కృష్ణ అండతో బాలసుబ్రహ్మణ్యానికి చెమటలు పట్టించి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?


అవి సూపర్ స్టార్ డమ్‌తో కృష్ణ చెలరేగుతున్న రోజులు..229 సినిమాలు పూర్తి చేసి 250వ సినిమావైపు దూసుకెళ్తున్నాడాయన. ఏడాదికి 12,13 సినిమాలు చేస్తున్నాడు. ఇంతలో ఒక సందర్భంలో గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, ఆయనకి ఓ విషయంలో తేడా వచ్చింది. నా సినిమాలకు పాడాల్సిన అవసరం లేదు అన్నారాయన. ఈయన కూడా ఓకే అనుకున్నారు. అప్పుడే ఓ నూతన గాయకుడికి బంపర్ ఛాన్స్ తగిలింది. జేసుదాస్‌తో తన సినిమాలకు పాడించుకుంటున్న కృష్ణ అతగాడికి వరస ఛాన్సులు ఇచ్చారు. ఇది 1985నాటి మాట. ఆ సింగర్ రాజ్ సీతారాం ఉరఫ్ రాజ్ సీతారామన్..అలా కృష్ణకి దాదాపు 30 సినిమాలకు పాటలు పాడాడతను..ఇప్పుడు ఉదిత్ నారాయణ్, శంకర్ మహదేవన్‌లు ఎలాగైతే వైవిధ్యం కనబరిచారో..అప్పట్లో అలానే కృష్ణకు ఆయన గొంతు సూటైంది..ఈ విషయంలో కొంతమంది సూటవలేదుఅనవచ్చు..సినిమాలు కూడా పోయాయి అనవచ్చు కానీ..అలా అన్నవాళ్లంతా బాలసుబ్రహ్మణ్యంపై అభిమానంతోనే తప్ప..నిజంగా కాదు. ఎందుకంటే 1985-1988 మధ్య మూడేళ్లలోనే రాజ్ సీతారాం కృష్ణకు ప్లే బ్యాక్ పాడగ..వాటిలో 14 సినిమాలు సూపర్ హిట్టయ్యాయ్. సూర్యచంద్ర, బ్రహ్మాస్త్రం, సింహాసనం, ఖైదీ రుద్రయ్య, నా పిలుపే ప్రభంజనం, తండ్రీకొడుకుల ఛాలెంజ్, దొంగోడొచ్చాడు, ముద్దాయి, శంఖారావం, దొంగగారూ స్వాగతం, కలియుగ కర్ణుడు, చుట్టాలబ్బాయి, రౌడీ నంబర్ 1. ఐతే ఇక్కడే రాజ్ సీతారాం సడన్‌గా కృష్ణ సినిమాలకు పాడటం ఆపేశాడు. ఇదే నిజం అనుకుంటారు..కానీ విషయం ఏమిటంటే..రాజ్ సీతారామన్ కు పాటలు పాడటం ఓ హాబీనే..కృష్ణకి పాడక ముందే అతను శోభన్ బాబు నటించిన జగన్ అనే సినిమాలో ఒక పాట పాడాడు. ఇఁడస్ట్రీలో మిగిలిన హీరోలు కూడా ఇదే స్థాయిలో అంటే కృష్ణగారిలానే ఎంకరేజ్ చేసి

ఉంటే విషయం వేరుగా ఉండేదేమో, కానీ అలా జరగలేదు. కానీ రాజ్ సీతారాం వాయిస్ మాత్రం చాలామందికి నచ్చింది. కొత్త హీరోలకు డబ్బింగ్‌తో పాటు, ప్లే బ్యాక్ కూడా చెప్పిద్దామని చాలామంది చూశారు. కానీ అప్పటి ిసినిమావర్గాల్లో ఓ వర్గం లాబీయింగ్ ఫలితంగా అది కుదరలేదు. అప్పట్లో కృష్ణగారి దగ్గరకు వేటూరి సుందర్రామూర్తి లాంటివాళ్లను  పంపి మీకు ఆయన గొంతు సెట్ అవలేదు. ఇలా కాదు..బాలుతో పాడించాల్సిందే. అంటే కృష్ణ పాత విషయాన్ని పక్కనబెట్టి..ఓకే అనేయడంతో బాలు తిరిగి కృష్ణ సిినిమాలకు పాడటం ప్రారంభమైంది. రాజ్ సీతారాం వాయిస్ ఇప్పటికీ పల్లెటూళ్లలో సింహాసనం, ఖైదీరుద్రయ్య పాటల రూపంలో మోత మోగుతుంటాయ్.
తమ ఉనికి కోసం కొత్త టాలెంట్‌ను పాతతరం వాళ్లు ఎలా తొక్కేస్తారనడానికి ఇలాంటి ఘటనలు చాలా ఉదాహరణలుగా చెప్తుంటారు.

 1990ల పత్రికలలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ తిరస్కరిస్తే..కృష్ణ ఆదరించారు అని చెప్పుకున్నారు బాలు ...ఈ రోజున మాత్రం కృష్ణగారు తన సినిమాల్లో పాడవద్దు అంటే ...మంచిది మీకు పాడేవారు మీకు పాడతారు, నాకు అవకాశాలు ఇచ్చేవాళ్లు నాకు ఇస్తారని అప్పట్లో అన్నట్లు చెప్తున్నారు. ప్లేట్ ఫిరాయించడం అంటే ఇదేనేమో..ఇక స్టోరీలో కథానాయకుడైన రాజ్‌సీతారాం ఏమయ్యాడనే విషయం ఆసక్తి కలిగించకమానదు. 


రాజ్ సీతారామ్ ఆ తర్వాత రూరల్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ పూర్తి చేసాడట. గుజరాత్‌లో ఈ కోర్సు తర్వాత, శ్రీరామ్ వెంచర్స్ గ్రూప్‌లో కొన్నాళ్లు పని చేశాడు. ఆ తర్వాత వీడియోకాన్ గ్రూపులో కూడా పని చేశాడంటారు. ఐతే యూఎస్ లో ఐవా ఫార్మా పిటిఈ లిమిటెడ్ అనే పెద్ద కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా పదవి నిర్వహిస్తున్నాడు. న్యూ జెర్సీ ప్రిన్స్‌టన్ ఏరియాలోని ఈ సంస్థ  ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. జెనెరిక్ ఫార్మాలో ఇది కూడా లీడింగ్ కంపెనీ. రెండేళ్ల క్రితమే ఈ సంస్థకు అమెరికా నుంచి 30 మిలియన్ డాలర్ల భారీ ఫండింగ్ సమకూరింది. ఇంత పెద్ద కంపెనీకి ఉపాధ్యక్షుడిగా పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ సీతారాం జగ్గీ వాసుదేవ్ నిర్వహించే ఈషా ఫౌండేషన్‌లో వలంటీర్ గా కూడ పని చేశాడు. పర్యావరణ హితం కోరుతూ జరిగే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటుంటాడు రాజ్ సీతారాం. 


Comments

  1. మంచి సమాచారానికి ధన్యవాదాలు. పాపం రాజ్ సీతారాం అనుకునేవాళ్ళం ఇప్పుడు ఆనందంగా ఉంది. వీలువెంబడి షణ్ముఖ శ్రీనివాస్ గురించి కూడా వ్రాయండి.

    ReplyDelete

Post a Comment