అరరే..లాలూ సమోసా..కన్పించడం లేదే


సమోసాలో ఆలూ కన్పిస్తోంది..కానీ పాపం..బీహార్‌లో మాత్రం లాలూ కన్పించడం లేదు..దాదాపు నాలుగేళ్లుగా ఆర్జెడీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లోనే మగ్గుతుండటంతో..ఈసారి ఎన్నికల ప్రచారం
చప్పగా సాగుతోంది. అవినీతికి పాల్పడటం..దానికి శిక్ష అనుభవించడం అటుంచితే..అసలు ప్రచారంలో లాలూ మార్క్ చమక్కులు కన్పించకపోవడంతో జనంలో జోష్ తగ్గిపోయిందంటున్నారు. ఎలాంటోళ్లనైనా తన హావభావాలతో
ఇమిటేట్ చేయడం..ఎక్కడిక్కడ పురాణపురుషుడిలా పోజులు కొట్టడం లాలూ స్టైల్

తన దోస్త్ అంటూ చెప్పిన నితీష్ కుమార్‌నే ఫాల్తూరామ్ అనగల సమర్ధుడు లాలూ..ఐతే ఇప్పుడు మాత్రం పాపం దాణా స్కామ్‌లో శిక్ష అనుభవిస్తోన్న లాలూ లేకపోవడంతో ఆ పార్టీ లీడర్లు కూడా నిరాశ చెందుతున్నారు. ఓట్లు పడటం పడకపోవడం వేరే సంగతి..తమకి బోలెడంత ఎంటర్ టైన్‌మెంట్ మిస్సైందని జనంతో పాటు లీడర్లూ ఫీలవుతున్నారు. ఆయన వారసుడు తేజస్వి యాదవ్ ఆయన పాత్రని పోషించేందుకు సిధ్దమైనా ఆ రేంజ్‌ మెరుపులు మెరిపించలేకపోతున్నారు. ప్రత్యక్షంగా కన్పించకపోయినా..లాలూ తన పార్టీ పాలిటిక్స్‌ని జైల్లోనుంచే నడిపించేస్తున్నారు. సీట్ షేరింగ్..కాండిడేట్ల ఎంపిక కూడా తన సూచనలతోనే చేసుకుంటున్నారు ఆర్జేడీ నేతలు..ఐతే లాలూ బైట ఉండటానికి లోపల ఉండటానికి చాలా తేడా ఉంది..అందుకే సమోసాలో ఆలూ ఉంది కానీ..బిహార్‌లో లాలూ మాత్రం లేడే అంటూ ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Comments