రాజకీయ నాయకులకు కంటెంట్ డెవలపర్లు కావలెనట..


ఔను మరి అన్ని విభాగాల్లో తమకి అనువుగా మనుషులను తయారు చేసుకుంటుంటే..పాలిటిక్స్ లో మాత్రం ఏమైంది..అందుకే మన లీడర్లు వాళ్లకి బాగా అనువుగా ఉఁడే పాయింట్లు..సెలక్ట్ చేసి పెడితే..వాటిని తీసుకుని అసెంబ్లీలో..బయటా తెగ దంచి కొడతారన్నమాట.  ఈ విషయంలో బిజెపి ఎప్పుడూ ముందే ఉంటుంది..అందుకే ఆ  పార్టీ లీడర్ ఒకాయన ఏకంగా ఇంటర్న షిప్ పేరుతో ఓ నోటిఫికేషన్ ఎలా ఇచ్చాడో చూడండి

మరి జీతం కూడా చూడండి..పార్టీ ఐడియాలజీకి తగ్గట్లుగా రాస్తూ..ఇంగ్లీష్ లో అనర్గళంగా కాకపోయినా..అంతంత మాత్రంగా రాసినా..నెలకి 8వేలు ఇస్తారుట..ఇదీ ఉపాధి పథకం అంటే అన్పించకమానదు కదా..పైగా రాజకీయనాయకులకు దగ్గరగా ఉండాలని కోరుకునే యూత్ కి ఇదో అవకాశమే మరి..వాళ్ల ప్రాపకంతో జీతం ఎందుకు ఆ తర్వాత మేమే పనులు నడిపించేస్తాం అనుకుంటే పొరపాటు..ఇది మూడు నెలలు మాత్రమే..తర్వాత పెర్ఫామెన్స్ ని బట్టి..జాబ్ ఆఫర్ ఇస్తారుట..


పైన చూడండి..విమెన్ కాండిడేట్స్ కి రెండు స్టార్లు..ఏటా కోటిమందికి ఉద్యోగాలేమో కానీ ప్రతి బిజెపి లీడరూ ఇలా ఇద్దరిని హైర్ చేసుకుంటే ఈపాటికి లక్షమందికి ఉపాది దొరికేదేమో మరి..ఇదే పని అన్ని పార్టీలు చేస్తే..పదిలక్షలమందికి దేశవ్యాప్తంగా మంచి నికార్సైన రాజకీయ నైపుణ్యం ఉన్న యువకులు..యువతులు తయారయ్యేవారు..కనీసం అప్పుడైనా లీడర్ల నోటివెంట బూతులు కాకుండా..మంచి మాటలు దొర్లేవేమో..ఐనా ..ఈ ఇఁటర్న్ షిప్స్ లో నైపుణ్యం ఎందులో ఇస్తారో కూడా ముందే చెప్పలేమనుకోండి..

సోషల్ మీడియాని వాడేసుకుంటూ..ఎన్నికలలో గెలుపు..జనంలో ఇమేజ్ పెంచుకుందామనుకుంటున్న తరుణంలో ఈ ఇంటర్న్‌షిప్స్ ఆ ఒరవడిలో కొత్త విభాగం కింద అర్ధం చేసుకోవాలేమో


Comments