడుతున్నారు.

అందుకే రాగల ఆర్నెల్లలో తమ పంట  పండుతుందని చెప్తున్నాడాయన. ఐతే కాంగ్రెస్ మాత్రం తమకి ఉన్న 66మందికీ మంత్రి పదవులు ఇచ్చుకోవచ్చని ఇందుకోసం ప్రతి రెండేళ్లకి 22మందికి మినిస్టర్ గిరీలు కట్టబెడితే..అలా 66మంది మంత్రులుగా మారొచ్చనే లాజిక్ బైటపెట్టింది. దీంతో యెడ్డి ఆశలపై నీళ్లు చల్లుతారో..లేదో ఒక్క ఆర్నెల్లో తేలిపోతుంది. సరైన మెజారిటీ రాకపోతే వచ్చే తిప్పలే ఇవి.

Comments

  1. "పవర్ మినిస్ట్రీ కావాలన్న కాంగ్రెస్ నేత శివకుమార్ కి ఇరిగేషన్ కట్టబెట్టారు. కరెక్ట్ గా ఈ పాయింట్ పైనే యెడ్డి ఆశలు పెట్టుకున్నారు" ...

    ఖచ్చితంగా ఇక్కడే బీజేపీ కి అవకాశం బాగా ఎక్కువగా ఉంది. శివకుమార్ గారి వంటి కీలక వ్యక్తిని చులకనగా చూడటం వల్ల కుమారస్వామి గారు తన పదవికి తానే ప్రమాదం తెచ్చుకునే అవకాశం ఎల్లపుడూ పొంచే ఉంటుంది. ప్లస్ కావాల్సిన సంఖ్యా బలం పదిలోపే ఉండటం ఆయనకు దిన దిన గండమే. అహానిది పైచేయి అయినప్పుడు వాస్తవం గ్రహింపులోకి రావడమనేది అనుభవం తర్వాతే బోధపడుతుంది. its just a matter of time.

    బీజేపీ ఆ రోజున తొందరపడకుండా ఉన్నట్లయితే గనుక అతి త్వరలో వారికి అధికారం దక్కేది - అవమాన భారం తప్పేది.

    ReplyDelete

Post a Comment