సర్వే డీటైల్స్ మార్చలేదు..నాకా అవసరం లేదు, వరంగల్, అదిలాబాద్ జిల్లాలూ కాంగ్రెస్‌వే -లగడపాటి కౌంటర్

" నే చెప్పింది నిజం...37 సీట్లలో కేటీఆర్ అడిగినందుకే సర్వే చేశా...అందులో ఎక్కువశాతం కాంగ్రెస్‌కే ఫేవర్ గా ఉందని చెప్పా. నేను చెప్పినది  ఆయనకు నచ్చకపోవచ్చు..కానీ ఎవరి ఒత్తిడితో మార్చలేదు..మార్చను కూడా..నా టీమ్ చేసిన సర్వే మాత్రమే ఇది ".
లగడపాటి సర్వే అంటూ ఆయనే స్వయంగా ఓ ఐదుగురు ఇండిపెండెంట్లు గెలుస్తారంటూ చెప్పగానే..కేటీఆర్ ట్వీట్ల దాడి చేశారు. దీన్ని ఓ బోగస్ సర్వే చంద్రబాబు ఒత్తిడితో మార్చారంటూ ఆరోపించారు. ఐతే లగడపాటి వెంటనే రంగంలోకి దిగారు. తాను ఎవరి ఒత్తిడితో చేయలేదని..చెప్పాల్సిన నిజం చెప్పానని లగడపాటి రాజగోపాల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. తాను సర్వే చేసిన టైమ్‌ని తప్పుబట్టవద్దని..ఇంకా..రోజులు గడిచేకొద్దీ మార్పులు జరుగుతాయని చెప్తూనే...వరంగల్ జిల్లా కూడా కాంగ్రెస్ ఆధిక్యత చూపిస్తుందని చెప్పడం విశేషం.
అదిలాబాద్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తుందని..జనం ప్రతి అంశాన్ని ఎన్నికలకు ముందు గుర్తుకు తెచ్చుకుంటున్నారని చెప్పడం విశేషం..పోటాపోటీ ఉన్న చోట ఇలా పాత హామీలను గుర్తుకు తెచ్చుకుంటారని లగడపాటి చెప్తున్నారు. ఐతే ఇలా చెప్పడంతోనే  తాను రాజకీయాలకు దూరం అంటూనే ఎంత దగ్గరో చెప్పేశారు. దీంతో టిఆర్ఎస్ టీమ్ ఆయనపై మండిపడుతోంది..ఓ వేళ లగడపాటి చెప్పేదే నిజం అయితే..మరి వాళ్లకి కాలకుండా ఎలా ఉంటుంది. పైగా ఆయనపై వ్యక్తిగతంగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అందుకే ఇలా లగడపాటి ఓపెన్  అయ్యారనుకోవచ్చు

ఐతే ఒకటి సర్వే అంటూ కొన్ని ఫలితాలు చెప్పినంత మాత్రాన జనం దానికి అనుకూలంగా మారతారని భ్రమ వద్దు.. చేయాలనుకున్నదే చేస్తారు..అది డిసెంబర్ 11న ఎటూ తెలియనుంది

Comments