అరే..ఈ ఆవులు వాటంతట అవే పాలిస్తాయి..ఎక్కడెక్కడ తిరుగుతాయో తెలుసుకోవచ్చు


మ్యూజిక్ ప్లే చేస్తే..ఆవులు గేదెలు పాలివ్వడం సినిమాల్లో చూసి ఉంటాం..కానీ టెక్నాలజీ తోడైతే..అది నిజంగా కూడా జరుగుతుంది..ఇది ఆల్రెడీ ఇంగ్లండ్‌లో చేస్తున్నారట కూడా..మనమిక్కడ ఫోర్జీ నెట్వర్క్‌కే ఇంకా పూర్తిగా మళ్లలేదు..కానీ సౌత్ ఇంగ్లండ్ ఫామ్స్‌లో ఆవులు 5 జి నెట్వర్క్ ని  వాడేస్తున్నాయ్. 
సిస్కో కంపెనీ ఇక్కడ ఫార్మర్స్‌కి 5 జీ టెక్నాలజీని వాడటంతో ఇంటి దగ్గర్నుంచే ఆవులు ఎక్కడ తిరిగుతున్నాయ్..ఎక్కడ మేస్తున్నాయ్ లాంటివి కనిపెట్టేలా చేసారు. 5జీ కాలర్స్ ని ఆవులకు అమర్చి వాటిని ఇంట్లోనుంచే మానిటర్ చేసే సౌకర్యం కలిగించారు. అలానే మిల్కింగ్ సిస్టమ్‌ని కూడా అమర్చి రోబోటిక్ సిస్టమ్‌తోనే పాలు పితకడం కూడా చేస్తున్నారట. అంటే ఆవులే తమకి ఇష్టమైనప్పుడు పాలిచ్చి వెళ్తాయట..అలానే ఫామ్స్ లోకి ఎంట్రీ వద్ద ఐడీ కార్డ్స్ చెకప్ కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోతుందట..
అంతా విన్న తర్వాత ఇది మన దేశానికి సరిపడేది కాదులే అనుకోవద్దు..ఎందుకంటే కార్పొరేట్ ఫామింగ్‌లో ఈ పద్దతులు ప్రవేశపెడతారేమో చూడాలి మరి

Comments