జగన్‌తో జూనియర్ సెల్ఫీ చెప్పే కథలు


వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఒకవైపు ఎన్ని విమర్శలు ఎదుర్కొంటారో..మరోవైపు అదే స్థాయిలో ప్రశంసలు కూడా తెచ్చుకుంటుంటారు. సినిమారంగంలోనూ ఆయనకి క్రేజ్ ఉన్న సంగతి ఇప్పుడిప్పుడే బైటికి వస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ తన బర్త్ డే సందర్భంగా పాదయాత్ర చేస్తోన్న జగన్ కి సిఎం అయ్యే అవకాశాలు ఉన్నాయనే సంగతి చెప్పారు. అలానే నాగార్జున, మోహన్ బాబు అడపదడపా కలుస్తుంటారు జగన్ ని..ఐతే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా జగన్ తో సెల్ఫీ దిగడం మాత్రం అలాంటి ఇలాంటి సెన్సేషన్ కలిగించడం లేదు.

ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటి అభిమానులు..నందమూరి అభిమానులు..అలాంటి
నందమూరి ఫ్యామిలీ హీరో ఇలా వైఎస్ జగన్‌తో సెల్ఫీ దిగడం చిన్న విషయం కాదు. నిజానికి పార్టీలు వేరైనంత మాత్రాన కలవకూడదని ఫంక్షన్లకి పిలుచుకోకూడదని ఎక్కడా లేదు. కానీ వైఎస్ జగన్ విషయంలో మాత్రం పచ్చమీడియా ఇదే విధానాన్ని అనుసరిస్తూ..ఎక్కడిక్కడ విష ప్రచారం చేసేది. 2009 ఎన్నికలలో టిడిపికి ప్రచారం చేసి ప్రమాదం పాలైన జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీకి వీరాభిమాని. తన జన్మలో పార్టీ వదిలేది లేదని చాలాసార్లు చెప్పాడు. కానీ ఆ తర్వాతి పరిణామాలతో పార్టీ నుంచి తండ్రి హరికృష్ణ నెట్టబడటంతో దూరంగా ఉంటూ
వచ్చారు. చెప్పుకోవడానికే పార్టీలొ కొనసాగుతున్నారు కానీ ఆయనకి ఓ ప్రాధాన్యత లేదు. అందుకే జూనియర్ టిడిపికి దూరం ఉండటమే కాకుండా..తన సన్నిహితులను వైఎస్సార్సీపీలోకి వెళ్తున్నా సైలెంట్ గా ఉన్నారంటారు.

బాద్షా షూటింగ్ సమయంలో ఇదే విషయంపై రగడ జరిగితే..కొడాలి నాని నా సన్నిహితుడు..నేను టిడిపిని వదలను..కొడాలి అన్న ఏ పార్టీలో ఉన్నా నాకు సంబంధం లేదు..కానీ ఆయనకి ప్రచారం చేయడం మాత్రం చేస్తా..ఆయన  గెలుపు కోసం ప్రయత్నిస్తా అని కుండబద్దలు కొట్టాడు జూనియర్. ఇదే పద్దతి ఇప్పటికీ ఫాలో అవుతుంటాడు. కానీ తాజాగా కొన్ని రోజుల నుంచి హరికృష్ణ వైఎస్సార్సీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎవరూ ఖండించలేదు..నిర్ధారించనూ లేదు. ఈ నేపధ్యంలో జూనియర్..శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కన్పించిన జగన్‌తో కొద్దిసేపు మాట్లాడటం ఆ తర్వాత సెల్ఫీ దిగారంటారు. ఇది నందమూరి అభిమానులకు నచ్చకపోవచ్చేమో కానీ ఇందులో అంత పెద్ద రాధ్దాంతం ఏం లేదు. కానీ తన తండ్రి రాజ్యసభ సభ్యత్వం కోసమే ఇలా జగన్‌తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నాడని అంటారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్‌లో  మోహన్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. మోహన్ బాబు పెద్ద కోడలు జగన్ కుటుంబానికి దగ్గరి బంధుత్వం ఉంది. అలా జగన్  మోహన్ బాబు ఇంటికి వచ్చి పోతుంటారు. ఈ సందర్భంగానే రాజకీయంగానూ మోహన్ బాబు, నార్నె కుటుంబాలు యాక్టివ్ కావాలని కోరుకుంటున్నతరుణం. మరోవైపు హరికృష్ణ కూడా పొలిటికల్ స్పేస్ ‌కోసం ఎదురుచూస్తున్నారు. .వీరందరికీ కూడా చంద్రబాబు తమని టిడిపిలో వాడుకుని వదిలేశారనే ఆగ్రహం ఉంది..అలా అనేక కారణాలతో వైఎస్సార్సీపీ వారికి మంచి వరంగా కన్పిస్తోంది. ఇప్పటికే కృష్ణ తమ్ముడు ఆదిశేషగరిరావ్ కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన జగన్ వీరికి కూడా మంచి పదవులతో గౌరవిస్తారని టాక్. పైగా హరికృష్ణ సన్నిహితులుగా పేరుబడ్డ కొడాలి నాని ఇప్పటికే జగన్ పార్టీలో కృష్ణాజిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. మరో ఎమ్మెల్యే వల్లభనేనివంశీ కూడా జగన్‌ని ఓ సందర్భంగా కావలించుకున్నంత పని చేశాడు.

సెంటిమెంట్ పరంగా కూడా కృష్ణాజిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతా అనడం ద్వారా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో చాలామందిని జగన్ ఆకట్టుకున్నాడు. ఇలా అనేక కారణాలతో ఈ సెల్ఫీ జనం ముందుకు వచ్చిందంటున్నారు. ఐతే అంత సీన్ లేదు..ఇది జస్ట్ ఓ కాజువల్ స్నాప్ మాత్రమే అనే వాళ్లూ ఉన్నారు..అసలు ఇది డూప్లికేట్ అని చెప్పేవాళ్లకీ కొదవలేదు..దీన్ని మార్ఫింగ్ చేసిన ఫోటొ అని చెప్తారు కూడా ...ఐతే  జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో తమపై ఉన్న కులపిచ్చి ముద్ర తొలగించుకోవడానికి చాలా మారిపోయాడు. ఎప్పుడూ ఊహించని కాంబినేషన్లని వర్కౌట్ చేస్తూ, అబ్బురపరుస్తున్నాడు కూడా..!


Comments