శ్రీకాంత్ భార్య ఎంత గొప్ప నటుడి బంధువో తెలిస్తే ఆశ్చర్యపోతారు


నటుడు శ్రీకాంత్ భార్య ఊహ అని కొంతమందికి తెలుసు. తనతో నటించిన ఊహ అసలు పేరు శివరంజని అని కొందరికే తెలుసు. ఊహ తెలుగులో నటించకముందే తమిళంలో 20 సినిమాల్లో హీరోయిన్. శ్రీకాంత్ అప్పటికీ ఎస్టాబ్లిష్ అయిన నటుడే తప్ప సోలోగా హీరో క్యారెక్టర్లు చేయలేదు. ఐతే ఇవివి సత్యనారాయణ డైరక్షన్లో వచ్చిన ఆమె అనే సినిమాలో శివరంజని పేరు కాస్తా, ఊహగా మార్చి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ సినిమా పరిచయమే ఊహ శ్రీకాంత్ ల ప్రణయానికి నాంది అయింది.

అలా వీళ్లిద్దరూ కలిసి మూడు సినిమాల్లో చేసారు.
ఐతే ఊహ చేసిన తొలి తెలుగు సినిమా ఆమె అయితే..ఆమె చివరి తెలుగు సినిమా కూడా శ్రీకాంత్‌తోనే ఆ సినిమా పేరు ఆయనగారు. ఇందులో ఆమెది డ్యూయెల్ రోల్. ఊహ  అప్పటిదాకా సినీరంగానికే పరిచయం లేని ఫ్యామిలీ అనుకుంటారు. అయితే ఆమె మేనమామ మన తెలుగులో ఎంతో పెద్ద రచయిత, అభ్యుదయ సినిమాలకు సంభాషణలు కూడా అందించారు. ఆయనే పిఎల్ నారాయణ. స్వతహాగా మలయాళీ అయిన పిఎల్ నారాయణ తెలుగువారిగానే పెరిగారు. గుంటూరు జిల్లా బాపట్ల ఆయన జన్మస్థలం కాగా..అక్కడివారితో ఆయన అనుబంధం ఎంతో ముడిపడి ఉంది. ఆయన అక్కడ్నుంచే ఒంగోలు ప్రజానాట్యమండలి ద్వారా కుక్క అనే నాటకం ప్రదర్శించడం టికృష్ణ గ్రూపుతో కలవడం జరిగాయి. రుద్రవీణ, నంబర్ వన్, కర్తవ్యం, నేటి భారతం, రేపటి పౌరులు, మయూరి వంటి సినిమాల్లో ఆయన నటన గుర్తుండిపోతుంది. అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమాకి ఆయన మాటలు రాశారు. టి.కృష్ణ సినిమాల్లో ఆయనకి ఖచ్చితంగా ఓ రోల్ ఉండేది. కార్మికనేత, లాయర్, బడిపంతులు, తాగుబోతు, బెగ్గర్ ఇలా ఏ
క్యారెక్టరైనా ఆయనే చేసేవారు. అలాంటి పిఎల్ నారాయణ మేన కోడలే ఈ ఊహ. అందుకే సినిమారంగంలోని వ్యక్తిని పెళ్లాడతామన్నా ఊహ కుటుంబంలో అంగీకారం వెంటనే దొరకగలిగింది. విశేషం ఏమిటంటే, పెళ్లి అవకముందే ఊహ పెద్ద నటి కాగా..పెళ్లైన తర్వాత మాత్రం కుటుంబానికే అంకితమైపోయింది. ఇప్పుడీ కుటుంబానికి ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు..వారిలో రోషన్ ఓ సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా వేశాడు. అది నిర్మలా కాన్వెంట్. శ్రీకాంత్ ప్రస్తుతం తన
సోదరులకు సంబంధించిన స్కూళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చూసుకుంటూ  అడపాదడపా సినిమాల్లో చేస్తున్నాడు



Comments