ఎంత ధీమాగా దంచుతున్నాడో చూడండి..ఇదెవడి బాకా


పైన ఫోటోలో కన్పిస్తోంది చిట్టిబాబునాయుడట..జిల్లా చిత్తూరు..ఎండిపోయిన మొద్దులను నరికేటప్పుడు అటూ ఇటూ కదలకుండా కాలు అదిమిపెట్టి కొట్టినట్లు..అలా నరుకుతున్న  ఈ ఖల్ నాయక్ అలా ఎందుకు చేస్తున్నాడో కూడా చెప్పే ఓ వీడియో ఉంది..అది తర్వాత పెడదాం..ముందు స్టోరీ చదవండి..ఇంతకీ కింద పడుకుని ఈ ముగ్గురు హీరోలు వేసే శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి పేరు వేణుగోపాల్..ఏం చేశాడంటే..సదరు చిట్టిబాబు గారి కోడి దొంగతనం చేశాడట..
అదీ మరి..కోళ్లజాతిని సంరక్షిస్తూ..బోలెడంత దేశ సేవ చేస్తోన్న చిట్టినాయుడు..తన కోడి కన్పించకపోయేసరికి చిర్రెత్తుకొచ్చిందట..చిత్తూరు జిల్లాలోనే నా అంత మొనగాడు..నా బాస్ పులివర్తి నాని అఁత మొనగాడు ఎవరూ లేరు..అలాంటిది నా కోడిని కిడ్నాప్ చేస్తారా అంటూ అటూ ఇటూ తిరిగి చివరికి వేణుగోపాల్ తన కోడిని ఏసేసినట్లు తెలుసుకున్నాడు..( అదీ తెలీదు జస్ట్ వాడి అనుమానం అంతే)

ఇంకేముంది బాస్ క ికోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా..వెంటనే లాక్కొచ్చేశారు వేణుగోపాల్‌ని..మూడు గంటలపాటు ఎంక్వైరీ చేసారు..నువ్ నా కోడిని ఎలా చంపి ఉంటావో..నేనూ అలానే నిన్ను చంపుతా..అంటూ ఎలాగోలా చివరికి చంపకుండా కాళ్లూ చేతులూ విరగదీసి వదిలేశారు..

వేణుగోపాల్ కి శిక్ష వేసిన సంగతిని పోలీసులకు కూడా తెలిసేలా ఓ వీడియో వదిలారు..దీంతో జంతుప్రేమికుల సంఘం చాలా ఆనందించారు..అదీ కోడి ప్రాణం మాత్రం ప్రాణం కాదా...ఏ పార్టీ వాడైతేనేం మా చిట్టినాయుడు చేసిన పని సూపర్..అంటూ ఆయనకో అవార్డు కూడా ఇద్దామనుకున్నారు..పోలీసులు మాత్రం ఓ  చిన్న కేసు పెడదాం అనుకున్నారు..చిట్టినాయుడు బాస్ మాత్రం ఠాఠ్ అదేం కుదరదు..వన్యప్రాణి చట్టాలను సంరక్షించని ఎవడికైనా ఇదే గతి మా చిట్టిగాడు పట్టిస్తాడు..మీరు మాత్రం ఎఫ్ ఐఆర్  రాసుకుని మా వాడిని వదిలేయండ ిఅంటూ హుకుం జార ీచేశారు..అదీ కథ..ఇదన్నమాట మా బాకా 

Comments