కేజీఎఫ్..హిస్టరీ-2మరి అలా కేజిఎఫ్‌ని లీజుకు తీసుకున్న లావెల్లీకి బంగారం దొరికిందా..కేవలం కిరోసిన్ ల్యాంపులే ఉన్న ఆ రోజుల్లో మైనింగ్ ఎలా జరిగింది..కళ్లముందు కన్పిస్తున్న బంగారం కొండని తవ్వడానికి
ఆ రోజుల్లో ఇప్పట్లా మోడర్న్ టెక్నాలజీ  అభివృధ్ది చెందలేదు..మరి టన్నుల కొద్దీ బంగారం ఎలా తీశారు..అంత చరిత్ర ఉన్న కేజిఎఫ్ ఇప్పుడెలాంటి స్థితిలో ఉందో తెలుసుకుందాం

 లీజు అయితే దొరికింది కానీ...ఎన్నో రోజులు లావెల్లీ తన అన్వేషణ కొనసాగించలేకపోయాడు..కానీ లివింగ్ డేంజరస్లీ పేరుతో ఓ నవలని రాయించాడు..ఇదే తర్వాతి కాలంలో అతనికి బాగా ఉపయోగపడింది. అది పార్ట్‌నర్స్ రూపంలో..మేజర్ జనరల్ బెర్స్‌ఫోర్డ్, మెకంజీ, సర్ విలియం, విలియం ఆర్బర్త్ నాట్ అనే నలుగురు మన హీరోతో చేతులు కలిపి మైనింగ్‌కి అవసరమైన ధనం ఇచ్చారు
దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ మైనింగ్ ఇంజనీర్ల రాక ప్రారంభమైంది. ఐతే ఆ తర్వాతి పరిణామాల్లో భాగంగా ఈ సిండికేట్ నుంచి మైనింగ్ ప్రక్రియ జాన్ టేలర్ అఁడ్ సన్స్ కంపెనీకి వెళ్లింది. అప్పుడే
దేశంలోనే మొట్టమొదటిసారిగా ఓ పవర్ జనరేషన్ కంపెనీని కోలార్ గోల్డ్ ఫీల్స్‌లో ఏర్పాటు చేశారు. కావేరీ నదిపై హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఏర్పాటు చేసి గనుల్లో నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేశారు.
1900 సంవత్సరంలో నెలకొల్పిన ఈ పవర్ జనరేషన్ యూనిట్‌కి న్యూయార్క్ నుంచి సెంట్రల్ ఎలక్ట్రిక్ కంపెనీతో పాటు స్విట్జర్లాండ్ నుంచి ఐషర్ వేస్ కంపెనీ సహాయం అందించాయి. అలా బెంగళూరు..మైసూరు ప్రాంతాలకంటే ముందే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో ఎలక్ట్రిక్ బల్బ్ వెలిగింది. అది కూడా నిరంతరాయంగా..

 కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం తవ్వి తీస్తోన్న సమయంలో బ్రిటీష్ ఇంజనీర్ల డాబూ దర్పానికి ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉండేది. వాళ్లవరకూ కేజిఎఫ్ ఓ మినీ ఇంగ్లండ్..వాతావరణం కూడా
అక్కడిలానే ఉఁడటంతో..ఇక్కడ వారికి ఓ హాలిడే స్పాట్‌లా ఎంజాయ్ చేసేవాళ్లు. బంగ్లాలు..క్లబ్బులు..హడావుడితో అక్కడ ఉండే మిగతా జనం కూడా బ్రిటీష్ కల్చర్‌కే అలవాటు పడ్డారు. ఐతే దీనికి పూర్తి విరుధ్దంగా ఇక్కడ కూలీవారి బతుకులు ఉండేవి..కేజీఎఫ్‌లో చూపించినంత ఘోరంగా కాకపోయినా..ఒకటే షెడ్‌లో రెండు మూడు కుటుంబాలు.. వాళ్లమధ్యనే తిరుగాడే ఎలుకలు..జీవితం దుర్భరంగా ఉండేదని చెప్తుంటారు. ఒక్క ఏడాదిలోనే ఇక్కడ కూలీలు 50వేల ఎలుకలను చంపారంటే వాటి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.

ఐతే కూర్చుని తింటే..కొండలైనా కరుగుతాయన్నట్లుగా..తవ్వుకుంటూ పోయేసరికి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో గోల్డ్ తగ్గిపోయి..ఫీల్డ్స్ మాత్రమే మిగిలాయి. దానికి తోడు బ్రిటీషర్ల హయాం కూడా ముగియడంతో..స్థానికులు..ఆంగ్లో ఇండియన్లు మాత్రమే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో టాప్ పొజిషన్లలో ఉంటూ వచ్చారు. 1956 సమయానికి గనులను జాతీయకరణ జరిగింది. 2001లో స్థానికంగా ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా కేజిఎఫ్ ను ప్రభుత్వం పూర్తిగా మూతవేసింది. దాంతో దేశంలోని బంగారంలో 95శాతం ఉత్పత్తి చేసిన కోలార్ గోల్డ్స్ చరిత్ర అంతమైంది. ఒకప్పుడు బంగారం తవ్వి తీసినచోట మురుగునీరు పారుతోంది..ఇప్పటికీ చాలామంది అక్కడ బంగారం నిల్వలు చాలానే ఉన్నాయంటారు..కానీ తవ్వితీస్తే వచ్చే స్వర్ణం కంటే..వాటిల్లే నష్టమే ఎక్కువని ప్రభుత్వం దాని జోలికి పోవడం లేదు..కథాంశం ఇది కాకపోయినా..కన్నడనాట కేజిఎఫ్ ఫేమస్ కాబట్టే.. కొత్తగా వచ్చిన కేజిఎఫ్ ని అద్భుతంగా అనూహ్యంగా ఆదరించారు. రూ.200కోట్ల మేర కాసుల వర్షం కురిపించారు. నిజంగా కూడా కేజిఎఫ్‌ని మైనింగ్ చేద్దామని గోల్డెన్ ట్రెజర్ హంటర్లు మాత్రం అప్పుడప్పుడూ సాహిస్తుంటారు..అలాంటివారికి కేజిఎఫ్ ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉఁటుంది.

Comments