లేడీ సూసైడ్ వెనుక నిజాలేంటి..నష్టాలా...డిప్రెషనా?


విశాఖపట్నం అమ్మాయి..బాంబే‌లొ ఇన్వెస్ట్ చేయడమేంటి..అక్కడ నష్టాలు వస్తే..హైదరాబాద్ వచ్చి సూసైడ్ చేసుకొవడమేంటి..ఇవాళ్టి ఉదయం న్యూస్ చూస్తే ఈ అనుమానమే వస్తొంది..కొంగర సుష్మ..వెంకటేశ్వరరావ్ ఆమె తండ్రి..విశాఖ సీతమ్మధారలొ ఉఁటారట..అంటే ఈ అమ్మాయి తన ఉద్యొగరీత్యా బాంబేలొ చేస్తుండాలి..అక్కడే స్టాక్ మార్కెట్‌లొ ఇన్వెస్ట్ చేసి ఉండాలి..భరించలేనంత నష్టాలు వచ్చాయని మాదాపూర్ హొటల్ లొ సూసైడ్ చేసుకుందని అంటున్నారు..
అసలు నిజంగా ఇది సూసైడేనా..మొదటి అనుమానం..ఎందుకంటే..ఆమె రాసిన సూసైడ్ లెటర్‌లొ తనకి డిప్రెషన్ తొ బాధపడుతున్నట్లు అనేకసార్లు ప్రస్తావించింది. అంతేకానీ పైకి చెప్తున్నట్లు స్టాక్ మ ార్కెట్లలొ నష్టాలతొ చచ్చిపొతున్నట్లు ప్రముఖంగా ప్రస్తావించలేదు..అంటే ఈమె మానసిక దుర్భలతను సరిగా ట్రీట్ చేయకనే..ఇలా చనిపొయిందని భావించాలి..అది సమాజం చేసిన హత్యే అవుతుంది కానీ..సూసైడ్ కాదు.


  వస్తువులను వాడుకుని మనుషులను ప్రేమించాల్సిన సమాజం, మనుషులను వాడుకుని వస్తువులను ప్రేమిస్తే ఇలానేజరుగుతుంది

తన బలహీనతను కప్పి పుచ్చుకునేందుకు పిల్స్ ఎక్కువ వాడుతున్నానంటూ కూడా ఆమె లేఖలొ రాసుకొవడం గమనించవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్లలొ పెట్టుబడి పెట్టేముందు అది మన జీవితాన్ని తలకిందులు చేసే ధనాన్ని మాత్రం పెట్టకూడదు అని చెప్పేది. ఏదొ ఆ డబ్బు ఎటువంటి రూపంలొనూ మనకి అవసరం లేదు అనుకునేది మాత్రమే పెడితే నష్టపొయినా జీవితం తలకిందులు కాకుండా ఉంటుంది..కానీ ఒకసారి లాభం వచ్చింది కదాని..మళ్లీ మళ్లీ పెట్టుబడి పెట్టడం..వాడెవడొ చెప్పాడు..వీడెవడొ చెప్పాడు వాడెవడికొ లాభం వచ్చింది..వీడికి లక్షలు కలిసి వచ్చాయి అని ఏజెెంట్లు,,బ్రొకర్లు..చెప్పే మాటలు విని మాత్రం పెట్టవద్దు..ఎందుకంటే నష్టం వస్తే భరించేది మనమే..కళ్లు మూసి తెరిచేలొపల డబ్బు మాయం అయ్యే వ్యాపారంలొ వేరే అవసరాల కొసం కష్టపడి నానా అగచాట్లు పడి సంపాదించిన సొమ్ముని పెట్టుబడిగా పెట్టొచ్చే లేదొ మీరే ఆలొచించుకొండి. ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి నిజమేంటొ త్వరలొనే తెలుస్తుంది కాబట్టి..మనం తీర్పరులు కావద్దు

Comments